పుష్ప సినిమాతో దర్శకుడు సుకుమార్ పేరు దేశవ్యాప్తంగా వైరల్ అవుతూనే ఉంది. ఇప్పుడు ఆయన కూతురు సుకృతి వేణి బండ్రెడ్డి కూడా ఇంటర్నేషనల్ వేదికలపై సత్తా చాటుతుంది. ఆమె ప్రధాన పాత్రధారిగా నటించిన 'గాంధీ తాత చెట్టు' ఇప్పటికే పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై అవార్డ్స్‌ను అందుకుంది. ఇప్పుడు తెలుగులో జనవరి 24న విడుదల కానుంది.
పద్మావతి మల్లాది దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్, గోపీటాకీస్ సంస్థలతో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, శేష సింధురావు నిర్మించారు. ఈ చిత్రానికి డైరెక్టర్ సుకుమార్ భార్య, శ్రీమతి తబితా సుకుమార్ సమర్పకురాలుగా వ్యవహరించారు. ఇప్పటికే ఈ 'గాంధీ తాత చెట్టు' సినిమా పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించడమే కాకుండా ఎన్నో అవార్డులను కైవసం చేసుకుంది. ఉత్తమ బాల నటిగా సుకృతి వేణి పురస్కారం కూడా పొందారు. దీంతో పుష్ప అభిమానులు సుకుమార్ కూతురు అనిపించుకున్నావ్ అంటూ ఆమెను ప్రశంసిస్తున్నారు. తండ్రి నేషనల్ అయితే, కూతురు ఇంటర్నేషనల్ అంటూ ట్వీట్లు చేస్తున్నారు.
ఈ సినిమా గురించి దర్శకురాలు మాట్లాడుతూ.. 'గాంధీజీ సిద్ధాంతాల్ని పాటిస్తూ.. ఓ పదమూడేళ్ల అమ్మాయి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. తన గ్రామాన్ని కాపాడుకునేందుకు ఆ అమ్మాయి ఏం చేసిందనేది ఈ చిత్రంలో చాలా ఆసక్తికరంగా ఉంటుంది. నేటి తరం తల్లిదండ్రులు అందరూ తమ పిల్లలకి ఈ చిత్రాన్ని తప్పనిసరిగా చూపించాలని దర్శకురాలు కోరారు. సుకృతి వేణి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో ఆఆనంద్ చక్రపాణి, రఘురామ్, భాను ప్రకాశ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.
Comments
Please login to add a commentAdd a comment