
విలేకరులతో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ వీరభద్రస్వామి, ఎమ్మెల్యే రోజా
పుత్తూరు : వైఎస్సార్‌సీసీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే ఆర్‌కే రోజాకు అండగా నిలవాలని నియోజకవర్గంలోని ఆర్యవైశ్యులకు విజయనగరం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి పిలుపునిచ్చారు. నగరిలో అట్టహాసంగా నిర్వహిస్తున్న వైఎస్సార్ చాంపియన్ ట్రోఫీలో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు వచ్చిన ఆయన గురువారం పుత్తూరులోని శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ప్రజాసమస్యలపై నిత్యం పోరాటం చేస్తున్న ఎమ్మెల్యే రోజాను మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని ఆయన ఆర్యవైశ్యులకు విజ్ఞప్తి చేశారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు అవలంభిస్తున్న విధానాల కారణంగా వ్యాపారస్తులు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర అభివృద్ధి, అన్ని వర్గాల సంక్షేమం కోసం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని వివరించారు. రాజన్న పాలన కోసం రాష్ట్ర ప్రజలు ఆతృతగా ఎదరు చూస్తున్నారని స్పష్టం చేశారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్యుల సంఘం నేతలు ఎమ్మెల్సీ వీరభద్రస్వామిని, ఎమ్మెల్యే రోజాను దుశ్శాలువ, పూలదండలతో సత్కరించారు. ఎంపీపీ మురళీరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు సురేష్‌రాజు, వైఎస్సార్‌సీపీ మైనారిటీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాహీన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment