గ్రీస్‌లో సుకుమార్‌ భార్య బర్త్‌డే సెలెబ్రేషన్స్‌.. తబిత పోస్ట్‌ వైరల్‌ | Thabitha Sukumar Birthday Celebrations Pics Goes Viral | Sakshi
Sakshi News home page

గ్రీస్‌లో సుకుమార్‌ భార్య బర్త్‌డే సెలెబ్రేషన్స్‌.. తబిత పోస్ట్‌ వైరల్‌

Published Sun, Sep 22 2024 10:28 AM | Last Updated on Sun, Sep 22 2024 11:32 AM

Thabitha Sukumar Birthday Celebrations Pics Goes Viral

‘‘నలభైలలోనే అసలు జీవితం ఆరంభం అవుతుంది అంటుంటారు. అప్పటివరకూ మనం జీవించినది అంతా ఒక పరిశోధనే’’ అంటున్నారు తబితా సుకుమార్‌. ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ భార్య తబిత తన పుట్టినరోజుని గ్రీస్‌లో జరుపుకున్నారు. భర్త, పిల్లల సమక్షంలో ఆమె బర్త్‌ డే సెలబ్రేషన్‌ జరిగినట్లు తెలుస్తోంది. తబిత వయసు ఇప్పుడు 40. 

(చదవండి: తమ్ముడి పెళ్లి కోసం అమెరికా వెళ్లిన సామ్)

‘‘ఇప్పటివరకూ జీవితంలో నేనింత ఆత్మవిశ్వాసంగా, ఆనందంగా, సంతోషంగా ఉన్నట్లు అనిపించడంలేదు. ఎందుకంటే ఇప్పుడు నా జీవితంలో ముఖ్యమైన విషయాలకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చి, అనవసర విషయాలకు తక్కువ ఇస్తున్నాను. ఈ దశ చాలా బాగుంది’’ అని పేర్కొని గ్రీస్‌లో దిగిన ఫొటోలను సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేశారు తబితా సుకుమార్‌.

 కాగా.., ఆ మధ్య విడుదలైన ‘మారుతీ నగర్‌ సుబ్రమణ్యం’ మూవీకి తబిత సమర్పకురాలిగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో రావు రమేశ్‌ టైటిల్‌ రోల్‌లో నటించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement