ఈసారి కొత్త కోర్సులకు ఓకే | AICTE Approval Process Handbook Release | Sakshi
Sakshi News home page

ఈసారి కొత్త కోర్సులకు ఓకే

Published Thu, Feb 6 2020 3:32 AM | Last Updated on Thu, Feb 6 2020 3:32 AM

AICTE Approval Process Handbook Release - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎం బీఏ, ఎంసీఏ కాలేజీల్లో ఫ్యాకల్టీ స్టూడెంట్‌ రేషియోను అఖిల భారత సాంకేతిక విద్యా మండ లి (ఏఐసీటీఈ) మళ్లీ తగ్గించింది. డీమ్డ్‌ యూని వర్సిటీలు, అటానమస్‌ కాలేజీలు, నేషనల్‌ అ సెస్‌మెంట్‌ అండ్‌ అక్రెడిటేషన్‌ కౌన్సిల్‌ (న్యాక్‌) గుర్తింపు ఉన్న కాలేజీలు 1:15 ఫ్యాకల్టీ స్టూడెంట్‌ రేషియోను అమలు చేయాలని పేర్కొంది. గతంలో ఇది 1:15 ఉండగా, దాన్ని గతేడాది 1:20కి పెంచింది. ఇప్పుడు మళ్లీ 1:15కు తగ్గించింది. అలాగే పీజీ కోర్సుల్లో (ఎంటెక్‌) ఇప్పటివరకు ఉన్న ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తిని 1:12 నుంచి 1:15కు పెంచింది.

2020–21 విద్యా సంవత్సరంలో దేశంలో వృత్తి, సాంకేతిక విద్యా సంస్థల నిర్వహణకు అనుమతి ఇచ్చేందుకు ఏఐసీటీఈ అప్రూవల్‌ ప్రాసెస్‌ హ్యాండ్‌బుక్‌ను జారీ చేసింది. అలాగే దానికి సంబంధించి గెజిట్‌ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. యాజమాన్యాలు ఆ నిబంధనలను పాటిస్తూ అనుమతుల కోసం ఈ నెల 6 నుంచి 29లోగా ఆన్‌లైన్‌లో ద రఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. ఆలస్య రుసు ముతో యాజమాన్యాలు మార్చి 5 వరకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. దరఖాస్తు చేసుకున్న కాలేజీలకు ఏప్రిల్‌ 30లోగా అనుమతులు జారీ చేసారు. అప్రూవల్‌ ప్రాసెస్‌ హ్యాండ్‌బుక్‌లో మార్పులు కా వాలని కోరుకునే యాజమాన్యాల కోసం ఈనెల 10న ముంబైలో, 12న ఢిల్లీలో, 13 న అనంతపూర్‌ జేఎన్టీయూ లో సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించింది.

హ్యాండ్‌బుక్‌లో ప్రధానాంశాలు 
- నేషనల్‌ పర్‌స్పెక్టివ్‌ ప్లాన్‌ ప్రకారం కొత్త కోర్సులకు అ నుమతి ఇస్తారు. ఆర్టిఫిషియ ల్‌ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ వంటి వాటికి అనుమతి ఇస్తారు.
- కంప్యూటర్‌ సైన్స్‌లో ఎక్కువ సీట్లు భర్తీ అవుతున్నాయని, మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్‌ తదితర ఇతర కోర్సుల్లో 40 శాతమే సీట్లు భర్తీ అవుతున్నాయిని పేర్కొంది.  
- ఫ్యాకల్టీ క్వాలిటీ ఇంప్రూవ్‌మెంట్‌ కోసం చర్యలు చేపట్టాలి. 
- కాలేజీ అడ్వైజరీ బోర్డులో పా రిశ్రామిక రంగానికి చెందిన వారు ఇద్దరిని నియమించాలి. 
- 2020–21 నుంచి రెండేళ్ల పా టు కొత్త ఫార్మసీ కాలేజీల ఏర్పాటుకు (డిప్లొమా, డిగ్రీ కోర్సుల కోసం) అనుమతించబోరు.
- డీమ్డ్‌ యూనివర్సిటీలు దూర విద్యా విధానంలో ఎంబీఏ, ఎం సీఏ, ట్రావెల్‌ అండ్‌ టూర్స్‌ కోర్సులను నిర్వహించవచ్చు. ఆయా కో ర్సుల నిర్వహణకు యూజీసీ అనుమతి తప్పనిసరి. 

కాలేజీల్లో కచ్చితంగా అమలు చేయాల్సినవి.. 
క్యాంపస్‌లలో గ్రీనరీకి ప్రా«ధాన్యం ఇవ్వాలి.  రెయి న్‌ వాటర్‌ హార్వెస్టింగ్‌ తప్పనిసరిగా అమలు చేయాలి.
విద్యార్థుల అభిప్రాయాల స్వీకరణ, ఫ్యాకల్టీ వివరాలను కాలేజీలో డిస్‌ప్లే చేయాలి. 
- స్టూడెంట్స్‌ సేఫ్టీ ఇన్సూరెన్స్‌ను కచ్చితంగా అమలు చేయాలి. ఉద్యోగుల కోసం గ్రూపు యాక్సిడెంట్‌ పాలసీ వర్తింపజేయాలి. 
- ఆన్‌లైన్‌ కోర్సులకు ప్రాధాన్యమివ్వాలి.
- ఆన్‌లైన్‌ ఫిర్యాదులు, పరిష్కార విభా గం ఉండాలి. యూనివర్సిటీ తరఫున అం బుడ్స్‌మెన్‌ను నియమించాలి. 
- లైంగిక వేధింపులను అరికట్టేందుకు, ఫిర్యా దులకు కాలేజీల్లో ఇంటర్నల్‌ కంప్‌లైంట్‌ కమిటీలను (ఐసీసీ) ఏర్పాటు చేయాలి. 
- ఎస్సీ, ఎస్టీలపై అత్యాచార నిరోధక కమిటీలను ఏర్పాటు చేయాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement