
సాక్షి, అమరావతి: చంద్రబాబు అరెస్టుపై టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. సోమవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, టీడీపీ చేస్తున్న డ్రామాలను ప్రజలు పట్టించుకోవడం లేదన్నారు.
‘‘చంద్రబాబు అరెస్ట్ భావోద్వేగానికి అవకాశం ఉండే అంశం కాదు. ప్రాథమిక ఆధారాలున్నాయి కాబట్టే కోర్టు రిమాండ్‌కు పంపింది. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారు. సీఎం జగన్‌పై తప్పుడు కేసులు పెట్టినప్పుడు న్యాయపరంగానే పోరాడాం. ప్రజాకోర్టులో సీఎం జగన్ తిరుగులేని విజయం సాధించారు. 2019లో 151 సీట్లలో గెలిచి అధికారంలోకి వచ్చారు. చంద్రబాబు జైలులో ఉండటం దారుణం అన్న రీతిలో టీడీపీ వ్యవహరిస్తోంది. వేర్వేరు కారణాలతో చనిపోయినా చంద్రబాబు కోసమే మృతిచెందినట్టు ప్రచారం చేస్తున్నారు’’ అని సజ్జల ధ్వజమెత్తారు.
‘‘టీడీపీ స్టేక్ హోల్డర్స్ అంతా కలిసి నిన్న హైదరాబాద్‌లో ఈవెంట్ చేశారు. ప్రజలు ఏమనుకుంటారో అన్న జ్ఞానం కూడా లేదు. ఏదో మ్యూజికల్ ఈవెంట్‌కు రిహార్సల్ చేసినట్లు ప్రదర్శన చేశారు. స్కిల్ స్కామ్ కేసు గురించి ఎవ్వరూ మాట్లాడటం లేదు. టీడీపీ ఎవరి పార్టీ అన్నది గచ్చిబౌలీ ఈవెంట్‌తో అందరికీ తెలిసింది. ఆరు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. గతంలో మేం ఇది చేశామని చెప్పుకుని ఎన్నికలకు వెళ్లాలి. మేం సంక్షేమ పాలన అందించామని చెప్పి ప్రజల ముందుకెళుతున్నాం. మేనిఫెస్టోను చెత్తబుట్టకే పరిమితం చేసిన వ్యక్తి చంద్రబాబు. మేనిఫెస్టోను చెప్పిన ప్రతీ హామీని నెరవేర్చిన నాయకుడు సీఎం జగన్’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.
చదవండి: సిగ్నలింగ్ వ్యవస్థ ఎందుకు విఫలమైంది?.. సీఎం జగన్ ట్వీట్
Comments
Please login to add a commentAdd a comment