సాక్షి, తిరుపతి :తనపల్లిక్రాస్ వద్ద పీఎల్‌ఆర్ గార్డెన్స్‌లో వైఎస్ జగన్‌హహన్‌రెడ్డి చిత్తూరు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన తటస్తులతో సమావేశమయ్యారు. నగరి ఎమ్మెల్యే ఆర్‌కే రోజా వ్యాఖ్యాతగా వ్యవహరించారు. మేధావులు, లాయర్లు, వైద్యులు, ప్రొఫెసర్లు, రైతులు, యువకులు హాజరయ్యారు. వైఎస్ జగన్‌కు వారు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. సమావేశానికి హాజరైన వారు ఒక్కొక్కరుగా లేచి ప్రశ్నలు వేస్తుంటే.. ఏపీ ప్రతిపక్ష నేత విద్యార్థిలా మారారు. నోట్ బుక్, పెన్ను తీసుకుని వారు చెప్పే విషయాలను జాగ్రత్తగా రాసుకోవడం తటస్తులకు ఆశ్చర్యాన్ని కలిగించింది. వారు అడిగిన ప్రశ్నలు ప్రతి దానికీ సమాధానం ఇవ్వడం, తన వ్యక్తిగత సిబ్బంది వారి వివరాలు తీసుకోవడం కనిపించింది.
వెంటిలేటర్‌పై బాబు ప్రభుత్వం
చంద్రబాబు ప్రభుత్వం వెంటిలేటర్‌పై ఉంది. అది తిరిగి కోలుకునే పరిస్థితి లేదు. మరోసారి ప్రజలను మోసగించి అధికారంలోకి రావడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. పోస్ట్ డేటెడ్ చెక్కులిచ్చి మోసం చేస్తున్నారు. పసుపు, కుంకుమ పేరిట చేస్తున్న తతంగాన్ని ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదు. జగనన్న పథకాలన్నింటినీ కాపీ కొడుతున్నారు. ఎక్కడికక్కడ మనోళ్లంతా అప్రమత్తంగా ఉండండి. లేదంటే మన ఓట్లను తొలగిస్తారు. మొన్ననే జగనన్న ఢిల్లీ వెళ్లారు. ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు కూడా చేశారు. చంద్రబాబు ఎన్ని దుర్మార్గాలకైనా వెనుకాడరు. అన్నింటినీ ఎదుర్కొందాం. అందరం కలసికట్టుగా పనిచేసి, పార్టీని బలోపేతం చేద్దాం. –చింతల రామచంద్రా రెడ్డి, ఎమ్మెల్యే, పీలేరు
చంద్రబాబుకు చమరగీతం
సమర శంఖాన్ని పూరిద్దాం. మనం పూరించే శంఖారావమే చంద్రబాబుకు చమరగీతం కావాలి. జిల్లాలో అందరం కష్టపడి పనిచేద్దాం. చంద్రబాబు నాలుగున్నరేళ్లు ఏమీ చేయలేదు. ఎన్నికలు వచ్చేసరికి జగనన్న పథకాలను కాపీ కొడుతున్నారు. చంద్రబాబు పప్పులు ఉడకవు. జిల్లాలో 14 అసెంబ్లీ సీట్లకు గాను 14 సీట్లనూ గెలుస్తాం. జగనన్న సీఎం కావడం ఖాయం. రాష్ట్రంలో దుర్మార్గపు పాలన పోవాలి. మన రాజన్న రాజ్యం మళ్లీ రావాలి. రైతులకు మంచి జరగాలి. యువత బాగుపడాలి. మహిళలు లక్షాధికారులు కావాలి. ఎన్ని కష్టాలు ఉన్నా మనమే పరిష్కరించుకుందాం.–పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డి, సమన్వయకర్త, తంబళ్లపల్లె
రంగులు మార్చడం బాబు నైజం
ఊసరవెల్లిలా రంగులు మార్చడమే చంద్రబాబు నైజం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని మొదటి నుంచి వైఎస్ జగన్ అనేక ఉద్యమాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ప్రత్యేక హోదా అవసరం లేదని, ప్యాకేజీలే ముద్దు అని చంద్రబాబు మొదట్లో అన్నారు. ఇప్పుడు రూట్ మార్చారు. ప్రత్యేక హోదా ఇవ్వలేదంటూ కేంద్రంపై పోరాటం చేస్తామంటూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారు. జగనన్న పథకాలను కాపీ కొడుతున్నారు. ఎస్టీలను ఎమ్మెల్యేలుగా గెలిపించుకోలేదు. మంత్రి పదవులు ఇవ్వలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీలను మోసం చేశారు. ఎవరూ ఎస్సీలుగా పుట్టాలని కోరుకోరు అంటూ ఎస్సీలందరినీ అవమానపరిచారు. చంద్రబాబును ప్రజలు క్షమించరు. –సునీల్, ఎమ్మెల్యే, పూతలపట్టు
Comments
Please login to add a commentAdd a comment