Dec 8th : చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌ | TDP Chandrababu Cases Petitions And Political Updates 8th December | Sakshi
Sakshi News home page

Dec 8th CBN Case Updates: చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌

Published Fri, Dec 8 2023 7:01 AM | Last Updated on Fri, Dec 8 2023 7:59 PM

TDP Chandrababu Cases Petitions And Political Updates 8th December - Sakshi

Chandrababu Cases, Political Updates

5.33 PM, 8th Dec 2023
ఓటర్లతో రాజకీయాలొద్దు : ఈసీ

  • విజయవాడ: డూప్లికేట్ ఓటు, డబుల్ ఓటుపై ఈసీ కీలక ఆదేశాలు
  • పక్క రాష్ట్రాల ఓటర్లకు ఈసీ షాక్
  • హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరులో ఓటు ఉన్నవారికి చెక్
  • అన్ని జిల్లాల కలెక్టర్లకు సీఈవో ముఖేష్ కుమార్‌ మీనా ఆదేశాలు
  • వేరే రాష్ట్రాల్లో ఉన్నవారికి ఏపీలో ఓట్లు ఉన్నాయని ఫిర్యాదు
  • ఒక వ్యక్తికి ఒకే నియోజకవర్గం, ఒకే రాష్ట్రంలో ఓటు ఉండాలి
  • ఒక  వ్యక్తికి ఎక్కువ  చోట్ల ఓటు ఉండటం నిబంధనలకు విరుద్ధం
  • ఫామ్‌ - 6 ద్వారా కొత్త ఓటు నమోదు మాత్రమే చేయాలి
  • కొత్తగా ఓటు నమోదు చేసుకునేందుకు డిక్లరేషన్ తీసుకోవాలి
  • వేరే ఎక్కడ ఓటు లేదని డిక్లరేషన్ ఇవ్వాలి
  • తప్పుడు డిక్లరేషన్ ఇచ్చే వారిపై కేసులు పెట్టాలి
  • తప్పుడు డిక్లరేషన్‌తో ఓటు నమోదు దరఖాస్తు చేస్తే జైలు శిక్ష

5.15 PM, 8th Dec 2023
ఓటర్లతో చంద్రబాబు రాజకీయం

  • రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి లేఖ రాసిన చంద్రబాబు
  • ఎలక్టోరల్ మాన్యువల్ 2023 ప్రకారం మార్పులు జరగట్లేదు
  • క్షుణ్ణంగా పరిశీలించి డబుల్ ఎంట్రీలను తొలగించాలి
  • ఇప్పటికీ డబుల్ ఎంట్రీలు గుర్తిస్తూనే ఉన్నారు
  • ఓటరు జాబితాలో ఇప్పటికీ మరణించిన వారి ఓట్లున్నాయి
  • ఆన్ లైన్ లో ఇష్టానుసారం ఓట్లు నమోదు చేస్తున్నారు
  • మా అభ్యంతరాల పై ఎప్పటికీ దృష్టి పెట్టలేదు

మరి తెలుగుదేశం చేస్తున్న పనులకు సమాధానం చెబుతావా చంద్రబాబు?

  • గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఓటర్‌ కేంద్రాలను తెలుగుదేశం ఎందుకు ప్రారంభించింది?
  • తెలంగాణలో ఓటేసినా సరే.. ఏపీలో కూడా దరఖాస్తు చేసుకోవాలని ఎందుకు చెబుతోంది?
  • మేమే కార్లు పెడతాం, వచ్చి ఓటేస్తే చాలని ఎందుకు చెబుతోంది?
  • ఆధార్‌ కార్డును ఓటర్‌ కార్డుతో జత పరిచి నకిలీ ఓట్లను తొలగిస్తే టిడిపి ఎందుకు గగ్గోలు పెడుతోంది?
  • ఓ వైపు ఎల్లో మీడియాలో నకిలీ ఓటర్లను మీరే వార్తలు రాయిస్తున్నారు.. మరోవైపు తొలగిస్తున్నారని చెబుతున్నారు?
  • అసలు ఎన్నికల సంఘం పని వారినే చేసుకోనివ్వకుండా.. మీరెందుకు తల దూర్చుతున్నారు?
  • పారదర్శకంగా ఎన్నికలు జరిగితే ఓటమి తప్పదని ముందే ఓ నిర్ణయానికి వచ్చారా బాబు?


(నిజాంపేట - ప్రగతి నగర్‌ ప్రాంతంలో తెలుగుదేశం ఏర్పాటు చేసిన ఓటరు నమోదు కేంద్రం)

4.55 PM, 8th Dec 2023
బెయిల్ కండీషన్లను ఉల్లంఘించిన చంద్రబాబు

  • స్కిల్ స్కాంపై ఎక్కడా మాట్లాడకూడదని కోర్టు నిబంధనలు
  • నిబంధనలు ఉల్లంఘిస్తూ తెనాలిలో స్కిల్ స్కాంపై మాట్లాడిన బాబు
  • కేసు కోర్టు విచారణలో ఉన్న సమయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు
  • ‘లీగల్ గా, టెక్నికల్ గా తప్పు చేయకున్నా జైల్లో పెట్టారు’  : చంద్రబాబు
  • అరెస్ట్‌ చేసినందుకు CID పోలీసులను, రిమాండ్‌కు పంపినందుకు కోర్టును తప్పుబట్టిన చంద్రబాబు

3.35 PM, 8th Dec 2023
కేసు ఎందుకు వాయిదా పడిందంటే.?

  • స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ విచారణను జనవరి 19కి వాయిదా
  • 17ఏ వ్యవహారం పై తీర్పు ఇస్తే మాత్రం వాయిదా వేయాలని కోరిన హరీష్ సాల్వే
  • కౌంటర్ దాఖలుకు సిద్ధంగానే ఉన్నాం, వాయిదా వేయకుంటే విచారణ తేదీ చెప్పాలని విజ్ఞప్తి
  • 17ఏ తీర్పుతో ముడిపడి ఉందన్న విషయాన్ని ప్రస్తావించిన హారీష్ సాల్వే
  • నోటీసులు ఇచ్చినా ఇంకా కౌంటర్ వేయలేదని కోర్టుకు తెలిపిన ప్రభుత్వ న్యాయవాది
  • విచారణను జనవరి మూడో వారంలో చేపడతామన్న జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం
  • సాల్వే విజ్ఞప్తితో విచారణను జనవరి 19కి వాయిదా వేసిన ధర్మాసనం

3.15 PM, 8th Dec 2023
50 ఎమ్మెల్యేలు.. 5 ఎంపీలు
పవన్‌ కళ్యాణ్‌కు తెగేసి చెబుతోన్న కాపులు

  • ఇంతకంటే తక్కువయితే జనసేనను ఎందుకు నమ్మాలి?
  • అసలు చంద్రబాబుకు ఎందుకు జై కొట్టాలి?
  • 50 చోట్ల కాపులు లేదా జనసేన నాయకులు ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సిందే.!
  • 5 చోట్ల ఎంపీలుగా జనసేన నాయకులు పోటీ చేయాల్సిందే.!
  • అసలు పొత్తు పెట్టుకునేపుడు ఏం చెప్పావు.?
  • తెలుగుదేశం వెనక కాదు.. కలిసి నడుస్తానన్నావు.!
  • ఇప్పుడేమో రాజీ పడాలంటున్నావు.?
  • అసలు కాపులెందుకు రాజీ పడాలి?

అసలు కాపులు సీఎం జగన్‌ను ఎందుకు వ్యతిరేకించాలి?

  • సీఎం జగన్‌ 52 నెల పాలనలో కాపు, శెట్టి బలిజలకు నేరుగా లబ్ది పొందింది రూ. 22333 కోట్లు
  • నాన్‌ డిబిటి ద్వారా కాపు సామాజిక వర్గానికి వచ్చింది రూ. 16914 కోట్లు, మొత్తం 32247 కోట్లు లబ్ది
  • రెడ్డి నేస్తం, కమ్మ నేస్తం లేకున్నా కాపు నేస్తం ఉంది కదా..

చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కాపు నేతలెవరికి మేలు జరగలేదు

  • హోం శాఖ మంత్రిగా చినరాజప్పను పెట్టాడు. ఏం జరిగింది?.? కనీసం కానిస్టేబుల్‌ను కూడా బదిలీ చేయలేని దుస్థితి అని వాపోయాడు
  • కొందరు కాపులకు పదవులిచ్చాడు.. ఎవరెవరికి ఇచ్చాడు..? జీవిత భాగస్వామి అంటే భర్త లేదా భార్య కమ్మ అయితే వారికి ఇచ్చాడు
  • మరి జగన్‌ ప్రభుత్వంలో ఏం జరిగింది?
  • బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, రాంబాబు, కన్నబాబు, ముత్తంశెట్టి, అమర్‌నాథ్‌ ఇంకా ఎందరికో.. ఎన్నెన్నో పదవులు వచ్చాయి

అయినా కాపులను చంద్రబాబు ఒక రేంజ్‌లో ఆడుకున్నాడని మన సీనియర్లే కదా చెప్పుకున్నది

  • హరిరామజోగయ్య రాసిన పుస్తకంలో ఏముంది? వంగవీటి రంగా హత్య ఎప్పటికీ మరిచిపోరు
  • కన్నా లక్ష్మీనారాయణ ఏం చెప్పాడు.. తృటిలో నేను తప్పించుకున్నాను, లేదంటే నన్ను ఏమైనా చేసేవారు
  • ముద్రగడ ఏం అన్నాడు.. నా కుటుంబాన్ని చిత్రహింసలు పెట్టి, నా భార్యా, కొడుకులను దుర్భాషలాడారు

అంతెందుకు..! ఒక సారి తాజా చరిత్ర క్షుణ్ణంగా చదవండి

  • ప్రముఖ సినిమా దర్శకుడు దాసరి నారాయణరావు ఏం చెప్పాడు.?
  • నా పత్రికలో తెలుగుదేశానికి మద్ధతివ్వకపోతే.. ఏం చేస్తానో తెలుసు కదా అని చంద్రబాబు బెదిరించారన్నాడు. పత్రికను మూసేయించేవరకు ఒత్తిడి తెచ్చాడని చెప్పాడు
  • అయినా.. రంగా హత్య తర్వాత చెలరేగిన అల్లర్లకు సంబంధించి దొరికిన కాపును దొరికినట్టుగా అరెస్ట్‌ చేసి ఎన్నో కేసులు పెట్టించింది ఎవరు.? చంద్రబాబు కాదా?
  • చంద్రబాబు హయాంలో తుని రైలు దహనం కేసులు పెడితూ.. కాపుల కోరిక మేరకు సీఎం జగన్‌ వాటిని ఎత్తేయించాడు
  • చంద్రబాబు హయాంలో చిరంజీవి ఖైదీ నెంబర్‌ 150కి ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వలేదు, పైగా హాయిలాండ్‌లో ఫంక్షన్‌ పెట్టుకుంటే రాత్రి 9గంటలకల్లా ముగియాలంటూ ఒత్తిడి తెచ్చారు

కాపులను చంద్రబాబు, ఆయన కుటుంబం ఎన్ని రకాలుగా చిన్న చూపు చూడలేదు.?

  • చంద్రబాబు బావమరిది నందమూరి బాలకృష్ణ ఏమన్నాడు?
  • లేపాక్షి ఉత్సవాలకు పిలవాలంటే.. నా పక్కన నిలబడాలంటే ఒక స్థాయి ఉండాలి, ఎవరిని పడితే వారిని ఎలా పిలవాలన్నాడు
  • సంకర జాతి, బ్రీడ్‌.. అంటూ నానా పదాలు కాపులనుద్దేశించి మాట్లాడాడు
  • మా నాన్న లాగా పార్టీ పెట్టి 6 నెలల్లో ముఖ్యమంత్రి కావాలని కలలు కన్నారంటూ ఎద్దేవా చేశాడు, చరిత్ర సృష్టించాలన్నా.. అది తిరగరాయాలన్నా అది మాకే నంటూ కాపులను ఎద్దేవా చేశాడు
  • అప్పుడు ప్రజారాజ్యం పెట్టినప్పుడు చిరంజీవి బాధ కాపులకు తెలియదా?
  • ఈనాడు, ఆంధ్రజ్యోతి కక్షపట్టి.. పార్టీ మూసేయించేంతవరకు పట్టుబట్టారని చిరంజీవి చెప్పలేదా?
  • పవన్‌ చెప్పాడని గుడ్డిగా జగన్‌ మీద కక్ష పెంచుకోగలమా?
  • దమ్ముంటే 50 ఎమ్మెల్యే సీట్లు, 5 ఎంపీ సీట్లు తీసుకుని రా
  • అధికారంలో సగం వాటా ఇవ్వమని అడుగు
  • లేదంటే కాపుల ప్రస్తావనను తీసుకురాకు
  • నీ రాజకీయ ప్రయోజనాల కోసం కాపులను బలిపెట్టకు


(ఫైల్‌ ఫోటో : చంద్రబాబు కోసం రోడ్డుపై పడుకుని నిరసన తెలుపుతున్న పవన్‌ కళ్యాణ్‌)

3.04 PM, 8th Dec 2023
అంటే అన్నామంటారు కానీ.. బర్రెలక్క కంటే అన్యాయం కాదా?

  • జనసేన అనేది ఒక పొలిటికల్‌ కాంట్రాక్ట్‌ పార్టీ : మంత్రి గుడివాడ అమర్
  • చంద్రబాబు కోసమే పనిచేసే వ్యాపార సంస్థ అది..
  • తెలంగాణ రిజల్ట్‌తో పవన్‌కళ్యాణ్‌కు మతి చెడింది
  • పవన్ కల్యాణ్ కంటే.. బర్రెలక్క(శిరీష)నయమనిపిస్తుంది
  • అబ్రహం లింకన్ కాదు..నారా లింకనే పవన్ కు స్ఫూర్తి
  • ప్రజల్లో ఎటువంటి స్థాయి, బలం లేని వ్యక్తి పవన్ కల్యాణ్
  • జగన్ గారిని విమర్శించి తన స్థాయి పెంచుకోవాలని పవన్ చూస్తున్నాడు.
  • విశాఖ ఉక్కుపై అబద్ధాల కబుర్లు చాలించు పవన్..!
  • ఆంధ్రప్రదేశ్‌తో నీకు సంబంధం ఏంటి పవన్ కల్యాణ్..?
  • పార్టీ పెట్టి పదేళ్లయినా సొంత నియోజకవర్గం ఏంటో చెప్పలేదు.?

2.45 PM, 8th Dec 2023
సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు జనవరి 19కి వాయిదా

  • ఢిల్లీ:  చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ జనవరి 19కి వాయిదా
  • విచారణ చేసిన జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం
  • స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలన్న సీఐడీ పిటిషన్ పై గత విచారణలో నోటీసులు ఇచ్చిన సుప్రీంకోర్టు
  • ఈ కేసుకు సంబంధించి పబ్లిక్ కామెంట్స్ చేయవద్దని బాబుకు షరతులు విధించిన కోర్టు

1.30 PM, 8th Dec 2023
విశాఖ కార్యాలయాల కేసుపై విచారణ

  • విశాఖకు క్యాంప్ కార్యాలయాలు తరలిస్తున్నారని పిటిషన్‌
  • జీవో 2283ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ
  • ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరామ్
  • పిటిషన్ కు విచారణ అర్హత లేదని స్పష్టం చేసిన ఏజీ శ్రీరామ్
  • పిల్ వేయాల్సిన అంశాన్ని రిట్ పిటిషన్ గా దాఖలు చేయడాన్ని కోర్టు దృష్టికి తెచ్చిన ఏజీ
  • గతంలో పిల్ అంశాన్ని ఇప్పుడు రిట్ పిటిషన్ గా దాఖలు చేశారన్న ఏజీ
  • రాజధాని తరలింపుపై స్టే ఇవ్వాలంటూ రైతుల పిటిషన్
  • పిటిషన్ కు విచారణ అర్హత లేదంటూ అడ్వకేట్ జనరల్ వాదనలు
  • రైతుల తరఫున లాయర్ ఉన్నం మురళీధర్‌ రావు వాదనలు
  • రైతు సమాఖ్య పిటిషన్లకు విచారణ అర్హత ఉందని వాదన
  • రాజధాని రైతులకు కౌలు చెల్లించాలని రైతు పరిరక్షణ సమితి : మురళీధర్‌
  • ఇరుపక్షాల లాయర్ల మధ్య హోరాహోరీ వాదనలు
  • రెండు సంఘాల్లోని రైతులు కోర్టు ఫీజు చెల్లించాలని ఆదేశం
  • విచారణ సోమవారానికి వాయిదా వేసిన హైకోర్టు

12.13 PM, 8th Dec 2023
అయ్యా.. పవనాలు.. కాస్తా వెనక్కి తిరిగి చూసుకో: YSRCP చురకలు

  • తెలంగాణలో బీజేపీ, ఏపీలో టీడీపీ : అడపాశేషు
  • పవన్ ఎవరితోనైనా ఎప్పుడైనా పొత్తు పెట్టుకోగలడు
  • పవన్ ను నమ్ముకుంటే తెలంగాణలో బీజేపీకి పట్టినగతే ఇక్కడ కూడా
  • పవన్ తీరు అక్కడ అమ్మాయి...ఇక్కడ అబ్బాయి సినిమాలాగే ఉంది
  • అక్కడ పోతే బీజేపీ పోయిందని వదిలేశాడు
  • ఇక్కడ చంద్రబాబు కోసం ఆరాట పడుతున్నాడు
  • ఒక సినిమా పోతే....మరో సినిమా అన్నట్లుంది పవన్ విధానం
  • ఏపీకి ఏం చేశాడని పవన్ ను ప్రజలు నమ్మాలి?
  • పవన్ ఉన్నత వర్గాలకు కొమ్ముకాస్తున్నారు
  • జనసేనకు కచ్చితంగా ప్రజలే సమాధానం చెబుతారు : అడపా శేషు

చంద్రబాబును సీఎం చేస్తామన్నది జనసేన పగటికల

  • పార్టీ పెట్టి పదేళ్లయ్యింది....ఏం సాధించావ్ పవన్? : వెల్లంపల్లి
  • చంద్రబాబుకి ఊడిగం చేసే వ్యక్తి పవన్ కల్యాణ్
  • రాజకీయ విలువల్లేని వ్యక్తి పవన్
  • ధైర్యం ఉంటే 175 స్థానాల్లో జనసేన అభ్యర్థుల్ని నిలబెట్టాలి
  • టీడీపీ నుంచి 29 సీట్లు అడుక్కోవడానికి సిగ్గులేదా? : వెల్లంపల్లి

పవన్‌కు డిపాజిట్లు రాలేదు, కమిట్‌మెంట్‌ లేదు

  • తెలంగాణలో జనసేనకు డిపాజిట్లు కూడా దక్కలేదు : అమర్నాథ్
  • తెలంగాణలో స్థిర నివాసమున్న మీ బలం ఏమిటో తేలిపోయింది
  • అబ్రహం లింకన్ గురించి కాదు.... చంద్రబాబుతో ఉన్న లింకుల గురించి పవన్ మాట్లాడితే మంచిది
  • రాజకీయాలపై పవన్ కు ఏమాత్రం కమిట్‌మెంట్ లేదు
  • ఇన్ఫోసిస్ డెవలప్‌మెంట్ సెంటర్ కాదు.... శాటిలైట్ సెంటర్ అని నిరూపిస్తే పదవికి రాజీనామా  చేస్తా
  • అత్తారింటికి దారేది అంటే పవన్ 3 దారులు వెతుక్కోవాలి : అమర్నాథ్

11.30 AM, 8th Dec 2023
తుపాను రూపంలో చంద్రబాబుకు అవకాశం

  • జైలు జీవితం తర్వాత ప్రజా జీవితంలోకి చంద్రబాబు
  • ఎప్పుడెప్పుడా అని ఇన్నాళ్లు ఎదురుచూస్తోన్న బాబు
  • తుపాను రూపంలో  చంద్రబాబుకు దొరికిన అవకాశం
  • ఉమ్మడి గుంటూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన
  • తుపాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తున్న చంద్రబాబు
  • దెంబతిన్న పంట పొలాలను పరిశీలిస్తున్న చంద్రబాబు
  • రైతులకు చంద్రబాబు పరామర్శ
  • పొన్నూరు, వేమూరు,తెనాలి, బాపట్లలో పర్యటన
  • రేపు పర్చూరు, పత్తిపాడు నియోజకవర్గంలో పర్యటన

11.00 AM, 8th Dec 2023
బర్రెలక్క స్థాయిలో కూడా పవన్ సేన పోటీ ఇవ్వలేదు: మంత్రి అమర్నాథ్‌

  • పవన్‌ కళ్యాణ్‌కు తెలంగాణలో వచ్చిన ఫలితమే ఏపీలో కూడా వస్తుంది. 
  • అందుకు నిన్న సభ మరోసారి రుజువు చేసింది. 
  • విశాఖ అన్ని రకాలుగా మేలు చేసిందని చెప్పే మీరు రాజధాని అంశాన్ని ఎందుకు అడ్డుకుంటున్నారు
  • నిన్న విశాఖ వేదికగా పవన్ విమర్శలు చేశారు
  • వ్యక్తి గతంగా సీఎం జగన్‌పై అవాస్తవ విమర్శలు చేశారు
  • తెలంగాణ ఫలితాలు చూశాక పవన్‌కు మతి భ్రమించినట్టు కనిపిస్తుంది
  • సోషల్ మీడియాలో చూస్తే బర్రెలక్క స్థాయిలో పవన్ సేన పోటీ పడింది
  • బర్రెలక్కను తక్కువ చేయడం లేదు.. ఆమె స్థాయి కూడా పవన్ సేన పోటీ ఇవ్వలేదు
  • పవన్ కళ్యాణ్ మీకు ఏపీకి సంబంధం ఏంటి?.
  • మీరు ఏపీలో ఎంతకాలం వున్నారు?.
  • పవన్ మీ నియోజకవర్గం ఏంటో చెప్పగలరా?
  • ఎక్కడకు వెళ్తే అక్కడ మా నియోజక వర్గం అంటారు
  • అబ్రహం లింకన్‌కు మీకు సంబంధమేంటి?.. మీది చంద్రబాబు లింకన్ సంబంధం
  • పవన్‌ కళ్యాణ్‌ది ది పొలిటికల్‌ కాంట్రాక్ట్‌. 
  • అధికారికంగా బీజేపీతో అనధికారికంగా టీడీపీతో పవన్ సంబంధం 

10:00 AM, Dec 8, 2023
నేడు చంద్రబాబు పిటిషన్‌పై విచారణ

  • నేడు సుప్రీంకోర్టులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ.
  • జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం విచారణ చేయనుంది.
  • స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలన్న సీఐడీ పిటిషన్‌పై గత విచారణలో సుప్రీంకోర్టు నోటీసులు జారీ.
  • ఈ కేసుకు సంబంధించి పబ్లిక్‌గా కామెంట్స్ చేయవద్దని చంద్రబాబుకు కోర్టు షరతులు విధించిన సంగతి తెలిసిందే.
  • క్వాష్‌ పిటిషన్‌పై తీర్పు వెలువరించిన తర్వాతే బెయిల్‌ రద్దు కేసు విచారణ చేపడతామని తెలిపిన కోర్టు..
  • డిసెంబరు 8లోగా లిఖితపూర్వక కౌంటరు దాఖలు చేయాలని చంద్రబాబుకు ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన కోర్టు.

ఉత్తర్వుల్లో సుప్రీంకోర్టు పేర్కొన్న అంశాలు

  • బెయిల్‌ కండిషన్లు అన్నీ యథాతధం
  • స్కిల్‌ కుంభకోణం కేసు గురించి చంద్రబాబు ప్రకటనలు చేయొద్దు
  • కేసు వివరాలపై బహిరంగంగా ప్రకటనలు చేయొద్దు
  • కేసుకు సంబంధించిన విషయాలు మీడియాలో మాట్లాడొద్దన్న షరతును గతంలో తొలగించిన హై కోర్ట్
  • హైకోర్టు తొలగించిన షరతును తిరిగి చంద్రబాబుకు విధించిన సుప్రీంకోర్టు
  • ర్యాలీలు నిర్వహించడం, రాజకీయ కార్యకలపాల్లో పాల్గొనడంపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులే అమల్లో ఉంటాయి
  • తదుపరి విచారణ వరకు ఆదేశాలు కొనసాగుతాయని తెలిపింది. డిసెంబర్‌ 8లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు జారీ.

6:40 AM, Dec 8, 2023
సీఐడీ పిటిషన్‌పై నేడు విచారణ

  • నేడు ఏపీ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ 
  • స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ 
  • 16వ నంబర్ కోర్టులో 51 ఐటమ్‌గా లిస్టైన చంద్రబాబు బెయిల్ రద్దు కేసు
     

పవన్‌కు షాకిచ్చిన ప్రజలు..

  • తెలంగాణ ఎన్నికల్లో జనసేన ఘోర పరాజయం తర్వాత తొలిసారి విశాఖకు పవన్‌. 
  • పవన్‌కు షాకిచ్చిన విశాఖ ప్రజలు.
  • ఏఎస్ రాజా గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభ ప్రాంగణం జనాలు లేక వెలవెలబోయింది.
  • ఖాళీ కుర్చీలతో దర్శనమిచ్చింది.
  • పవన్ కళ్యాణ్‌ రెండు గంటలకు పైగా హోటల్‌లోనే ఉండిపోయారు.
  • చివరకు కుర్చీలు తీసేసి గ్రౌండ్‌లో సగం వరకే వేసినా అవి కూడా నిండలేదు.
  • ప్రజలను సభకు తీసుకురావడంలో విఫలమయ్యారంటూ జన సైనికులపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్.

6:30 AM, Dec 8, 2023
లారీ కింద దూరిన కుక్కలకు.. టీడీపీ కుక్కలకూ తేడాలేదు: కొడాలి నాని

  • ఆగి ఉన్న లారీ కింద దూరిన కుక్క ఆ లారీ అదే మోస్తందనుకుంటుంది
  • రేవంత్ రెడ్డిని టీడీపీ వాళ్లే సీఎం చేసినట్టు గొప్పలు చెప్పుకుంటున్నారు
  • సిగ్గులేకుండా గాంధీభవన్‌లో టీడీపీ జెండాలు పట్టుకుని గంతులేస్తున్నారు 
  • చంద్రబాబు అధికారంలోకి రావటం పగటి కల
  • అంతరిక్షం నుంచి వచ్చినా గుడివాడలో వైఎస్సార్‌సీపీని ఓడించలేరు 
  • ఏపీలో చంద్రబాబుతో కలిసి జనసేన పోటీ చేస్తే తెలంగాణలో మాదిరే అవుతుంది 

సీఎం పదవిపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు 

  • మేం టీడీపీ వెనుక నడవడం లేదు, టీడీపీతో కలిసి నడుస్తున్నాం 
  • జనసైనికుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టను 
  • ఎక్కువ సీట్లు గెలిస్తే సీఎం పదవి అడగవచ్చు
  • సీఎం ఎవరనేది చంద్రబాబు, నేను కూర్చొని నిర్ణయం తీసుకుంటాం 
  • అన్నీ ప్రజలకు చెప్పే చేస్తాం.. మీ ఆత్మగౌరవం ఎప్పుడు తగ్గించను 
  • ఏపీ అభివృద్ధికి అలయన్స్ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు 
  • మేం ఎవరికి బీ పార్టీ కాదు 
  • డొంక తిరుగుడు పనులు నేను చేయను 
  • ఎవరు నాతో వచ్చినా రాకున్నా నేను నడుస్తూనే ఉంటా.

6:30 AM, Dec 8, 2023

ఏపీ ఫైబర్ నెట్ స్కామ్‌లో మరో కీలక పరిణామం

  • టెరాసాఫ్ట్‌ కేసులో డీఆర్‌ఐ కొరడా
  • ఫైబర్‌ నెట్‌ కుంభకోణంలో పన్ను ఎగ్గొట్టిన వారిపై ఏపీ డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటలిజెన్స్‌ కొరడా
  • ఫైబర్‌ నెట్‌ స్కాంలో పన్ను ఎగ్గొట్టినందుకు ఫాస్ట్‌లేన్‌ టెక్నాలజీస్‌కు రూ.34 కోట్ల పెనాల్టీ విధింపు
  • కొన్నవారి నుంచి GSTని సేకరించి ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉన్న అమ్మకం దారు
  • GST నిబంధనలను తుంగలో తొక్కిన ఫాస్ట్‌లైన్‌ టెక్నాలజీస్‌
  • ఆధారాలను పరిశీలిస్తే రూ.10.81 కోట్ల పన్ను ఎగ్గొట్టినట్టు గుర్తింపు
  • ఈ డబ్బును హవాలా మార్గంలో తరలించినట్టు ఆధారాలు
  • ఫాస్ట్‌లేన్‌ టెక్నాలజీస్‌ వెనక ఉన్నది టెరాసాఫ్ట్‌ కంపెనీ
  • ఏపీ ఫైబర్‌నెట్‌ నిధులను పక్కదారి పట్టించింది కూడా ఈ కంపెనీలే
  • విచారణలో పన్ను ఎగ్గొట్టినట్టు ఒప్పుకున్న ఫాస్ట్‌లేన్‌ మాజీ ఎండీ విప్లవ్‌కుమార్‌
  • నిధులన్నీ డొల్ల కంపెనీల ద్వారా రూటు మార్చినట్టు అంగీకారం
  • ఈ కేసులో ప్రధాన నిందితుడిగా వేమూరి హరిప్రసాద్‌ గుర్తింపు (చంద్రబాబు సన్నిహితుడు)
  • టెరాసాఫ్ట్‌ ఎండీ తుమ్మల గోపిచంద్‌ విజ్ఞప్తి మేరకే పాస్ట్‌లేన్‌ను ఏర్పాటు చేసినట్టు తెలిపిన విప్లవ్‌ కుమార్‌
  • ఇప్పటికే ఈ కేసులో నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించిన ఇంగ్రామ్‌
  • ఫాస్ట్‌లేన్‌ దివాళా తీసినట్టు నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌కు తెలిపిన ఇంగ్రామ్‌
  • సెప్టెంబర్‌ 2020 నుంచి కార్యకలపాలు నిలిపివేసిన ఫాస్ట్‌లేన్‌
  • ఎలాంటి కార్యకలపాలు చూపించకపోవడంతో ఫాస్ట్‌లేన్‌ రిజిస్ట్రేషన్‌ రద్దు చేసిన ప్రభుత్వం
  • ఈ కేసులో ముందస్తు బెయిల్‌ తీసుకున్న వేమూరి హరికృష్ణ, తుమ్మల గోపిచంద్‌
  • ఇదే కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌ను తిరిస్కరించిన హైకోర్టు
  • సుప్రీంకోర్టులో డిసెంబర్‌ 12న విచారణకు రానున్న చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌

స్కిల్ కుంభకోణంలో కీలక పరిణామం

  • A13 నిందితుడు చంద్రకాంత్ షాని ఏసీబీ కోర్టు ముందు హాజరుపరిచిన సీఐడీ అధికారులు
  • అప్రూవర్‌గా మారుతున్నట్లు కోర్టు ఎదుట తెలిపిన చంద్రకాంత్ షా
  • తదుపరి విచారణ జనవరి‌ 5కి వాయిదా
  • చంద్రకాంత్ షా స్టేట్‌మెంట్‌ని జనవరి 5న రికార్డు చేయనున్న ఏసీబీ కోర్టు

ఓటుకు కోట్లు కేసు వాయిదా 

  • తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు రూ.కోట్లు కేసు విచారణను వాయిదా వేసిన సుప్రీంకోర్టు
  • కేసు నుంచి తప్పించాలంటూ తెలంగాణ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య దాఖలు చేసిన పిటిషన్‌
  • సోమవారం జస్టిస్‌ సంజీవ్‌ఖన్నా, జస్టిస్‌ ఎస్‌వీఎన్‌ భట్టితో కూడిన ధర్మాసనం విచారణ
  • విచారణ వాయిదా వేయాలని కోరిన తెలంగాణ ప్రభుత్వం,పిటిషనర్‌ తరఫు న్యాయవాదులు
  • వచ్చే ఏడాది జనవరికి వాయిదా వేసిన ధర్మాసనం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement