
టీడీపీ నాయకులను వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వానిస్తున్న ఎమ్మెల్యే ఆర్కే రోజా
వడమాలపేట : మండలంలోని ఓబీఆర్ కండ్రిగ, రామరాజుకండ్రిగ గ్రామానికి చెందిన పలువురు టీడీపీ నాయకులు మంగళవారం నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో పుత్తూరు టౌన్ యూత్ లీడర్, జిల్లా ప్రభాస్ ఫ్యాన్స్ సంఘం సభ్యుడు వి.శ్రీనివాసరాజు, డి.ప్రకాష్‌రాజు, నారాయణరాజు ఉన్నారు. వీరికి ఎమ్మెల్యే పార్టీ కండువాలు వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. వారు మాట్లాడుతూ, వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల కోసం కష్టపడుతున్న తీరు, ఆయన ప్రకటించిన నవరత్నాలు పథకాలపై ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ మురళీధర్‌రెడ్డి, జెడ్పీటీసీ సురేష్‌రాజు, కన్వీనర్ సదాశివయ్య, నాయకులు మహేష్‌రెడ్డి, రమేష్, గోపి, చెంగల్‌రాజు, మోహన్‌రాజు, శివరా జు, తులసీరామరాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment