లండన్‌లో ఘనంగా సీఎం వైఎస్‌ జగన్‌ జన్మదిన వేడుకలు! | AP CM YS Jagan Birthday Celebrations In London | Sakshi

లండన్‌లో ఘనంగా సీఎం వైఎస్‌ జగన్‌ జన్మదిన వేడుకలు!

Dec 20 2023 11:40 AM | Updated on Dec 20 2023 1:15 PM

AP CM YS Jagan Birthday Celebrations In London - Sakshi

లండన్‌లోని వైఎస్సార్‌సీపీ యూకే కమిటీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. యూకే నలుమూలల నుంచి వచ్చిన జగన్‌గారి అభిమానులు ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సంధర్బంగా పలువురు వక్తలు ప్రసంగించారు.

ప్రతీపేదవాడి కోసం జగనన్న మళ్ళీ అధికారంలోకి రావాలని నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ కమిటీ సభ్యులు ఓబుల్‌రెడ్డి పాతకోట , అనంత్‌రాజు పరదేశి, మలిరెడ్డి కిషోర్ రెడ్డి, మన్మోహన్ యామసాని, జనార్ధన్ చింతపంటి, జయంతి, ప్రతాప్ భీమిరెడ్డి, సురేందర్‌రెడ్డి అలవల, శ్రీనివాసరెడ్డి దొంతిబోయిన, గాంధీ రెడ్డి పోలి, భాస్కర్‌రెడ్డి మాలపాటి, బీవీ నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీ యూకే కన్వీనర్ డాక్టర్‌ ప్రదీప్ చింతా ప్రసంగిస్తూ.. రానున్న మూడు నెలల్లో ప్రతిఒక్కరు ఒక సైనికుడిలా పనిచేసి జగన్‌గారి గెలుపుకు కృషిచేయాలన్నారు.

డాక్టర్‌ ప్రదీప్ చింతా, వైఎస్సార్‌సీపీ యూకే కన్వీనర్

"ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు హర్ధిక జన్మదిన శుభాకాంక్షలు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతో మంది లండన్‌కు వచ్చారు. ఇక్కడ మరింత మందికి సాయం చేద్దాం. ఆంధ్రప్రదేశ్‌లో ఎంతో మందికి సీఎం జగన్‌ సపోర్ట్‌ చేస్తున్నారు. అండగా నిలుస్తున్నారు. మరోసారి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం చేయడానికి మనవంతుగా ఎంతో కొంత సహకరిద్దాం. సోషల్‌మీడియాలో వచ్చే మూడు నెలల పాటు విధిగా సీఎం జగన్‌ కోసం పోరాడుదాం. జై జగన్‌.. హ్యాపీ బర్త్‌డే జగన్‌. మళ్లీ మళ్లీ ముఖ్యమంత్రిగా గెలవాలి, ప్రజలకు అండగా ఉండాలి."

(చదవండి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసిన ఎన్ఆర్ఐ ప్రతినిధులు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement