కోలగట్ల జన్మదినం సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభిస్తున్న మాజీ మంత్రి పెనుమత్స సాంబశివరాజు, కోలగట్ల కుమార్తె, అల్లుడు
విజయనగరం మున్సిపాలిటీ : ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి సేవా స్ఫూర్తిని, సేవానిరతిని నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని మాజీ మంత్రి, నెల్లిమర్ల నియోజకవర్గ సమన్వయకర్త పెనుమత్స సాంబశివరాజు అన్నారు. ఎమ్మెల్సీ కోలగట్ల జన్మదిన వేడుకల్లో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని పెనుమత్స ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత తరం రాజకీయాల్లో ప్రజల వెన్నంటే ఉండే వ్యక్తి కోలగట్ల అని పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా కోలగట్ల రెండవ కుమార్తె శ్రావణి, అల్లుడు ఈశ్వర్ కౌషిక్‌లు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా శ్రావణి మాట్లాడుతూ సేవకు మించిన ఆత్మ సంతృప్తి దేనికి సాటిరాదన్న విషయాన్ని తన తండ్రి చెబుతుండేవారని, ఆయన పుట్టిన రోజు సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించటం ఆనందంగా ఉందన్నారు.
తన తండ్రిపై ప్రజల ఆదరణ నిరంతరం ఇలానే ఉండాలని ఆకాంక్షించారు. ఈశ్వర్ కౌషిక్ మాట్లాడుతూ ప్రజల కోసం, సేవానిరతి కోసం పరితపించే వ్యక్తి పుట్టిన రోజు నిర్వహించిన రక్తదాన శిబిరంలో పాల్గొన్న యువతకు అభినందనలు తెలిపారు. కోలగట్ల స్ఫూర్తితో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామన్నారు. కోలగట్లపై నాయకులు, అభిమానులు, కార్యకర్తలు చూపెడుతున్న ప్రేమాభిమానాలు వెలకట్టలేనివన్నారు.
ఈ సందర్బంగా నిర్వహించిన జిల్లా రక్తనిధి కేంద్రం వైద్యులు డాక్టర్ సత్యశ్రీనివాస్ నేతృత్వంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో 215 మంది యువత స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ విజయనగరం నగర కన్వీనర్ వేణు, మండల అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసరావు, సీనియర్ కౌన్సిలర్లు ఎస్‌వివి.రాజేష్, సీతారామమూర్తి, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఎస్.బంగారునాయుడు, రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి బొద్దాన అప్పారావు, రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి జివి.రంగారావు, పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు అల్లు చాణక్య, పార్టీ నాయకులు సత్తరపు శంకరావు, పట్నాన పైడిరాజు, రెడ్డి గురుమూర్తి, మార్రోజు శ్రీను, గండ్రటి సన్యాసిరావు, ఈశ్వరరావు, తవిటిరాజు, ప్రసాద్, ఆవాల్‌కుమార్, సురేష్, కేశవ, నారాయణరావు, లక్ష్మణరావు, పండు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment