ఎంసెట్.. ఉత్తమ స్కోరెంత..? | M SET best score how | Sakshi
Sakshi News home page

ఎంసెట్.. ఉత్తమ స్కోరెంత..?

Published Thu, May 29 2014 1:25 AM | Last Updated on Sat, Sep 2 2017 7:59 AM

ఎంసెట్.. ఉత్తమ స్కోరెంత..?

ఎంసెట్.. ఉత్తమ స్కోరెంత..?

 రాష్ట్రంలో ఇంజనీరింగ్, మెడికల్, ఫార్మసీ వంటి ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశానికి ఉద్దేశించిన ఎంసెట్ (ఇంనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్) మే 22న ముగిసింది.. ఇంజనీరింగ్, మెడికల్ విభాగాలకు కలిపి దాదాపు 3 లక్షల 70 వేల మందికిపైగా విద్యార్థులు హాజరైన ఈ పరీక్ష.. గతంతో పోల్చితే ఏ విధంగా ఉంది.. సబ్జెక్ట్, చాప్టర్ల వారీగా వచ్చిన ప్రశ్నలు.. వాటి క్లిష్టత.. తదితర అంశాలపై విశ్లేషణ..
 
 మ్యాథమెటిక్స్
 మ్యాథమెటిక్స్‌లో అధిక శాతం ప్రశ్నలు తెలిసినవే. కానీ వీటిని సాధించే ప్రక్రియ సుదీర్ఘమైంది కావడంతో ఎక్కువ సమయాన్ని వెచ్చించాల్సి వచ్చింది.మ్యాథమెటిక్స్ నుంచి అడిగిన 80 ప్రశ్నల్లో ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం నుంచి 40 ప్రశ్నలు, ద్వితీయ సంవత్సరం నుంచి 40 ప్రశ్నలు వచ్చాయి. కాబట్టి రెండు సంవత్సరాల సిలబస్‌కు సమప్రాధాన్యతనిచ్చారని చెప్పొచ్చు.ప్రశ్నల క్లిష్టతను పరిశీలిస్తే.. 51 ప్రశ్నలు సులభమైనవి కాగా 18 ప్రశ్నలు మధ్యస్తంగా ఉన్నాయి. 11 ప్రశ్నలు క్లిష్టమైనవి.కాలిక్యులేషన్స్ సుదీర్ఘమైనవి కావడంతో సాధారణ విద్యార్థులు 60 శాతం ప్రశ్నలను ప్రయత్నించలేని స్థితి.
 
 ముఖ్యంగా ఇన్‌డేఫైనేట్ ఇంటిగ్రేషన్, పారాబొలా, వన్ డిటర్మెనెంట్, వన్ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్ నుంచి అడిగిన ప్రాబ్లమ్స్‌కు ఎక్కువ సమయాన్ని కేటాయించాల్సి వచ్చింది. సులభమైన 51 ప్రశ్నల్లో అంశాల వారీగా వచ్చిన ప్రశ్నలు: కాలిక్యులస్-11, ట్రిగ్నోమెట్రీ-9, ఆల్జీబ్రా-9, ప్రొబాబిలిటీ-3, వెక్టర్ ఆల్జీబ్రా-4, కోఆర్డినేట్ జ్యామెట్రీ-15.మధ్యస్తంగా ఉన్న 18 ప్రశ్నల్లో అంశాల వారీగా వచ్చిన ప్రశ్నలు: కాలిక్యులస్-4, ట్రిగ్నోమెట్రీ-3, ఆల్జీబ్రా-5, ప్రొబాబిలిటీ-2, వెక్టర్ ఆల్జీబ్రా-1, కోఆర్డినేట్ జ్యామెట్రీ-3,క్లిష్టమైన 11 ప్రశ్నల్లో అంశాల వారీగా వచ్చిన ప్రశ్నలు: కాలిక్యులస్-4, ట్రిగ్నోమెట్రీ-1, ఆల్జీబ్రా-1, ప్రొబాబిలిటీ-2, వెక్టర్ ఆల్జీబ్రా-1, కోఆర్డినేట్ జ్యామెట్రీ-2.బెస్ట్ స్కోర్: 80. యావరేజ్ స్కోర్: 55.
 
 ఫిజిక్స్
 ఇంజనీరింగ్ విభాగంలోని ఫిజిక్స్ పేపర్ సులభంగానే ఉందని చెప్పొచ్చు.
 ఫిజిక్స్ నుంచి అడిగిన 40 ప్రశ్నల్లో ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం నుంచి 20 ప్రశ్నలు, ద్వితీయ సంవత్సరం నుంచి 20 ప్రశ్నలు వచ్చాయి. కాబట్టి రెండు సంవత్సరాల సిలబస్‌కు సమప్రాధాన్యతనిచ్చారని చెప్పొచ్చు.
 
 మొత్తం 40 ప్రశ్నల్లో సులభమైన ప్రశ్నలు-18, మధ్యస్తమైనవి-20, క్లిష్టమైనవి-2.
 నూతన సిలబస్ నుంచి 3 ప్రశ్నలు వచ్చాయి.మొదటి సంవత్సరం సిలబస్ నుంచి అంశాల వారీగా వచ్చిన ప్రశ్నలు: ఫిజికల్ వరల్డ్-1, యూనిట్స్ అండ్ మెజర్‌మెంట్స్-1, మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్-2, మోషన్ ఇన్ ఏ ప్లేన్-2, లాస్ ఆఫ్ మోషన్-4, వర్క్, ఎనర్జీ, పవర్-1, సిస్టమ్ ఆఫ్ ప్రాక్ట్టికల్స్ అండ్ రొటేటరీ మోషన్-1, ఆసిలేషన్స్-1, గ్రావిటేషన్-1, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్-1, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్-1, థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్-2, థర్మోడైనమిక్స్-2.
 
 ద్వితీయ సంవత్సరం సిలబస్ నుంచి అంశాల వారీగా వచ్చిన ప్రశ్నలు: వేవ్స్-1, రే ఆప్టిక్స్ అండ్ ఆప్టికల్ ఇన్‌స్ట్రుమెంట్స్-2, వేవ్ ఆప్టిక్స్-1, ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్-1, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్-1, కరెంట్ ఎలక్ట్రిసిటీ-2, మూవింగ్ చార్జెస్ అండ్ మాగ్నటిజం-2, మాగ్నటిజం అండ్ మ్యాటర్-1, ఎలక్ట్రోమాగ్నటిక్ ఇండక్షన్-1, ఆల్టర్నేటింగ్ కరెంట్స్-1, ఎలక్ట్రోమాగ్నటిక్ వేవ్స్-1, డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్-1, ఆటమ్స్-1, న్యూక్లి-1, సెమీకండక్టర్ ఎలక్ట్రానిక్స్-2, కమ్యూనికేషన్ సిస్టమ్స్-1.బెస్ట్ స్కోర్: 38-40. యావరేజ్ స్కోర్: 15-20.
 
 కెమిస్ట్రీ
  కెమిస్ట్రీ పేపర్ సులభం నుంచి మధ్యస్తంగా ఉందని చెప్పొచ్చు.ఈ సబ్జెక్ట్ నుంచి అడిగిన 40 ప్రశ్నల్లో..ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం నుంచి 21 ప్రశ్నలు, ద్వితీయ సంవత్సరం నుంచి 19 ప్రశ్నలు ఇచ్చారు. వీటిలో 28 ప్రశ్నల (70 శాతం) క్లిష్టత సులభం నుంచి మధ్యస్తంగా ఉంది. ప్రాథమిక అంశాలు, సింపుల్ కాలిక్యులేషన్‌పై అవగాహన ఉంటే వీటిని సులభంగానే సాధించవచ్చు.
 
 10 ప్రశ్నలు (25 శాతం) న్యూమరికల్ బేస్డ్‌గా ఉన్నాయి. ఇందులో కూడా 6 ప్రశ్నలు ఫార్ములా ఆధారితంగా ఇచ్చారు. వీటిని సాధారణ విద్యార్థులు కూడా సాధించవచ్చు.ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి అడిగిన 8 ప్రశ్నలు.. ఎటువంటి గందరగోళానికి (ట్విస్ట్)గురి చేయకుండా నేరుగా ఉన్నాయి. ఇనార్గానిక్ కెమిస్ట్రీ నుంచి 13 ప్రశ్నలు, పాలిమర్స్-బయో-ఎన్విరాన్‌మెంటల్ కెమిస్ట్రీ నుంచి 4 ప్రశ్నలు వచ్చాయి. అత్యధికంగా ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి 15 ప్రశ్నలు ఇచ్చారు.గఅ , గఐఐఅ గ్రూప్ మూలకాలు, ఆల్డీహైడ్స్, కీటోన్స్, బేసిక్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఎటువంటి ప్రశ్నలు రాకపోవడం గమనార్హం.బెస్ట్ స్కోర్: 38-40. యావరేజ్ స్కోర్: 25-28.
 
 మెడికల్ బోటనీ
 బోటనీ పేపర్ నిరాశపరిచిందని చెప్పొచ్చు. దీని ప్రభావం మిగతా సబ్జెక్ట్‌లపై కూడా ఉండొచ్చు. ఊహించిన ప్రామాణికత మేరకు ప్రశ్నపత్రాన్ని రూపొందించలేదని భావించవచ్చు. ఈ మధ్యకాలంలో బోటనీ పేపర్‌ను రూపొందించే క్రమంలో విపరీత ధోరణులు కనిపిస్తున్నాయి. ఒక ప్రశ్నను రాసుకుని దాన్ని ఇన్‌డెరైక్ట్‌గా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆ ప్రశ్నకు ఎటువంటి తార్కిక ముగింపు ఉండటం లేదు. ఇటువంటి ధోరణి ఈ సంవత్సరం కూడా కనిపించింది. ఫలితంగా ఇచ్చిన ఐచ్ఛికాంశాలాధారంగా సమాధానాన్ని గుర్తించే పద్ధతిని అనుసరించాల్సి వచ్చింది. అంతేకాకుండా సమాధానాలు ఇచ్చే ప్రక్రియ సుదీర్ఘంగా సాగింది. దాంతో ఎక్కువ సమయాన్ని వెచ్చించాల్సి రావడం మరో కీలక అంశం.
 
 డయాగ్రామ్స్ ఆధారంగా అడిగిన ప్రశ్నల్లో పటాలను పైతరగతుల పుస్తకాల నుంచి నేరుగా కాపీ చేశారు. వీటికి సంబంధించి అంశాలు సిలబస్‌లో ఉన్నప్పటికీ.. డయాగ్రామ్స్, వాటి వివరణ పాఠ్యపుస్తకాల్లో లేకపోవడ ం గమనార్హం.ఈ సబ్జెక్ట్ నుంచి అడిగిన 40 ప్రశ్నల్లో.. ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం నుంచి 19 ప్రశ్నలు, ద్వితీయ సంవత్సరం నుంచి 21 ప్రశ్నలు ఇచ్చారు. వీటిల్లో అసెర్షన్-రీజన్ ప్రశ్నలు 2, మ్యాచ్ ది ఫాలోయింగ్-10 (మొదటి సంవత్సరం నుంచి 6, ద్వితీయ సంవత్సరం నుంచి 4), మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు-8.
 బెస్ట్ స్కోర్: 38. యావరేజ్ స్కోర్: 25-27.
 
 జువాలజీ
 నూతన సిలబస్‌తో తొలిసారి నిర్వహిస్తున్న ఎంసెట్ కావడంతో పేపర్ ఏవిధంగా ఉంటుంది? ప్రశ్నల క్లిష్టత వంటి అంశాల పట్ల విద్యార్థుల్లో కొంత ఆందోళన నెలకొని ఉంది. కానీ జువాలజీ విషయంలో మాత్రం ప్రశ్నపత్రం సులభంగా ఉండటంతో పాటు స్టూడెంట్ ఫ్రెండ్లీగా ఉందని చెప్పొచ్చు.
 జువాలజీ నుంచి అడిగిన 40 ప్రశ్నల్లో ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం నుంచి 18 ప్రశ్నలు, ద్వితీయ సంవత్సరం నుంచి 22 ప్రశ్నలు వచ్చాయి. రెండు సంవత్సరాల సిలబస్‌కు సమప్రాధాన్యతనిచ్చే ప్రయత్నం చేశారు.
 
 నాలుగైదు ప్రశ్నలు మినహా మిగతా ప్రశ్నలను నేరుగా(డెరైక్ట్) అడిగారు. అధిక శాతం ప్రశ్నలు ప్రాథమిక అవగాహన ఆధారంగా వచ్చాయి. సాధారణ విద్యార్థులు సైతం వీటికి సమాధానం గుర్తించగలరు.ప్రశ్నలను నేరుగా ఇవ్వడం వల్ల అధిక శాతం తప్పులు చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఇదే సమస్య చాలా మంది విద్యార్థులకు ఎదురైంది.పటాలాధారంగా అడిగే ప్రశ్నలు ఈ సారి కనిపించలేదు.
 ఊహించిన విధంగానే హ్యుమన్ అనాటమీ, సీనియర్ ఇంటర్‌లోని ఫిజియాలజీ అంశం నుంచి 11 ప్రశ్నలు వచ్చాయి. 4 ప్రశ్నలు వస్తాయని అంచనా వేసిన జెనెటిక్స్ నుంచి 6 ప్రశ్నలు ఇచ్చారు.
 
 బెస్ట్ స్కోర్: 39-40 యావరేజ్ స్కోర్: 35
 ఫిజిక్స్
 మెడికల్ విభాగంలో ఫిజిక్స్ పేపర్ సులభంగానే ఉందని చెప్పొచ్చు.
 ఫిజిక్స్ నుంచి అడిగిన 40 ప్రశ్నల్లో ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం నుంచి 20 ప్రశ్నలు, ద్వితీయ సంవత్సరం నుంచి 20 ప్రశ్నలు వచ్చాయి. కాబట్టి రెండు సంవత్సరాల సిలబస్‌కు సమప్రాధాన్యతనిచ్చారని చెప్పొచ్చు. మొత్తం 40 ప్రశ్నల్లో సులభమైన ప్రశ్నలు-25, మధ్యస్తమైనవి-15.నూతన సిలబస్ నుంచి 3 ప్రశ్నలు వచ్చాయి.మొదటి సంవత్సరం సిలబస్ నుంచి అంశాల వారీగా వచ్చిన ప్రశ్నలు: ఫిజికల్ వరల్డ్-1; యూనిట్స్ అండ్ మెజర్‌మెంట్స్-1, మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్-1, మోషన్ ఇన్ ఏ ప్లేన్-3, లాస్ ఆఫ్ మోషన్-2, వర్క్ ఎనర్జీ పవర్-2, సిస్టమ్ ఆఫ్ ప్రాక్టికల్స్ అండ్ రొటేటరీ మోషన్-2, ఆసిలేషన్స్-2, గ్రావిటేషన్-1, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్-1, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్-1, థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్-1, థర్మోడైనమిక్స్-3.
 
 ద్వితీయ సంవత్సరం సిలబస్ నుంచి అంశాల వారీగా వచ్చిన ప్రశ్నలు: వేవ్స్-1, రే ఆప్టిక్స్ అండ్ ఆప్టికల్ ఇన్‌స్ట్రుమెంట్స్-2, వేవ్ ఆప్టిక్స్-1, ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్-1, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్-1, కరెంట్ ఎలక్ట్రిసిటీ-2, మూవింగ్ చార్జెస్ అండ్ మాగ్నటిజం-2, మాగ్నటిజం అండ్ మ్యాటర్-2, ఆల్టర్నేటింగ్ కరెంట్స్-1, ఎలక్ట్రో మాగ్నటిక్ వేవ్స్-1, డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్-1,ఆటమ్స్-1,న్యూక్లి-1, సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్స్-2, కమ్యూనికేషన్ సిస్టమ్స్-1.
 బెస్ట్ స్కోర్: 40 యావరేజ్ స్కోర్: 15-20
 
 కెమిస్ట్రీ
 కెమిస్ట్రీ..చాలా మంది విద్యార్థులకు సంతోషం కలిగించే విధంగా  ఉందని భావించవచ్చు. ఇందులోని ప్రశ్నలు సులభం నుంచి మధ్యస్తంగా ఉన్నాయి.ఈ సబ్జెక్ట్ నుంచి అడిగిన 40 ప్రశ్నల్లో..ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం నుంచి 21 ప్రశ్నలు, ద్వితీయ సంవత్సరం నుంచి 19 ప్రశ్నలు ఇచ్చారు. వీటిల్లో 25 ప్రశ్నల (62.5 శాతం) క్లిష్టత సులభం నుంచి మధ్యస్తంగా ఉంది. ప్రాథమిక అంశాలు, సింపుల్ కాలిక్యులేషన్‌పై అవగాహన ఉంటే వీటిని సులభంగానే సాధించవచ్చు.
 
 13 ప్రశ్నలు (33 శాతం) న్యూమరికల్ బేస్డ్‌గా ఉన్నాయి. ఇందులో 9 ప్రశ్నలు మధ్యస్తం నుంచి క్లిష్టత స్థాయి వరకు ఉన్నాయి. ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి అడిగిన 8 ప్రశ్నలు, ఇనార్గానిక్ కెమిస్ట్రీ నుంచి 13 ప్రశ్నలు, పాలిమర్స్-బయో- ఎన్విరాన్‌మెంటల్ కెమిస్ట్రీ నుంచి 4 ప్రశ్నలు వచ్చాయి. అత్యధికంగా ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి 15 ప్రశ్నలు ఇచ్చారు.గఅ , గఐఐఅ గ్రూప్ మూలకాలు, ఆల్డీహైడ్స్, కీటోన్స్, బేసిక్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఎటువంటి ప్రశ్నలు రాకపోవడం గమనార్హం.బెస్ట్ స్కోర్: 39 యావరేజ్ స్కోర్: 20-25
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement