
సాక్షి, న్యూఢిల్లీ: ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో అరెస్ట్ అయి.. ప్రస్తుతం తిహార్ జైలులో గడుపుతున్నారు కేంద్ర మాజీ మంత్రి పీ చిదబంరం. ఈ క్రమంలో జైలులోనే తన 74వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకోనున్నారు చిదంబరం. ఈ సందర్భంగా చిందబరం తనయుడు కార్తీ తండ్రి పుట్టిన రోజును పురస్కరించుకుని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాక చిదంబరం జైలు పాలైన నాటి నుంచి జరిగిన సంఘటనల గురించి వివరిస్తూ.. రెండు పేజీల లేఖ రాశారు. దానిలో కశ్మీర్ పునర్వ్యస్థీకరణ, ఆర్థిక మందగమనం, దానిపై ఆర్థిఖ మంత్రి నిర్మల సీతారామన్ వ్యాఖ్యలు, గురుత్వాకర్షణ గురించి పియూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలు, అస్సాం ఎన్‌ఆర్‌సీ, మోదీ ప్రభుత్వం 100 రోజుల వేడక గురించి ప్రస్తావించారు.
అంతేకాక ‘మీరు 76వ ఏట అడుగుపెట్టడం.. మోదీ ప్రభుత్వం వంద రోజుల వేడుక చేసుకోవడం రెండు ఒకేలాంటి అంశాలు కాదు. తన అనాలోచిత నిర్ణయాలతో బీజేపీ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింద’ని కార్తీ ఆరోపించారు. దాంతో పాటు ‘మీరు లేకుండా మీ పుట్టిన రోజు వేడుకలు జరపుకోవడం చాలా లోటుగా ఉంది. మీరు లేకపోవడం మా హృదయాలను కదిలించింది. మీరు తిరిగి వచ్చి మాతో పాటు పుట్టిన రోజు వేడకల్లో పాల్గొంటే బాగుంటుందనిపిస్తుంది. కానీ అలా జరగదని తెలుసు’ అంటూ కార్తీ లేఖలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment