ప్రముఖ దర్శకుడు సుకుమార్ (Sukumar) కూతురు సుకృతి వేణి బండ్రెడ్డి (Sukriti Veni Bandreddi) ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం గాంధీ తాత చెట్టు. ఇప్పటికే ఈ సినిమా పలు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శితమై ఎన్నో అవార్డులను అందుకుంది. గురువారం నాడు ఈ సినిమా రచ్చబండ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఎన్నోసార్లు ఏడ్చానంటూ మళ్లీ ఎమోషనల్
సందర్భంగా తబిత మాట్లాడుతూ ఎమోషనలైంది. 'సుకృతి పాటలు పాడగలదు. కానీ తనకు యాక్టింగ్ రాదని చాలా భయపడ్డాను. డైరెక్టర్ మాత్రం సుకృతిని నమ్మి సినిమాలోకి తీసుకొచ్చింది. తనలోని టాలెంట్‌ను నేనెప్పుడూ గమనించలేదు. ఈ సినిమా పూర్తయ్యాక ఎన్నిసార్లు చూశానో.. అన్నిసార్లు ఏడుస్తూనే ఉన్నాను. ఇక్కడ నా కూతురు గురించి చెప్పాలి.. ఈ సినిమా చేసేటప్పుడు తను 13వ వయసులోకి అడుగుపెట్టింది.
గర్వంగా ఉంది: తబిత
ఈ ఏజ్‌లో ఏ అమ్మాయి గుండు చేయించుకోవడానికి ఇష్టపడదు.. కానీ గాంధీ తాత చెట్టు సినిమా (Gandhi Tatha Chettu) కోసం తను గుండు గీయించుకుంది. ఆ విషయంలో తనను చూసి గర్విస్తున్నాను' అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో సుకుమార్ స్టేజీపైకి వెళ్లి తనను ఓదార్చాడు. అనంతరం సుకృతి ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. నా చుట్టూ ఉన్నవాళ్లు పుష్ప మూవీలో నటిస్తున్నావా? అని అడుగుతూ ఉండేవారు.
పుష్ప మూవీలో యాక్ట్ చేస్తానన్నా
సుకుమార్ కూతుర్ని కాబట్టే నన్ను సినిమాలో తీసుకున్నాడు అన్న పేరు నాకిష్టం లేక నేను చేయలేదని చెప్పాను. కానీ అసలు నిజమేంటో తెలుసా? పుష్ప 1, పుష్ప 2 సినిమాల్లో నేను యాక్ట్ చేస్తానని నాన్నను అడిగాను. ముందు ఆడిషన్ చేయు.. తర్వాత చూద్దామన్నాడు. అందుకే చేయలేదు. అని చెప్పుకొచ్చింది.
గాంధీ తాత చెట్టు
గాంధీ తాత చెట్టు సినిమా విషయానికి వస్తే.. పద్మావతి మల్లాది దర్శకత్వం వహించారు. సుకుమార్ సతీమణి తబిత సమర్పకురాలిగా వ్యవహరిస్తుండగా సుకుమార్ రైటింగ్స్, గోపీటాకీస్ సంస్థలతో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, శేష సింధురావు నిర్మించారు. ఈ మూవీ జనవరి 24న థియేటర్లలో విడుదల కానుంది.
చదవండి: సైఫ్ అలీ ఖాన్‌పై దాడికి పాల్పడిన నిందితుడు అరెస్ట్
Comments
Please login to add a commentAdd a comment