
భార్యఎంత కష్టపడుతున్నా చూసీచూడనట్టుంటాడు.., కూతురు నీళ్ల బకెట్ మోసినా తట్టుకోలేడు!
భార్య బిర్యానీ చేసినా కాంప్లిమెంట్ ఇవ్వడు.., కూతురు మ్యాగీ చేసినా అదో గిన్నిస్ రికార్డ్ లా అందరికీ చెప్పుకుంటాడు!
పిచ్చి నాన్న... లోకంలో శుభాలన్నీ కూతురికే కలగాలనుకుంటాడు.. ఏ కష్టం దగ్గరికి రానివ్వకుండా అడ్డుగోడలా ఉంటాడు!
నాన్న అంటే కనిపించే ఒక భరోసా మాత్రమే కాదు.. కూతురు భవిష్యత్తుని బంగారం చేసే దేవుడు కూడా..
అమ్మ ఎంత తిట్టినా నవ్వొస్తుంది.. కానీ నాన్న కొద్దిగా మందలించినా ఏడుపొస్తుంది.
కూతురి గుండెలో నాన్నకెప్పుడూ ప్రథమ స్థానం.. నాన్నకు కూతురే ప్రపంచం.
అలాంటి ఓ తండ్రి, కూతుళ్ల అనుబంధాన్ని చాటే
ఈ స్టోరీ మీకోసం...
ఇక్కడ తండ్రి భుజాలపై కనిపిస్తున్న బుజ్జాయి పేరు బెయిలీ సెల్లర్స్. ఇప్పుడు @SellersBailey పేరుతో ట్విటర్‌లో అందరికీ సుపరిచితురాలైంది. తండ్రితో తన చిన్ననాటి జ్ఞాపకాలను ట్విటర్‌లో వివరిస్తూ మనసును కదిలించే ఓ ఘటన గురించి వివరించింది. అదొక్కటి చాలు.. కూతుళ్లంటే తండ్రులకు ఎంత ప్రేమో..! ఇక మ్యాటర్‌లోకి వెళ్తే..
సెల్లర్స్ టీనేజ్‌లో అడుగుపెట్టే సమయానికే తండ్రికి దూరమైంది. క్యాన్సర్ బారిన పడి మరణించాడు. తన తండ్రి గురించి సెల్లర్స్ చెబుతూ... ‘క్యాన్సర్‌కు ఉన్న ఓ గొప్ప లక్షణమేంటంటే.. తాము బతకమనే విషయాన్ని బాధితులకు ముందే చెప్పేస్తుంది. జీవితాన్ని సర్దుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. అందుకేనేమో నాన్న నా కోసం అన్ని సిద్ధం చేసి వెళ్లిపోయాడు. బతికున్నన్ని రోజులు నాకు ఏ కష్టం కలగకుండా చూసుకోవడమే కాదు.. తాను వెళ్లిపోయిన తర్వాత కూడా నేను సంతోషంగా ఉండాలని కోరుకున్నాడు. కన్నబిడ్డల కోసం ఆస్తిపాస్తులు ఇవ్వడం తల్లిదండ్రులందరు చేసే పనే. కానీ మా నాన్న నాకోసం జీవితం మొత్తానికి సరిపడా సంతోషాలనిచ్చి వెళ్లిపోయాడు. అందుకే ఇప్పటికీ నా పుట్టిరోజు నాడు నాన్న దగ్గర నుంచి ఫ్లవర్ బొకే, బర్త్ డే గిఫ్ట్ వచ్చేస్తుంది. అదెలాగా? అని ఆశ్చర్యపోతున్నారు కదూ.. తాను బతకలేననే విషయం తెలుసుకున్న నాన్న... బతికున్నప్పుడే నా పుట్టినరోజుల కోసం ముందుగానే బర్త్ డే గిఫ్ట్‌లను ఆర్డర్ ఇచ్చేశారు. ఇప్పుడు ఆయన లేకున్నా.. అవి సమయానికి నా చేతికి అందుతుంటే.. నాన్న స్వయంగా ఇచ్చినట్టే అనిపిస్తోంది’ అంటూ పలు ట్విటర్ సందేశాలను పోస్ట్ చేసింది. నిజమేకదా.. ఈ లోకంలో లేకపోయినా కూతురు బర్త్ డేను జరుపుతున్న తండ్రి బెయిల్‌కు మనమంతా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!
Comments
Please login to add a commentAdd a comment