kolagatla veerabadra swamy
-
కరోనా: పాదపూజ చేసిన ఎమ్మెల్యే
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ వ్యాప్తి నివాణకు రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. అత్యవసర సేవల సిబ్బంది మాత్రం తమ ప్రాణాలను ఫణంగా పెట్టి రాత్రింబవళ్లు విధులు నిర్వహిస్తున్నారు. వైద్య సిబ్బంది పాటు పారిశుధ్య కార్మికులు అమూల్యమైన సేవలు అందిస్తున్నారు. పారిశుధ్య కార్మికుల సేవలను గుర్తించి వారిని సముచితంగా సత్కరిస్తున్నారు. (ఏపీలో మరో 14 కరోనా పాజిటివ్ కేసులు) ఘన సన్మానం.. పారిశుధ్య కార్మికుల సేవలకు ఫిదా అయిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి వారికి పాదపూజ చేశారు. పురపాలక సంఘ కార్యాలయంలో ఆదివారం కార్మికుల కాళ్లు కడిగి, పూలతో అభిషేకం చేశారు. అనంతరం శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. నోట్ల దండం.. విజయనగరం జిల్లాలో నెల్లిమర్ల ప్రజాప్రయోజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పలువురు పారిశుధ్య కార్మికులను స్థానిక పోలీసు స్టేషన్లో ఆదివారం నోట్లదండలతో సత్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అప్పలనాయుడు పాల్గొన్నారు. పోలీసులకు నిత్యావసర సరుకుల కిట్లను అందజేశారు. పూలవాన విజయనగరంలో ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి స్థానిక వైఎస్సార్సీపీ నాయకుడు గుజ్జల నారాయణరావుతో కలిసి పారిశుధ్య కార్మికులపై పూలు చల్లి అభినందించారు. రేషన్ కార్డు లేని 150 కుటుంబాలకు పది కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేశారు. -
టీడీపీ నాయకుల వ్యాఖ్యలు హాస్యాస్పదం
సాక్షి, విజయనగరం : తెలుగుదేశం పార్టీ నాయకులు విజ్ఞానవంతులో, అవివేకులో తెలియని పరిస్థితి నెలకొందని స్థానిక వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. సోమవారం విజయనగరంలోని 38వ వార్డు కొత్త అగ్రహారం, బూర్లపేట, గవర వీధి, గాజుల వీధి తదితర ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోలగట్ల మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వంద రోజుల పాలనలో ఏం జరిగిందంటూ టీడీపీ నేతలు ప్రశ్నిస్తుంటే నవ్వొస్తోందన్నారు. ఐదేళ్లు పరిపాలించాలని టీడీపీకి అవకాశం ఇస్తే అవినీతి, చేతకాని పరిపాలన చూసి ప్రజలు ఇంటికి పంపించారని ఎద్దేవా చేశారు. సమస్యలు వింటూ పరిష్కారం చూపుతూ.. వార్డు పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి స్థానిక సమస్యలను వింటూ వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలంటూ అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా కొత్త అగ్రహారంలో ఉన్న మున్సిపల్ క్వార్టర్స్ శిథిలావస్థకు చేరి పందులకు ఆవాసంగా మారడంతో కాంపౌండ్ వాల్ నిర్మాణం చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. బూర్లుపేటలో విద్యుత్ లైట్లు లేకపోవడం అంధకారం అలుముకుంటుందని, ఐరన్ స్తంభాలు షాక్ కొడుతున్నాయని ఆ ప్రాంత మహిళలు ఎమ్మెల్యే కోలగట్ల కు చెప్పగా, ఐరన్ పోల్స్ ప్రాంతంలో సిమెంటు స్తంభాలు వేయాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. పాడైన రోడ్ల స్థానంలో కొత్త రోడ్లు వేయాలని, డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా ఉండేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఎమ్మెల్యే కోలగట్లకు డాక్టర్ రమణమూర్తి, ఉడతా కాశీ, పసుమర్తి గణేష్, పువ్వాడ వర్ధన్, బొడ్డు కష్ణ తదితరులు స్వాగతం పలికారు. అనంతరం ఆ ప్రాంతంలో ఎమ్మెల్యే కోలగట్ల మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ వార్డు జోనల్ ఇంచార్జి కేదారిశెట్టి సీతారామమూర్తి(రాంపండు), వార్డు పార్టీ అధ్యక్షుడు పిల్లా వేణు, పిల్లా పాండురంగారావు, ఆడారి శ్రీను, నవీన్ తదితరులు పాల్గొన్నారు. -
రోజాకు అండగా నిలవండి
పుత్తూరు : వైఎస్సార్సీసీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు అండగా నిలవాలని నియోజకవర్గంలోని ఆర్యవైశ్యులకు విజయనగరం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి పిలుపునిచ్చారు. నగరిలో అట్టహాసంగా నిర్వహిస్తున్న వైఎస్సార్ చాంపియన్ ట్రోఫీలో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు వచ్చిన ఆయన గురువారం పుత్తూరులోని శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ప్రజాసమస్యలపై నిత్యం పోరాటం చేస్తున్న ఎమ్మెల్యే రోజాను మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని ఆయన ఆర్యవైశ్యులకు విజ్ఞప్తి చేశారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు అవలంభిస్తున్న విధానాల కారణంగా వ్యాపారస్తులు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర అభివృద్ధి, అన్ని వర్గాల సంక్షేమం కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని వివరించారు. రాజన్న పాలన కోసం రాష్ట్ర ప్రజలు ఆతృతగా ఎదరు చూస్తున్నారని స్పష్టం చేశారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్యుల సంఘం నేతలు ఎమ్మెల్సీ వీరభద్రస్వామిని, ఎమ్మెల్యే రోజాను దుశ్శాలువ, పూలదండలతో సత్కరించారు. ఎంపీపీ మురళీరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు సురేష్‌రాజు, వైఎస్సార్సీపీ మైనారిటీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాహీన్ పాల్గొన్నారు. -
కోలగట్ల సేవా స్ఫూర్తి ఆదర్శం
విజయనగరం మున్సిపాలిటీ : ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి సేవా స్ఫూర్తిని, సేవానిరతిని నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని మాజీ మంత్రి, నెల్లిమర్ల నియోజకవర్గ సమన్వయకర్త పెనుమత్స సాంబశివరాజు అన్నారు. ఎమ్మెల్సీ కోలగట్ల జన్మదిన వేడుకల్లో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని పెనుమత్స ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత తరం రాజకీయాల్లో ప్రజల వెన్నంటే ఉండే వ్యక్తి కోలగట్ల అని పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా కోలగట్ల రెండవ కుమార్తె శ్రావణి, అల్లుడు ఈశ్వర్ కౌషిక్‌లు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా శ్రావణి మాట్లాడుతూ సేవకు మించిన ఆత్మ సంతృప్తి దేనికి సాటిరాదన్న విషయాన్ని తన తండ్రి చెబుతుండేవారని, ఆయన పుట్టిన రోజు సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించటం ఆనందంగా ఉందన్నారు. తన తండ్రిపై ప్రజల ఆదరణ నిరంతరం ఇలానే ఉండాలని ఆకాంక్షించారు. ఈశ్వర్ కౌషిక్ మాట్లాడుతూ ప్రజల కోసం, సేవానిరతి కోసం పరితపించే వ్యక్తి పుట్టిన రోజు నిర్వహించిన రక్తదాన శిబిరంలో పాల్గొన్న యువతకు అభినందనలు తెలిపారు. కోలగట్ల స్ఫూర్తితో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామన్నారు. కోలగట్లపై నాయకులు, అభిమానులు, కార్యకర్తలు చూపెడుతున్న ప్రేమాభిమానాలు వెలకట్టలేనివన్నారు. ఈ సందర్బంగా నిర్వహించిన జిల్లా రక్తనిధి కేంద్రం వైద్యులు డాక్టర్ సత్యశ్రీనివాస్ నేతృత్వంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో 215 మంది యువత స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ విజయనగరం నగర కన్వీనర్ వేణు, మండల అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసరావు, సీనియర్ కౌన్సిలర్లు ఎస్‌వివి.రాజేష్, సీతారామమూర్తి, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఎస్.బంగారునాయుడు, రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి బొద్దాన అప్పారావు, రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి జివి.రంగారావు, పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు అల్లు చాణక్య, పార్టీ నాయకులు సత్తరపు శంకరావు, పట్నాన పైడిరాజు, రెడ్డి గురుమూర్తి, మార్రోజు శ్రీను, గండ్రటి సన్యాసిరావు, ఈశ్వరరావు, తవిటిరాజు, ప్రసాద్, ఆవాల్కుమార్, సురేష్, కేశవ, నారాయణరావు, లక్ష్మణరావు, పండు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
'కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలను కొంటున్నారు'
విజయనగరం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలను కొంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి మండిపడ్డారు. శనివారం విజయనగరంలో కోలగట్ల విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు ఏపీ ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించారని ఆయన విమర్శించారు. జూన్ 8న అన్ని పోలీస్ స్టేషన్లలో తాము ఫిర్యాదు చేస్తామని చెప్పారు. రెండేళ్లలో చంద్రబాబు, మంత్రులే అభివృద్ధి చెందారు తప్పా ప్రజలకు మేలు జరుగలేదని ఎమ్మెల్సీ కోలగట్ల అన్నారు.