విశాఖపట్నం-మెడికల్, న్యూస్‌లైన్:
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఫార్మసీ, డయాగ్నస్టిక్ సేవల్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయం తో ఉందని రాష్ట్ర వైద్య విద్యా సంచాలకులు జి.శాంతారావు చెప్పారు. గురువారం ఆయన కింగ్ జార్జి ఆస్ప త్రి, ఆంధ్ర వైద్య కళాశాలలను సందర్శించారు. కేజీహెచ్ ఇన్‌చార్జి సూపరింటెండెంట్ జి.వెంకటేశ్వరరెడ్డి, ఏఎంసీ ప్రిన్సిపాల్ ఎస్.వి.కుమార్‌లతోపాటు అన్ని వైద్య విభాగల అధిపతులతో సమావేశమై వైద్య సిబ్బంది, పరికరాల కొరతపై చర్చించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రోగులను బయటకు పంపకుండా చూసేందుకే ఈ సౌకర్యమ న్నారు.
అత్యవసర మందులు అం దుబాటులో ఉండేలా చూస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో 300 మంది అసిస్టెంట్ల ప్రొఫెసర్ల నియామకానికి సీఎం అనుమతి లభించిందని, ఆర్థిక శాఖ అనుమతి లభించిన వెంటనే భర్తీ చేస్తామని చెప్పారు. సూపర్ స్పెషాలిటీ వైద్య విభాగాల్లో నర్సుల కొరత వేధిస్తోందని నర్సుల సంఘం నేతలు ఆయన దృష్టికి తేగా త్వరలో పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు స్వీకరిస్తున్నట్లు చెప్పారు. రోగుల వసతి కోసం టి.సుబ్బరామిరెడ్డి నిర్మిస్తున్న డార్మె ట్రీ పనులను డీఎంఈ పరిశీలించారు. ఆయన వెంట డిప్యూటీ సూపరింటెంట్ బి.ఉదయ్‌కుమార్, ప్రొఫెసర్లు శివకుమార్, సుబ్బారావు, మెట్ట రాజగోపాల్, డిప్యూటీ సివిల్ సర్జన్ ఆర్.ఎం.ఓ.శాస్త్రి ఉన్నారు.
ఏఎంసీలో రూ.25 కోట్లతో ఎండీఆర్ ల్యాబ్
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఏఎంసీకి మల్టీ డిసిప్లినరీ రీసెర్చి లేబొరేటరీ (ఎండీఆర్)ని మంజూరు చేసింది. ఈ ల్యాబ్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రూ.5 కోట్లు వంతున ఐదేళ్లపాటు నిధులను సమకూరుస్తుందని డీఎంఈ డాక్టర్ శాంతారావు తెలిపారు.
ఫార్మసీ, డయాగ్నస్టిక్ సేవల బలోపేతానికి కృషి
Published Fri, Nov 15 2013 4:17 AM | Last Updated on Sat, Sep 2 2017 12:36 AM
Advertisement