
మాటలతోనే కాకుండా అందచందాలతో ప్రేక్షకులను అలరించే తెలుగింటి ముద్దుగుమ్మ యాంకర్ అనసూయ

బుల్లి తెరపై అందాలు ఆరబోస్తూ, అద్భుతమైన వ్యాఖ్యానంతో యాంకర్లలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది

బుల్లితెరపై అలరిస్తూనే..సినిమాల్లోను కనిపిస్తూ కనుల విందు చేస్తోంది.

కెరీర్‌పరంగా ఎంత బిజీగా ఉన్న ఫ్యామిలీకి మాత్రం టైం కేటాయిస్తుంది అనసూయ

తన బర్త్‌డే, మ్యారేజ్ డేలకి మాత్రం కచ్చితంగా ఫ్యామిలీతో కలిసి ట్రిప్ వేస్తుంది

ఈ సారి కూడా తన పుట్టిన రోజు(మే 15)వేడుకల్ని ఫ్యామిలీతోనే కలిసి జరుపుకుంది

నది తీరాన అందమైన లొకేషన్స్‌లో కేక్ కట్ చేసి సరదాగా ప్యామిలీతో గడిపింది.

తన బర్త్‌డే సెలబ్రేషన్స్‌కి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. అందులో అనసూయ ఎల్లో కలర్ టాప్, జీన్స్‌షార్ట్ ధరించి మరింత అందంగా కనిపించింది.

ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఎప్పటి మాదిరే కొంతమంది నెటిజన్స్ అనసూయను ట్రోల్ చేస్తున్నారు.

ఈ ఫోటోలు చూసి.. మీ పెద్ద కొడుక్కి పెళ్లి ఎప్పుడు చేస్తున్నావని ఒకరు, హ్యాపీబర్త్‌డే ఆంటీ అని మరొకరు కామెంట్ చేస్తున్నారు.

అయితే అనసూయ మాత్రం ఇలాంటి కామెంట్స్‌ని ఎప్పుడు పట్టించుకోదు. తనకు నచ్చిన విధంగా డ్రెస్సులు ధరిస్తానని.. నచ్చినట్లుగానే ప్రవర్తిస్తానని, ఎవరేమన్నా పట్టించుకోనని పలు సందర్భాల్లో చెప్పింది.

అనసూయ ప్రస్తుతం 'పుష్ప: ది రూల్' చిత్రంలో నటిస్తోంది. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ ఆగస్ట్ 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.




