
న్యూఢిల్లీ: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది. స్కిల్ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయగా.. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సీఐడీ సవాల్ చేసిన విషయం తెలిసిందే. చంద్రబాబు బెయిల్‌ను రద్దు చేయాలని సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది.
విచారణ సందర్భంగా అప్పటి ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వర్చువల్‌గా వాదనలు వినిపించారు. చంద్రబాబు బెయిల్ రద్దును సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
ప్రస్తుతం తాను ఢిల్లీలో లేనని, విచారణకు నేరుగా కోర్టుకు హాజరై వాదనలు వినిపించేందుకు కొంత సమయం కావాలని ముకుల్ రోహత్గి కోరారు. దీంతో జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ సతీశ్ చంద్రశర్మలతో కూడిన ధర్మాసనం విచారణను జనవరి రెండో వారానికి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment