
ఏపీ ఫైబర్ నెట్ స్కామ్‌లో మరో కీలక పరిణామం
- టెరాసాఫ్ట్ కేసులో డీఆర్‌ఐ కొరడా
- ఫైబర్ నెట్ కుంభకోణంలో పన్ను ఎగ్గొట్టిన వారిపై ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ కొరడా
- ఫైబర్ నెట్ స్కాంలో పన్ను ఎగ్గొట్టినందుకు ఫాస్ట్‌లేన్ టెక్నాలజీస్‌కు రూ.34 కోట్ల పెనాల్టీ విధింపు
- కొన్నవారి నుంచి GSTని సేకరించి ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉన్న అమ్మకం దారు
- GST నిబంధనలను తుంగలో తొక్కిన ఫాస్ట్‌లైన్ టెక్నాలజీస్
- ఆధారాలను పరిశీలిస్తే రూ.10.81 కోట్ల పన్ను ఎగ్గొట్టినట్టు గుర్తింపు
- ఈ డబ్బును హవాలా మార్గంలో తరలించినట్టు ఆధారాలు
- ఫాస్ట్‌లేన్ టెక్నాలజీస్ వెనక ఉన్నది టెరాసాఫ్ట్ కంపెనీ
- ఏపీ ఫైబర్‌నెట్ నిధులను పక్కదారి పట్టించింది కూడా ఈ కంపెనీలే
- విచారణలో పన్ను ఎగ్గొట్టినట్టు ఒప్పుకున్న ఫాస్ట్‌లేన్ మాజీ ఎండీ విప్లవ్‌కుమార్
- నిధులన్నీ డొల్ల కంపెనీల ద్వారా రూటు మార్చినట్టు అంగీకారం
- ఈ కేసులో ప్రధాన నిందితుడిగా వేమూరి హరిప్రసాద్ గుర్తింపు (చంద్రబాబు సన్నిహితుడు)
- టెరాసాఫ్ట్ ఎండీ తుమ్మల గోపిచంద్ విజ్ఞప్తి మేరకే పాస్ట్‌లేన్‌ను ఏర్పాటు చేసినట్టు తెలిపిన విప్లవ్ కుమార్
- ఇప్పటికే ఈ కేసులో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించిన ఇంగ్రామ్
- ఫాస్ట్‌లేన్ దివాళా తీసినట్టు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌కు తెలిపిన ఇంగ్రామ్
- సెప్టెంబర్ 2020 నుంచి కార్యకలపాలు నిలిపివేసిన ఫాస్ట్‌లేన్
- ఎలాంటి కార్యకలపాలు చూపించకపోవడంతో ఫాస్ట్‌లేన్ రిజిస్ట్రేషన్ రద్దు చేసిన ప్రభుత్వం
- ఈ కేసులో ముందస్తు బెయిల్ తీసుకున్న వేమూరి హరికృష్ణ, తుమ్మల గోపిచంద్
- ఇదే కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌ను తిరిస్కరించిన హైకోర్టు
- సుప్రీంకోర్టులో డిసెంబర్ 12న విచారణకు రానున్న చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్
స్కిల్ కుంభకోణంలో కీలక పరిణామం
- A13 నిందితుడు చంద్రకాంత్ షాని ఏసీబీ కోర్టు ముందు హాజరుపరిచిన సీఐడీ అధికారులు
- అప్రూవర్‌గా మారుతున్నట్లు కోర్టు ఎదుట తెలిపిన చంద్రకాంత్ షా
- తదుపరి విచారణ జనవరి 5కి వాయిదా
- చంద్రకాంత్ షా స్టేట్‌మెంట్‌ని జనవరి 5న రికార్డు చేయనున్న ఏసీబీ కోర్టు
ఓటుకు కోట్లు కేసు వాయిదా
- తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు రూ.కోట్లు కేసు విచారణను వాయిదా వేసిన సుప్రీంకోర్టు
- కేసు నుంచి తప్పించాలంటూ తెలంగాణ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య దాఖలు చేసిన పిటిషన్
- సోమవారం జస్టిస్ సంజీవ్‌ఖన్నా, జస్టిస్ ఎస్‌వీఎన్ భట్టితో కూడిన ధర్మాసనం విచారణ
- విచారణ వాయిదా వేయాలని కోరిన తెలంగాణ ప్రభుత్వం,పిటిషనర్ తరఫు న్యాయవాదులు
- వచ్చే ఏడాది జనవరికి వాయిదా వేసిన ధర్మాసనం
దిగజారుడు రాజకీయాలకు బాబు, పవన్ నిదర్శనం
- తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు ఒక్క స్థానంలోనూ పోటీ చేయలేదు : ఎంపీ నందిగం సురేష్
- తెలంగాణ లో కాంగ్రెస్ గెలిస్తే టీడీపీ సంబరాలు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం
- తెలంగాణ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కు డిపాజిట్లు కూడా రాలేదు
- ఇచ్చిన హామీలను ఏనాడూ చంద్రబాబు అమలు చేయలేదు
- పేదల సంక్షేమానికి చంద్రబాబు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు
- టీడీపీ పాలనలో రాప్తాడు నియోజకవర్గంలో ఫ్యాక్షనిజం ఉండేది
- వైఎస్సార్ సీపీ పాలనలో ముఠా కక్షలు అంతమయ్యాయి
నువ్వు లీడర్ ఎలా అవుతావు.. లోకేష్?
- కాకినాడ : లోకేష్ పై ద్వారంపూడి ఫైర్
- లోకేష్ పాదయాత్ర కొవ్వు కరిగించుకోవడానికి చేస్తున్నట్టుంది
- ప్రభుత్వాన్ని విమర్శించేందుకు నీస్ధాయి సరిపోదు, నువ్వు ఎమ్మెల్యే కూడా కావు
- నీ ఎర్ర బుక్కు మడత పెట్టుకో
- కాకినాడలో దొంగ బియ్యం ఎగుమతి అవుతుందో లేదా పయ్యావుల వియ్యంకుడైన సైరస్ కంపెనీ యాజమాని శ్రీనివాస్‌ను అడుగు
- కాకినాడలో టాప్ ముగ్గురు బియ్యం ఎగుమతిదారుల్లో ఆయన ఒకరు, పైగా మీ సామాజిక వర్గమే
- లేని ఆరోపణలు చేయడం లోకేష్‌కు తగదు
- దొడ్డి దారిన ఎమ్మెల్సీ అయ్యి మంత్రి అయ్యావు
- నేను ప్రజా క్షేతంలో రెండు సార్లు గెలిచి ఎమ్మెల్యే అయ్యాను.
- లోకేష్ పొలిటికల్ ఎంట్రీ తరువాతే చంద్రబాబు పతనం ప్రారంభమైంది
- ఏపీ బాగుపడాలంటే టిడిపి పోవాలి
- తెలంగాణ ఎన్నికల్లో సెటిలర్ ప్రభావం లేదు
- టిడిపిని సపోర్ట్ చేసిన సాప్ట్ వేర్ ఇంజనీర్ ల వల్ల కాంగ్రెస్ గెలవలేదు
- తెలంగాణ ఎన్నికల్లో పరాజయానికి పవన్ కళ్యాణ్ కు కంగ్రాట్స్
చంద్రబాబు సామాజిక వర్గం ఉడుత ఊపులు ఏమయ్యాయి?
చించేస్తాం , 'పొడి' చేస్తాం ... అంటూ ఘీంకారాలు
- మా బాబును అరెస్ట్ చేస్తే కెసిఆర్ కేటీఆర్ ఖండించలేదంటూ శాపనార్థాలు
- తెలంగాణ ఎన్నికల్లో మా తడఖా చూపుతామని బెదిరింపులు
- తమిళనాడు శశికళ తరహాలో శపథాలు
- కట్ చేస్తే ...
- గ్రేటర్‌లో హైదరాబాద్ (15 ), ఉమ్మడి రంగారెడ్డి (14 ) లో మొత్తం 29 స్థానాలు
- TRS 17 స్థానాల్లో, MIM 7 స్థానాల్లో, కాంగ్రెస్ 4 స్థానాల్లో, బీజేపీ 1 స్థానంలో గెలుపు
- చంద్రబాబు శిష్యులుండే నియోజక వర్గాల్లో TRSకు 2018 కంటే ఎక్కువ మెజారిటీ
Comments
Please login to add a commentAdd a comment