Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Chandrababu team land grabbing in the name of Amaravati
బాబు భూ దోపిడీ ఖజానా!

సాక్షి, అమరావతి: ‘‘ఏ’’ అంటే.. అమరావతి అని వక్కాణిస్తున్న సీఎం చంద్రబాబు.. రాజధాని ముసుగులో తన అవినీతి, అరాచకాలకు కేంద్రంగా చేసుకున్నారు! బరితెగించి తాను పాల్పడిన అవినీతికి అక్షయపాత్రలా మార్చారు! నాటి తెల్ల దొరలే తెల్లబోయేలా వ్యవహరించారు! బ్రిటిష్‌ పాలకుల సామ్రాజ్యవాద దోపిడీని మరిపిస్తూ టీడీపీ పెద్దలు సాగించిన భూ దోపిడీకి నిలువెత్తు సాక్ష్యం అమరావతి... బడుగులు, పేదలకు స్థానం లేకుండా చంద్రబాబు సృష్టించుకున్న నయా జమిందారీ వ్యవస్థకు నిదర్శనం అమరావతి! పచ్చ రాబందులు గుప్పిట పట్టిన రూ.లక్షల కోట్ల విలువైన భూ ఖజానా అమరావతి! దేశ చరిత్రలోనే అతిపెద్ద భూ దోపిడీకి మౌనసాక్షి అమరావతి!! ఈ భూ బాగోతాలు, తన నిర్వాకాలను కప్పిపుచ్చి మభ్యపెట్టేందుకే తాజాగా అమరావతిపై శ్వేతపత్రం అంటూ మరో డ్రామాకు చంద్రబాబు తెర తీశారు.మోయలేని భారం మోపుతూ...రాజధానిగా అమరావతి ఎంపిక చేసిన ప్రాంతం ఇటు విజయవాడ కాదు.. అటు గుంటూరూ కాదు. మూడు పంటలు పండే సారవంతమైన పంట పొలాల్లో నిర్మాణ వ్యయం తడిసి మోపెడవుతుందని చంద్రబాబు అండ్‌ కో కట్టిన లెక్కలే చెబుతున్నాయి. ఒక్క ఎకరాలో కనీస మౌలిక వసతుల కల్పనకు (బేసిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌) రూ.2 కోట్లు వ్యయం అవుతుందని, మొత్తం రాజధాని ప్రాంతం అభివృద్ధి చేయడానికి రూ.లక్ష కోట్లకు పైగా ఖర్చువుతుందని అప్పట్లోనే అంచనా వేశారు. ఏటా ఆ వ్యయం పెరగడమే కానీ తగ్గదు. విభజన అనంతరం రాష్ట్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత భారీగా నిధులు ఖర్చు చేయడం సాధ్యమయ్యే పని కాదని నిపుణులు చేసిన హెచ్చరికలను చంద్రబాబు పట్టించుకోలేదు. తాజాగా భారీగా నిధులు అవసరమంటూనే.. వివరాలు సేకరిస్తామని చెబుతున్నారు. అధికార పగ్గాలు చేపట్టిన మూడు వారాల్లోనే రూ.7 వేల కోట్లు అప్పు చేసిన టీడీపీ ప్రభుత్వం.. సంపదను ఎలా సృష్టించి రాజధాని నిర్మాణం చేస్తుందనే ప్రశ్నకు జవాబు లేదు.భూములు లాక్కుని గాలి మేడలు..!అమరావతి వేదికగా చంద్రబాబు సాగించిన భూ దందాను అప్పట్లోనే నిపుణుల నుంచి సామాన్యుల వరకూ అందరూ తీవ్రంగా వ్యతిరేకించారు. అమరావతి ప్రాంతం రాజధాని నిర్మాణానికి అనువైనది కాదని శివరామకృష్ణన్‌ కమిటీ స్పష్టం చేసింది. ఏడాదికి మూడు పంటలు పండే భూములను నాశనం చేయవద్దని పర్యావరణవేత్తలు అభ్యంతరం చెప్పారు. జీవనాధారమైన తమ భూములను కొల్లగొట్టవద్దని బడుగు, బలహీనవర్గాలు, పేద రైతులు వేడుకున్నారు. వారి విన్నపాలను బేఖాతర్‌ చేస్తూ చంద్రబాబు భారీ భూదోపిడీకి తెరతీశారు. అసైన్డ్‌ భూములను బినామీల ద్వారా హస్తగతం చేసుకుని పరిహారం ప్రకటించుకున్నారు. 2014–19 మధ్య రాజధాని పేరిట అమరావతి ముసుగులో చంద్రబాబు బృందం చేయని దురాగతం లేదు. అదిగో రాజధాని.. అల్లదిగో అమరావతి..! అంటూ అరచేతిలో వైకుంఠం చూపించారు. అంతకుముందు పక్కా పన్నాగంతో రాజధాని అక్కడ.. ఇక్కడ అంటూ పలు ప్రాంతాల పేర్లను తెరపైకి తెచ్చి సామాన్యులను బురిడీ కొట్టించారు. మరోవైపు ముందస్తుగా తాము భూముల కొనుగోలు చేసిన అమరావతిలో బినామీ మాఫియాను వ్యవస్థీకృతం చేశారు. అంతర్జాతీయ స్థాయి రాజధాని.. ఆకాశ హరŠామ్యల నగరం అంటూ గాలిలో మేడలు కట్టి రైతుల కాళ్ల కిందున్న భూమిని కాజేశారు.పచ్చ దండు దురాక్రమణ..దేశంలోనే కాదు ప్రపంచ చరిత్రలోనే అతి పెద్ద భూ దోపిడీకి చంద్రబాబు బరి తెగించారు. రాజధాని ప్రచారంతో మాయాజాలం... భూసమీకరణ ముసుగులో దోపిడీ... అసైన్డ్‌ భూములు, ప్రభుత్వ భూములు, లంక భూముల స్వాహా... ఇన్నర్‌ రింగ్‌ రోడ్డులో అవినీతి మలుపులు... అస్మదీయులకు యథేచ్ఛగా భూ పందేరాలు... ఇలా ఒకటేమిటి ఎన్ని రకాలుగా భూదోపిడీకి పాల్పడవచ్చో అన్ని విద్యలూ ప్రయోగించారు. అమరావతిపై చంద్రబాబు ‘పచ్చ దండు’ దండయ్రాత చేసి రూ.లక్షల కోట్ల విలువైన భూముల దురాక్రమణకు పాల్పడింది. చంద్రబాబుతోపాటు ఆయన కుటుంబ సభ్యులు, నాటి టీడీపీ ప్రభుత్వంలో మంత్రులు, టీడీపీ నేతలు, వారి బినామీలు అమరావతి భూములపై వాలిపోయారు. చంద్రబాబు, లోకేశ్‌తోపాటు నారాయణ, సుజనా చౌదరి, ప్రత్తిపాటి పుల్లారావు, మాగుంట మురళీమోహన్, కొమ్మాలపాటి శ్రీధర్, కోడెల శివప్రసాద్‌ కుమారుడు శివరామకృష్ణ, ధూళిపాళ్ల నరేంద్ర, పయ్యావుల కేశవ్, బాలకృష్ణ వియ్యంకుడు ఎంఎస్‌పీ రామారావు.. ఇలా పచ్చ దండు అంతా అమరావతిలో భూములను కొల్లగొట్టింది. అన్యాయంగా, ఏకపక్షంగా విభజనకు గురై కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి ఆదిలోనే హంసపాదులా అభివృద్ధికి గండి కొట్టారు. తాత్కాలిక రాజధాని భవనాల పేరుతో కనికట్టు చేశారు.మభ్యపుచ్చే యత్నాలు..నాడు ఐదేళ్లలో భూముల దోపిడీకి పాల్పడటం మినహా టీడీపీ పెద్దలు రాజధాని కట్టిందీ లేదు.. అభివృద్ధి చేసిందీ లేదు. చంద్రబాబు బృందం సాగించిన భూ దోపిడీ ఇప్పటికే సీఐడీ దర్యాప్తులో పూర్తి ఆధారాలతోసహా బట్టబయలైంది. సీఐడీ న్యాయస్థానాల్లో చార్జిషీట్లు కూడా దాఖలు చేసింది. ఇక న్యాయ విచారణ ప్రక్రియ కొనసాగితే చంద్రబాబుకు యావజ్జీవ ఖైదు ఖాయమని న్యాయ నిపుణులు తేల్చి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ అధికారంలోకి రాగానే చంద్రబాబు సరికొత్త కుట్రలకు పన్నాగం పన్నుతున్నారు. అమరావతిలో తన భూ బాగోతాన్ని కప్పిపుచ్చేందుకు శ్వేతపత్రం పేరుతో డ్రామాకు తెరతీశారు. రాజధాని నిర్మాణానికి తాను ఏం చేస్తానో చెప్పకుండా ఊకదంపుడు ఉపన్యాసంతో ఊదరగొట్టారు. రాజకీయ వ్యాఖ్యలు చేస్తూ తన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు పడరాని పాట్లు పడ్డారు. కానీ అమరావతి పేరిట చంద్రబాబు యథేచ్ఛగా సాగించిన దోపిడీ దాచేస్తే దాగేది కాదు. ఇప్పటికే పూర్తి ఆధారాలతో సహా చార్జిషీట్ల రూపంలో నిక్షిప్తమైందన్నది నిఖార్సైన నిజం.

T20 World Cup 2024: Road Show In Mumbai After Audience With PM In Delhi For Victorious Indian Team
ప్రధాని మోదీని కలవనున్న విశ్వ విజేతలు.. అనంతరం ముంబై వీధుల్లో విజయోత్సవ యాత్ర

యూఎస్‌ఏ, కరీబియన్‌ దీవులు వేదికగా జరిగిన టీ20 వరల్డ్‌కప్‌ 2024లో టీమిండియా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. జూన్‌ 29న జరిగిన ఫైనల్లో భారత్‌.. సౌతాఫ్రికాపై 7 పరుగుల తేడాతో విజయం సాధించి, రెండో టీ20 వరల్డ్‌కప్‌ను ఖాతాలో వేసుకుంది. ఈ గెలుపుతో టీమిండియా 11 ఏళ్ల కలను (ఐసీసీ ట్రోఫీ) సాకారం చేసుకుంది. భారత్ చివరిసారిగా 2013లో ఐసీసీ ట్రోఫీని (ఛాంపియన్స్‌ ట్రోఫీ) సాధించింది.Captain Rohit Sharma showing the T20I World Cup Trophy to the fans. 🥶- Goosebumps moment...!!!! [PTI] pic.twitter.com/QfouaYW3Tn— Johns. (@CricCrazyJohns) July 4, 2024కాగా, వరల్డ్‌కప్‌ విజయానంతరం భారత బృందం ఫైనల్‌ మ్యాచ్‌కు వేదిక అయిన బార్బడోస్‌లోనే చిక్కుకుపోయింది. బార్బడోస్‌లో హరికేన్‌ (గాలివాన) బీభత్సం కారణంగా టీమిండియా రెండు రోజుల పాటు అక్కడే ఉండిపోయింది. హరికేన్‌ ప్రభావం కారణంగా బార్బడోస్‌ విమానాశ్రయం మూసివేయడంతో టీమిండియా స్వదేశానికి చేరడం ఆలస్యమైంది.T20I WORLD CUP TROPHY HAS REACHED INDIA AFTER 17 LONG YEARS 🥺 🇮🇳 pic.twitter.com/T8j1HwcP1D— Johns. (@CricCrazyJohns) July 4, 2024ఎట్టకేలకు 100 మందితో కూడిన భారత బృందం ఇవాళ (జులై 4) తెల్లవారుజామున న్యూఢిల్లీలో ల్యాండ్‌ అయ్యింది. ఎయిర్‌ ఇండియా ప్రత్యేక విమానం​ టీమిండియాను ఢిల్లీకి చేర్చింది.మోదీని కలువనున్న భారత బృందంభారత బృందం ఇవాళ ఉదయం న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలువనుంది. ఈ సందర్భంగా మోదీ టీమిండియాను అభినందిస్తారు. మోదీ రెండు బ్యాచ్‌లుగా భారత బృందాన్ని కలుస్తారు. తొలుత ఆటగాళ్లు, ఆతర్వాత సపోర్టింగ్‌ స్టాఫ్‌ మోదీతో ములాఖాత్‌ అవుతారు. ఉదయం 9:30 గంటల​ ప్రాంతంలో భారత బృందం మోదీని కలిసే అవకాశం ఉంది.ముంబై వీధుల్లో విజయోత్సవ యాత్రఅనంతరం టీమిండియా ‍ప్రత్యేక విమానంలో ముంబైకు బయల్దేరుతుంది. సాయంత్రం ముంబై నగర వీధుల్లో టీమిండియా విజయోత్సవ యాత్ర జరుగనుంది. అనంతరం వాంఖడే స్టేడియంలో టీమిండియాకు సన్మాన కార్యక్రమం ఉంటుంది.

Daily Horoscope On July 03, 2024 In Telugu
Today Horoscope: ఈ రాశివారికి ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి

శ్రీక్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, తిథి: బ.త్రయోదశి ఉ.5.38 వరకు, తదుపరి చతుర్దశి, తె.4.25 వరకు(తెల్లవారితే శుక్రవారం), నక్షత్రం: మృగశిర తె.4.20 వరకు(తెల్లవారితే శుక్రవారం), తదుపరి ఆరుద్ర, వర్జ్యం: ఉ.10.00 నుండి 11.33 వరకు, దుర్ముహూర్తం: ఉ.9.54 నుండి 10.46 వరకు, తదుపరి ప.3.07 నుండి 4.00 వరకు, అమృతఘడియలు: రా.7.38 నుండి 9.12 వరకు; రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు, యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు, సూర్యోదయం: 5.33, సూర్యాస్తమయం: 6.35, మాసశివరాత్రి. మేషం...చేపట్టిన పనుల్లో అవాంతరాలు. వృథా ఖర్చులు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. కుటుంబంలో చికాకులు. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.వృషభం...శుభవార్తలు అందుతాయి. కార్యజయం. ఆప్తుల నుంచి సహాయం. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.మిథునం....వ్యయప్రయాసలు. బంధువుల నుంచి ఒత్తిడులు. అనుకున్న పనుల్లో జాప్యం. రాబడికి మించి ఖర్చులు. వృత్తి, వ్యాపారాలలో సమస్యలు.కర్కాటకం....పనులు సకాలంలో పూర్తి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. ఇంటర్వ్యూలు రాగలవు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.సింహం...ఉద్యోగయత్నాలు కొలిక్కి వస్తాయి. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.కన్య....శ్రమ తప్ప ఫలితం ఉండదు. ఆరోగ్యం మందగిస్తుంది. పనుల్లో జాప్యం. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.తుల....కుటుంబసమస్యలు. బంధుమిత్రులతో కలహాలు. రుణాలు చేస్తారు. ప్రయాణాలు ముందుకు సాగవు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో కొద్దిపాటి చికాకులు.వృశ్చికం.....పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. ఆస్తిలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.ధనుస్సు...వ్యవహారాలు సకాలంలో పూర్తి. సంఘంలో ఆదరణ. పాతమిత్రుల కలయిక. వాహన, గృహయోగాలు. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.మకరం...ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. బంధువర్గంతో తగాదాలు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు పనిభారం.కుంభం...వ్యవహారాలలో అవరోధాలు. శ్రమ తప్ప ఫలితం ఉండదు. ప్రయాణాలు వాయిదా. మిత్రులతో మాటపట్టింపులు. వృత్తి, వ్యాపారాలు కాస్త నిరాశ పరుస్తాయి.మీనం.....కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయులు, సోదరుల నుంచి శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.

బుధవారం ఢిల్లీలో మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ, కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్‌రెడ్డి, దీపాదాస్‌మున్షీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన కె. కేశవరావు
ఆషాఢం తర్వాతే..! కేబినెట్‌ విస్తరణ, పీసీసీ, నామినేటెడ్‌ పదవుల భర్తీ

సాక్షి, న్యూఢిల్లీ: సమీకరణలు కుదరలేదు. జిల్లాలు, సామాజిక వర్గాల ప్రాతిపదికపై ఏకాభిప్రాయం వ్యక్తం కాలేదు. దీంతో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్షుడి నియామకం, నామినేటెడ్‌ పదవుల భర్తీ ఆశలపై కాంగ్రెస్‌ అధిష్టానం తాత్కాలికంగా నీళ్లు చల్లింది. ఆయా అంశాలపై మరో వారం, పదిరోజుల తర్వాత తీరిగ్గా చర్చిద్దామంది. అప్పటివరకు వేచి చూడాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సూచించింది. వాస్తవానికి జూలై మొదటి వారంలోనే కీలక పదవుల భర్తీ జరుగుతుందని సీఎం స్వయంగా ప్రకటించారు. ఆ మేరకు ముమ్మర కసరత్తు జరిగినా చివరకు అన్నీ వాయిదా పడ్డాయి. కేబినెట్‌ విస్తరణ సహా పదవుల పంపకాలన్నీ ఆషాఢ మాసం పూర్తయ్యాక ఆగస్టులోనే ఉండే అవకాశం ఉందని ఏఐసీసీ వర్గాలంటున్నాయి. తాజా భేటీలోనూ తేలని సమీకరణలు రాష్ట్ర కేబినెట్‌లో ఖాళీలు పూరించడం, కొత్త పీసీసీ అధ్యక్షుడి ఎంపిక, నామినేటెడ్‌ పదవుల భర్తీపై గడిచిన వారం, పది రోజులుగా ముమ్మర కసరత్తు జరుగుతున్న విషయం తెలిసిందే. సీఎం రేవంత్‌రెడ్డి వారం కిందట కూడా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో ఈ అంశాలపై చర్చలు జరిపారు. అధిష్టానం సైతం ఈ విషయమై రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీనియర్‌ మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిల అభిప్రాయాన్ని తీసుకుంది. తాజాగా బుధవారం కూడా ఈ అంశాలపై చర్చించేందుకు ఢిల్లీ వచ్చిన రేవంత్‌రెడ్డి మరోమారు ఖర్గే, ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌గాం«దీ, కేసీలతో భేటీ అయ్యారు. సుమారు గంట పాటు చర్చలు కొనసాగాయి. మంత్రివర్గంలోకి తీసుకునేందుకు పరిగణనలోకి తీసుకుంటున్నవారి పేర్లను మరోమారు పరిశీలించారు. ఇందులో మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి వాకిటి శ్రీహరి, నిజామాబాద్‌ జిల్లా నుంచి పి.సుదర్శన్‌రెడ్డి, నల్లగొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, బాలూనాయక్, రంగారెడ్డి జిల్లా నుంచి మల్‌రెడ్డి రంగారెడ్డి, టి.రామ్మోహన్‌ రెడ్డి, ఆదిలాబాద్‌ జిల్లా నుంచి ప్రేంసాగర్‌రావు, వివేక్‌ల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ఇందులో వాకిటి శ్రీహరి పేరుపై ఏకాభిప్రాయం ఉన్నప్పటికీ మిగతా పేర్ల విషయంలో పీఠముడి నెలకొంది. ఇలాగైతే ఏం చేయాలి..? నిజామాబాద్‌ జిల్లా నుంచి పీసీసీ అధ్యక్ష రేసులో మహేశ్‌కుమార్‌ గౌడ్, గతంలో నిజామాబాద్‌ నుంచి ఎంపీగా ఉన్న మధుయాష్కీ గౌడ్‌లు ఉన్న దృష్ట్యా, ఒకవేళ వీరిలో ఒకరికి ఆ పదవి కట్టబెడితే, అదే జిల్లా నుంచి మంత్రి పదవి ఆశిస్తున్న సుదర్శన్‌రెడ్డిని ఏమి చేయాలన్న దానిపై సందిగ్ధత నెలకొంది. దీనిపై నేతలు తర్జనభర్జన పడుతున్నారు. ఇక నల్లగొండ జిల్లాలో రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి ఇస్తే, ఇదే జిల్లా నుంచి ఇప్పటికే ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలతో కలిపి మొత్తం ముగ్గురు రెడ్లు మంత్రులవుతారు. ఒకవేళ ఆ అంశాన్ని పక్కన పెట్టినా, జిల్లా నుంచి ఎస్టీ ఎమ్మెల్యేగా ఉన్న బాలూనాయక్‌కు మంత్రి పదవి ఇవ్వడం కష్టంగా మారుతుంది. ఇక ఆదిలాబాద్‌ జిల్లా నుంచి ఇద్దరు సీనియర్‌ నేతలు జి.వివేక్, ప్రేంసాగర్‌ రావుల విషయంలోనూ సందిగ్ధత నెలకొంది. భట్టి సహా ఇతర నేతలు మద్దతిస్తున్న వెలమ సామాజిక వర్గానికి చెందిన ప్రేంసాగర్‌ను కేబినెట్‌లోకి తీసుకుంటే ఓసీ సామాజికవర్గం నుంచి మంత్రుల సంఖ్య పెరుగుతుంది. ఇక గ్రేటర్‌ హైదరాబాద్‌ నుంచి మల్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి రేసులో ఉండగా, ఇక్కడ ఒక మైనార్టీకి అవకాశం కల్పించాలనే డిమాండ్‌ కూడా గట్టిగా ఉంది. దీంతో వీరి విషయంలోనూ నిర్ణయానికి రాలేకపోయారు. ఇలా పలు పేర్ల విషయంలో పలు సమీకరణాలు ముడిపడి ఉండటంతో నేతలు ఒక నిశి్చతాభిప్రాయానికి రాలేకపోయారు. ఈ దృష్ట్యానే కేబినెట్‌ విస్తరణ అంశాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టాలని, వారం, పదిరోజుల తర్వాత దీనిపై చర్చిద్దామని హైకమాండ్‌ పెద్దలు ముఖ్యమంత్రికి చెప్పినట్లుగా కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. పీసీసీ సైతం వాయిదానే.. బుధవారం నాటి భేటీలో పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై కూడా చర్చించినా, దీన్ని సైతం అధిష్టానం పెద్దలు తేల్చలేకపోయారు. అధ్యక్ష పదవిని బీసీ సామాజిక వరాŠిగ్నకి చెందిన సీనియర్‌ నేతలు మహేశ్, మధుయాష్కీలలో ఒకరికి కట్టబెట్టాలనే ఆలోచన చేసిప్పటికీ సమీకరణలు కుదరని దృష్ట్యా, ఎస్సీ సామాజిక వర్గం నుంచి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, సంపత్‌కుమార్, ఎస్టీ సామాజిక వర్గం నుంచి బలరాం నాయక్‌ల పేర్లు కూడా మరోమారు చర్చకు వచ్చినట్లు తెలిసింది. దీంతో జిల్లాలు, సామాజిక వర్గాల సమీకరణలు, మంత్రివర్గ విస్తరణ తేలిన తర్వాతే దీనిపై నిర్ణయం తీసుకోవాలని అధిష్టానం భావించినట్లు తెలిసింది. ఇక కేబినెట్‌ విస్తరణ, పీసీసీ అధ్యక్షుడి నియామకం పూర్తయ్యాకే ఇతర పదవుల భరీŠత్‌ అంశంపై హైకమాండ్‌ దృష్టి పెట్టే అవకాశం ఉందని ఏఐసీసీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. కాంగ్రెస్‌ గూటికి కేకే – పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన మల్లికార్జున ఖర్గే – కేకే అనుభవం కాంగ్రెస్‌ను బలోపేతం చేస్తుందని వ్యాఖ్య సాక్షి, న్యూఢిల్లీ: బీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు కాంగ్రెస్‌ గూటికి చేరారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బుధవారం కేకేకు కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ లోక్‌సభా పక్ష నేత రాహుల్‌గాందీ, రా్ర‹Ù్టర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీ, సీఎం రేవంత్‌రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేకే రాకను స్వాగతించిన ఖర్గే, రాహుల్‌.. రాష్ట్రంలో పార్టీ పటిష్టతకు పని చేయాలని సూచించారు. కాంగ్రెస్‌లో చేరికతో తిరిగి సొంత ఇంటికి వచ్చినట్లుగా ఉందని కేకే వ్యాఖ్యానించారు. ఈ భేటీ అనంతరం కేకే రాకను స్వాగతిస్తూ ఖర్గే ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. కేకే అనుభవం పార్టీని బలోపేతం చేసేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు.

UK general elections 2024: Rishi Sunak, other PIOs at risk of losing their seats in UK
UK general elections: ముందస్తు ఓటమే?!

సవాలక్ష సమస్యలతో సతమతమవుతున్న బ్రిటన్‌లో సార్వత్రిక ఎన్నికలకు వేళైంది. హోరాహోరీ ప్రచారానికి బుధవారం సాయంత్రంతో తెర పడింది. పార్లమెంటు దిగువ సభ అయిన హౌజ్‌ ఆఫ్‌ కామన్స్‌లోని 650 స్థానాలకు గురువారం దేశవ్యాప్తంగా పోలింగ్‌ జరగనుంది. సాయంత్రం నుంచే ఫలితాల వెల్లడి మొదలవుతుంది. శుక్రవారం ఉదయానికల్లా పూర్తి ఫలితాలు వెలువడతాయి. కొత్త సభ జూలై 9న కొలువుదీరుతుంది. స్పీకర్‌ ఎన్నిక, సభ్యుల ప్రమాణ స్వీకారాల తర్వాత నూతన ప్రభుత్వం బాధ్యతలు స్వీకరిస్తుంది. విపక్ష నేత స్టార్మర్‌ నేతృత్వంలోని లేబర్‌ పార్టీ భారీ మెజారిటీతో 14 ఏళ్ల అనంతరం గద్దెనెక్కడం ఖాయమని ఒపీనియన్‌ పోల్స్‌ చెబుతున్నాయి. భారత మూలాలున్న ప్రధాని రిషి సునాక్‌ సారథ్యంలోని అధికార కన్జర్వేటివ్‌ పార్టీ ఎదురీదుతోందని అప్పటికే స్పష్టం చేశాయి. సునాక్‌ కూడా బుధవారం ప్రచారాన్ని ముగిస్తూ, ‘లేబర్‌ పార్టీకి ఘనవిజయం దక్కకుండా అడ్డుకుందాం’ అని ప్రజలతో పాటు సొంత పార్టీ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. నిజానికి ఎన్నికలు డిసెంబర్‌లో జరగాల్సి ఉన్నా ప్రజల్లో తీవ్రంగా ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతను ముందే పసిగట్టి సునాక్‌ ముందస్తుకు వెళ్లారు. కానీ అది కూడా కలిసొచ్చేలా కని్పంచడం లేదు... బరిలో భారతీయం బ్రిటన్‌ ఎన్నికల బరిలో భారతీయుల జోరు పెరుగుతోంది. 2019లో 63 మంది బ్రిటిష్‌ఇండియన్లు పోటీ చేయగా 15 మంది విజయం సాధించారు. ఈసారి ఏకంగా 107 మంది బరిలో దిగుతుండటం విశేషం. ప్రధాన పార్టీలైన కన్జర్వేటివ్, లేబర్‌తో పాటు రిఫామ్‌ యూకే వంటి కొత్త పారీ్టల నుంచి కూడా ఇండియన్లు పోటీలో ఉన్నారు. పలు స్థానాల్లో బ్రిటిష్‌ ఇండియన్లే ప్రత్యర్థులుగా తలపడుతుండటం మరో విశేషం. హారో ఈస్ట్‌ స్థానం నుంచి ప్రిమేశ్‌ పటేల్‌ (లేబర్‌), రీతేంద్రనాథ్‌ బెనర్జీ (లిబరల్‌ డెమొక్రాట్స్‌), సారాజుల్హగ్‌ పర్వానీ (వర్కర్స్‌ పార్టీ ఆఫ్‌ బ్రిటన్‌) బరిలో ఉన్నారు. లీసెస్టర్‌ ఈస్ట్‌లో లండన్‌ మాజీ డిప్యూటీ మేయర్‌ రాజేశ్‌ అగర్వాల్‌ (లేబర్‌), శివానీ రాజా (కన్జర్వేటివ్‌) పోటీ చేస్తున్నారు. 37.3 లక్షల బ్రిటిష్‌ ఇండియన్లు బ్రిటన్‌లో భారత మూలాలున్న వారి సంఖ్య ఏకంగా 37.3 లక్షలు దాటేసింది! ఓటర్లలోనూ వారు 10 లక్షల మందికి పైగా ఉన్నట్టు సమాచారం. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ మూలాలున్న వారు కూడా భారీగానే ఉన్నారు. దాంతో వారిని ఆకట్టుకోవడానికి పారీ్టలన్నీ శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. లేబర్‌ పార్టీ నేత స్టార్మర్‌ ఇటీవల బ్రిటిష్‌ బంగ్లాదేశీలపై చేసిన అనుచిత వ్యాఖ్యలు, గాజా దుస్థితిపై ఆ పార్టీ వైఖరి కారణంగా ముస్లిం ఓటర్లు గుర్రుగా ఉన్నారు. దీన్ని వీలైనంతగా సొమ్ము చేసుకునేందుకు కన్జర్వేటివ్‌ నేతలు ప్రయతి్నస్తున్నారు. కన్జర్వేటివ్‌: ఏడుగురు సిట్టింగ్‌ ఎంపీలతో పాటు 23 మంది బ్రిటిష్‌ ఇండియన్లకు కొత్తగా టికెట్లిచ్చింది. వీరిలో ప్రధాని రిషి సునాక్, మాజీ మంత్రులు ప్రీతీ పటేల్, సుయెల్లా బ్రేవర్మన్‌తో పాటు చంద్ర కన్నెగంటి, నీల్‌ శాస్త్రి హర్‌స్సŠట్, నీల్‌ మహాపాత్ర, రేవ గుడి, నుపుర్‌ మజుందార్, ఎరిక్‌ సుకుమారన్‌ తదితరులున్నారు. లేబర్‌: ఏడుగురు సిట్టింగ్‌ ఎంపీలు కాగా 26 మంది కొత్తవారు. వీరిలో ఉదయ్‌ నాగరాజు, హజీరా ఫరానీ, రాజేశ్‌ అగర్వాల్, జీవన్‌ సంధెర్‌ తదితరులున్నారు.ఒపీనియన్‌ పోల్స్‌ ఏం చెబుతున్నాయ్‌.. లేబర్‌ పారీ్టకి కనీసం 41 శాతం ఓట్లు ఖాయమని అత్యధిక ఒపీనియన్‌ పోల్స్‌ అంచనా వేస్తున్నాయి. అధికార కన్జర్వేటివ్‌ పార్టీకి 21 శాతానికి మించబోవని అవి జోస్యం చెప్పాయి. రిఫామ్‌ పారీ్టకి 16 శాతం, లిబరల్‌ డెమొక్రాట్లకు 12 శాతం రావచ్చని పేర్కొన్నాయి. అవే నిజమైతే లేబర్‌ పార్టీ ఘనవిజయం సాధించడం ఖాయమే. సునాక్‌ ఎదురీత వెనక... 44 ఏళ్ల రిషి 2022 అక్టోబర్‌ 25న బ్రిటన్‌ ప్రధాని అయ్యారు. ఆ పదవి చేపట్టిన తొలి భారత మూలాలున్న వ్యక్తిగానే గాక తొలి హిందువుగా కూడా రికార్డు సృష్టించారు. కానీ వాగ్దానాలను నిలుపుకోవడంలో ఆయన విఫలమయ్యారన్న అసంతృప్తి ప్రజల్లో తీవ్రంగా ఉంది. ఆర్థిక సంక్షోభం కొన్నేళ్లుగా బ్రిటన్‌కు చుక్కలు చూపుతోంది. ముఖ్యంగా నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నాయి. ఆర్థిక నిపుణుడై ఉండి కూడా పరిస్థితిని రిషి చక్కదిద్దలేదన్నది బ్రిటన్‌వాసుల ఫిర్యాదు. ప్రధానమైన హౌజింగ్‌ సంక్షోభాన్ని చక్కదిద్దడంలోనూ ఆయన విఫలమయ్యారని వారు భావిస్తున్నారు. దాంతో ఆర్థిక వ్యవస్థను పటిష్టపరుస్తామన్న తాజా హామీలను ఎవరూ నమ్మడం లేదు. యూగవ్‌ తాజా సర్వేలో 52 శాతం మంది ఆర్థిక సమస్యలనే ప్రముఖంగా ప్రస్తావించారు. ఆరోగ్య సమస్యలు తమను బాగా కుంగదీస్తున్నట్టు 50 శాతం చెప్పారు. కీలకమైన వలసదారులు, వారికి ఆశ్రయం విషయంలో కన్జర్వేటివ్‌ పార్టీ వైఖరిని 40 శాతం మంది తప్పుబడుతున్నారు. ఎలా చూసినా సునాక్‌ పాలనకు 20 నెలలకే తెర పడటం ఖాయమన్న అభిప్రాయం సర్వత్రా విని్పస్తోంది.స్టార్మర్‌కు కలిసొచ్చిన అంశాలు... ప్రధానంగా 14 ఏళ్ల కన్జర్వేటివ్‌ పార్టీ పాలనపై ప్రజల్లో నెలకొన్న తీవ్ర వ్యతిరేకతే విపక్ష లేబర్‌ పారీ్టకి ఈసారి అతి పెద్ద సానుకూలాంశంగా మారింది. ఆ పార్టీ నాయకుడు స్టార్మర్‌ (61) ‘పార్టీ కంటే దేశం ముందు’ నినాదంతో దూసుకెళ్లారు. ఆ నినాదం బ్రిటన్‌వాసులను విపరీతంగా ఆకట్టుకుంది. లేబర్‌ పార్టీకి ఓటేస్తే ఆర్థిక స్థిరత్వానికి వేసినట్టేనన్న ఆయన ప్రచారానికి విశేష స్పందన లభించింది. నిరుపేద కారి్మక కుటుంబం నుంచి వచి్చన తనకు సామాన్యుల కష్టనష్టాలు బాగా తెలుసునని, ధరాభారాన్ని తగ్గించి తీరతానని, సుపరిపాలన అంటే ఎలా ఉంటుందో చూపిస్తానని హామీలిచి్చన స్టార్మర్‌ వైపు ప్రజలు స్పష్టమైన మొగ్గు చూపుతున్నారు. – సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Another diaphragm wall has to be built
మరో డయాఫ్రమ్‌ వాల్‌ కట్టాల్సిందే

సాక్షి, అమరావతి/పోలవరం రూరల్‌: పోలవరం ప్రాజెక్టు ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ (ఈసీఆర్‌ఎఫ్‌) డ్యామ్‌ గ్యాప్‌–2లో గోదవరి వరదల ఉధృతికి దెబ్బతిన్న డయాఫ్రమ్‌ వాల్‌కు సమాంతరంగా కొత్త డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మించాలని అంతర్జాతీయ నిపుణుల బృందం కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ)కి సూచించింది. ప్రస్తుతం ఉన్న డయాఫ్రమ్‌ వాల్‌కు మరమ్మతులు చేసినా, దెబ్బతిన్న ప్రాంతాల్లో ‘యూ’ ఆకారంలో నిర్మించి అనుసంధానం చేసినా పూర్తి సామర్థ్యం మేరకు పనిచేస్తుందని చెప్పలేమని తేల్చిచెప్పింది. ఇప్పటికే గోదావరి వరదలను మళ్లించేలా స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్‌తోపాటు ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లను ప్రభుత్వం పూర్తి చేసినందున కొత్త డయాఫ్రమ్‌ వాల్‌ను సులభంగా నిర్మించవచ్చని నిపుణుల బృందం అభిప్రాయపడింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) నియమించిన యూఎస్‌ఏకు చెందిన డేవిడ్‌ బి.పాల్, గియాస్‌ ఫ్రాంకో డి సిస్కో, కెనడాకు చెందిన రిచర్డ్‌ డొన్నెళ్లీ, సీస్‌ హించ్‌బెర్గర్, కాంట్రాక్టు సంస్థ మేఘా నియమించిన అంతర్జాతీయ కన్సల్టెంట్‌ యాఫ్రి సంస్థ (స్వీడన్‌) ప్రతినిధులు నాలుగు రోజులపాటు ప్రాజెక్టును పరిశీలించి, అధికారులతో సమీక్షించారు. బుధవారం మరోసారి సమీక్షించిన అనంతరం నిపుణుల బృందంతో సీడబ్ల్యూసీ చైర్మన్‌ వోరా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశమయ్యారు. గతంలో వరదను మళ్లించేలా స్పిల్‌ వే పూర్తి చేయకుండా, ఎగువ కాఫర్‌ డ్యామ్‌ను చేపట్టి ఇరు వైపులా ఖాళీ వదిలేయడం వల్లే వరద ఉద్ధృతి మరింత పెరిగి డయాఫ్రమ్‌ వాల్‌ దెబ్బతిందని అంతర్జాతీయ నిపుణులు సీడబ్ల్యూసీ చైర్మన్‌కు తేల్చి చెప్పారు. గ్యాప్‌–2లో 1396 మీటర్ల పొడవున డయాఫ్రమ్‌ వాల్‌ నాలుగు చోట్ల కోతకు గురై 485 మీటర్ల మేర దెబ్బతిందని నేషనల్‌ హైడ్రోపవర్‌ కార్పొరేషన్‌ (ఎన్‌హెచ్‌పీసీ) ఇచ్చిన నివేదికతో ఈ బృందం ఏకీభవించింది. ప్రాజెక్టు భద్రత దృష్ట్యా డయాఫ్రమ్‌ వాల్‌కు సమాంతరంగా కొత్తది నిర్మించడం శ్రేయస్కరమని సూచించింది.జెట్‌ గ్రౌటింగ్‌లో లోపం వల్లే లీకేజీలుఎగువ కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణానికి ముందు జెట్‌ గ్రౌటింగ్‌ చేసేటప్పుడు ఆ ప్రదేశంలో ఇసుక సాంద్రతను తప్పుగా అంచనా వేశారని ఈ బృందం తెలిపింది. అందువల్లే తక్కువ లోతు నుంచి స్టోన్‌ కాలమ్స్‌ వేసి, జెట్‌ గ్రౌటింగ్‌ చేశారని, దీనివల్లే లీకేజీలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. లీకేజీలకు కారణాలు కనుక్కోవడానికి కాఫర్‌ డ్యామ్‌ పైనుంచి 100 నుంచి 150 మీటర్లకు ఒక చోట మొత్తం 17 చోట్ల బోర్‌ హోల్స్‌ వేసి పరీక్షలు చేయాలని సూచించామని తెలిపింది. యాఫ్రి సంస్థ ఇప్పటికే నాలుగు చోట్ల పరీక్షలు చేసిందని వివరించింది. ఆ పరీక్షల ఫలితాలను విశ్లేషిస్తే.. లీకేజీలను పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేయలేమని, కొంతవరకు అడ్డుకోవచ్చని అభిప్రాయపడింది. కొంతవరకు లీకేజీలు ఉన్నప్పటికీ కొత్త డయాఫ్రమ్‌వాల్‌ నిర్మాణానికి, ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ పనులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని వివరించింది.ముగిసిన అంతర్జాతీయ నిపుణుల పర్యటనఅంతర్జాతీయ నిపుణుల నాలుగు రోజు­ల పోలవరం పర్యటన బుధవారం ముగిసింది. వారు బుధవారం విజయవాడ చేరుకున్నారు. గురువారం ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీకి చేరుకుని, అక్కడి నుంచి వారి దేశాలకు వెళ్తారు. రెండు వారాల్లో మధ్యంతర నివేదికపోలవరం ప్రాజెక్టు పరిశీలన, అధికారు­లతో సమీక్షలో వెల్లడైన అంశాల ఆధారంగా సవాళ్లను అధిగమించడం, నిర్మాణాల డిజైన్లపై రెండు వారాల్లోగా మధ్యంతర నివేదిక ఇస్తా­మని నిపుణుల బృందం తెలిపింది. ఆ నివేదిక ఆధారంగా కాంట్రాక్టు సంస్థ అంతర్జాతీయ కన్సల్టెంట్‌ యాఫ్రి సంస్థ సవాళ్లను అధిగమించడానికి చేపట్టాల్సిన నిర్మాణాల డిజైన్లను రూపొందించి తమకు పంపితే.. తాము పరిశీలించి మార్పులుంటే సూచిస్తామని చెప్పింది. యాఫ్రి, తాము ఏకాభిప్రాయంతో నిర్ణయించిన డిజైన్‌ను సీడబ్ల్యూసీకి పంపుతామని తెలిపింది. ఆ డిజైన్‌ను సీడబ్ల్యూసీ క్షుణ్ణంగా పరిశీలించి, ఆమోదించాకే దాని ప్రకారం పనులు చేపట్టాలని సూచించింది. ఇందుకు సీడబ్ల్యూసీ చైర్మన్‌ వోరా అంగీకరించారు. నిపుణల బృందం మధ్యంతర నివేదిక ఇచ్చాక ఢిల్లీలో మరోసారి రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు, కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు, అంతర్జాతీయ నిపుణులతో సమావేశం నిర్వహిస్తామని వోరా చెప్పారు.

Prabhas All Time Records Created With Kalki 2898 AD
ఆ స్టార్‌ హీరోల ఆల్‌టైమ్‌ రికార్డ్స్‌ను కొట్టేసిన ప్రభాస్‌

ప్రభాస్‌ నటించిన భారీ బడ్జెట్‌ చిత్రం 'కల్కి 2898 ఏడీ'. ‍అంచనాలకు మించి బాక్సాఫీస్‌ వద్ద కల్కి దూసుకుపోతుంది. తొలిరోజు ఏకంగా రూ.191.5 కోట్లు రాబట్టి రికార్డ్‌ క్రియేట్‌ చేసిన కల్కి ఆ తర్వాతి రోజుల్లో కూడా కలెక్షన్ల సునామీ క్రియేట్‌ చేసింది. ఆరు రోజుల్లో రూ. 700 కోట్లు రాబట్టిన కల్కి ఈ ఏడాదిలో అత్యధిక కలెక్షన్స్‌ సాధించిన భారత చిత్రాల్లో ప్రథమ స్థానంలో ఉంది.వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై నాగ్‌ అశ్విన్‌ కల్కి చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రభాస్‌ కల్కి చిత్రం ఇప్పటికే పలు రికార్డ్స్‌ను బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. తాజాగా రజనీకాంత్‌, దళపతి విజయ్‌ల ఆల్‌టైమ్‌ రికార్డులను కల్కి బ్రేక్‌ చేసింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్స్‌ సాధించిన టాప్‌ 15 ఇండియన్‌ సినిమాల జాబితాలో కల్కి చేరిపోయింది.రజనీకాంత్‌ హిట్‌ సినిమా జైలర్‌ లాంగ్‌ రన్‌లో రూ.650 కోట్లు రాబట్టితే.. విజయ్‌ నటించిన లియో మాత్రం రూ. 600 కోట్లు రాబట్టింది. ఇద్దరు సౌత్‌ ఇండియన్‌ టాప్‌ హీరోలకు చెందిన ఆల్‌టైమ్‌ రికార్డ్స్‌ను ప్రభాస్‌ కేవలం ఆరు రోజుల్లోనే దాటేశాడు. బాక్సాఫీస్‌ వద్ద ఇంకా ఈ కలెక్షన్ల జోరు కొనసాగుతూనే ఉంది. ఈ ఏడాదిలో విడుదలైన చిత్రాల్లో కలెక్షన్స్‌ పరంగా కల్కి ప్రథమ స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా 'హనుమాన్‌' రూ.350 కోట్లు, 'ఫైటర్‌' రూ. 327 కోట్లు, 'మంజుమ్మెల్ బాయ్స్ రూ. 242 కోట్లు, 'సైథాన్‌' రూ. 211 కోట్లు సాధించిన చిత్రాలు ఉన్నాయి.దర్శకుడు నాగ్ అశ్విన్ ఫ్యూచరిస్టిక్ ఇండియన్ సినిమాగా కల్కిని రూపొందించాడు. ప్రభాస్, దీపికా పదుకొణె,శోభన, దిశా పటానీ, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి స్టార్స్‌ కల్కి మూవీలో నటించి మెప్పించారు. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమా జూన్ 27న విడుదలైంది. ఇప్పటికే సినిమా చూసిన ప్రేక్షకులు ఆ విజువల్‌ వండర్‌ ప్రపంచాన్ని మరిచిపోలేకపోతున్నారు. అందుకే కల్కి చిత్రాన్ని రెండోసారి కూడా చూసేందుకు వెళ్తున్నారు.

శ్రీసత్యసాయి జిల్లా కలెక్టరేట్‌ వద్ద బైఠాయించిన రామగిరి మండలం ఎంసీపల్లి  పెన్షన్‌దారులు
పింఛన్లకు ‘అధికార’ గ్రహణం

బత్తలపల్లి/గాండ్లపెంట/పుట్టపర్తి అర్బన్‌/కోటనందూరు: రాష్ట్రంలో పెన్షన్లకు ‘అధికార’ గ్రహణం పట్టింది. టీడీపీ నేతలు పలువురికి పెన్షన్లు ఇవ్వకుండా అధికారుల్ని అడ్డుకుంటున్నారు. వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులని చెప్పి అధికారులపై తీవ్ర ఒత్తిడి తెచ్చి అర్హులకు కూడా పింఛన్‌ నగదు అందకుండా చేస్తున్నారు. ఏళ్ల తరబడి వస్తున్న పింఛన్‌ను ఇప్పుడు ఇవ్వకపోవడంతో బాధితులు నిరసన తెలుపుతున్నారు. శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం మాల్యవంతం పంచాయతీ పరిధిలో 40 మందికి పింఛన్‌ ఇవ్వకుండా టీడీపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో వారు బుధవారం వైఎస్సార్‌సీపీ నాయకులతో కలసి ఎంపీడీవో కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఎంపీడీవో శివనాగప్రసాద్‌ వారితో చర్చించారు. పంచాయతీ కార్యదర్శి గంగరత్న, వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ ఫ్రాన్సిస్‌ను ఆరాతీశారు. అందరికీ పింఛన్లు ఇవ్వాలని తాము భావించామని, అయితే టీడీపీ నాయకులు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని వారు వాపోయారు. ప్రస్తుతానికి సైట్‌ క్లోజ్‌ అయిందని, వచ్చేనెల రెండునెలల పింఛన్‌ మొత్తాన్ని ఇస్తామని చెప్పారు. అప్పుడు కూడా ఇస్తారన్న గ్యారెంటీ ఏమిటని వైఎస్సార్‌సీపీ నాయకులు నిలదీశారు. తామేమీ చేయలేమని అధికారులు చేతులెత్తేశారు. దీంతో కలెక్టర్‌ను కలవాలని బాధితులు నిర్ణయించుకున్నారు. ⇒ గాండ్లపెంట మండలం ఎలుగూటివారిపల్లిలో దివ్యాంగులైన నలుగురు లబ్ధిదారులకు పింఛన్‌ మంజూరైనా అధికారులు పంపిణీ చేయలేదు. దీంతో బాధితులు కె.రమాదేవి, ఎం.నారాయణరెడ్డి, ఎం.లక్ష్మీదేవి, బి.లక్ష్మీదేవి బుధవారం ఎంపీడీవో రామానాయక్‌కు ఫిర్యాదు చేయాలని కార్యాలయానికి ఎంపీడీవో లేకపోవడంతో నిరసన వ్యక్తం చేశారు. 20 సంవత్సరాలుగా తీసుకుంటున్న పింఛన్‌ను ఇప్పుడు నిలిపేశారని, దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని వారు చెప్పారు. ⇒ స్థానిక టీడీపీ నాయకులను కలిసి వస్తేనే పింఛన్‌ ఇస్తామంటూ మూడురోజుల నుంచి తిప్పుకొన్న సచివాలయ సిబ్బంది చివరకు సైట్‌ క్లోజ్‌ అయిందంటూ పింఛన్‌ సొమ్ము ఎగ్గొట్టారని రామగిరి మండలం ఎంసీపల్లి 1, 2 సచివాలయాలకు చెందిన పెన్షన్‌దారులు బుధవారం పుట్టపర్తిలోని శ్రీసత్యసాయి జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్ద బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గతంలో ఏ రోజూ ఇలా జరగలేదని, వలంటీర్లు ఇంటికే వచ్చి పింఛన్‌ మొత్తాన్ని ఇచ్చేవారని చెప్పారు. ప్రభుత్వం మారగానే పింఛన్‌ ఎగ్గొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టరేట్‌ సిబ్బంది సూచన మేరకు వారు డీఆర్‌డీఏ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ పీడీ నరసయ్య లేకపోవడంతో అధికారి శివమ్మ వద్ద గోడు వెళ్లబోసుకుని వినతిపత్రం ఇచ్చారు. దీనిపై డీఆర్‌డీఏ పీడీ నరసయ్యను వివరణ కోరగా .. ఈ విషయాన్ని పరిశీలించాలని రామగిరి ఎంపీడీవోని ఆదేశించామని, వివరాలు తెలుసుకుని చర్యలు తీసుకుంటామని చెప్పారు. ⇒ కాకినాడ జిల్లా కోటనందూరు మండలం ఎల్డీపేటలో 18 మంది పింఛనుదారులకు అధికారులు పింఛన్‌ నిలిపేశారు. సోమ, మంగళవారాల్లో లబ్ధిదారుల ఇంటికి తెచ్చి ఇవ్వాల్సిన పింఛన్‌ ఇవ్వకపోగా సచివాలయానికి వెళ్లినా పట్టించుకోలేదు. మంగళవారం రాత్రి ఏడుగంటల వరకు సచివాలయంలోనే ఉన్నామని, ఎందుకు ఆపేశారని అడిగినా అధికారులు సమాధానం చెప్పలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. వారు సమస్యను బుధవారం ఎంపీపీ లగుడు శ్రీనివాసుకి వివరించారు. పింఛన్లు ఇప్పించాలని కోరుతూ ఎంపీపీ ఆధ్వర్యంలో ఎంపీడీవో జయమాధవికి వినతిపత్రమిచ్చారు. దీనిపై ఎంపీడీవో జయమాధవిని వివరణ అడగగా.. నిబంధనలకు విరుద్ధంగా పింఛన్లు తీసుకుంటున్నారని 18 మందిపై ఫిర్యాదు అందడంతో వారికి పింఛన్లు ఆపేశామన్నారు. విచారించి వారు అర్హులైతే వచ్చేనెల నుంచి ఇస్తామని చెప్పారు. ఇంత దారుణం ఎన్నడూ చూడలేదు ఇంత దారుణం నా జీవితంలో ఎన్నడూ చూడలేదు. గత ప్రభుత్వంలో ఒక్కనెల కూడా ఇలా ఇబ్బంది పెట్టలేదు. కలెక్టర్‌ స్పందించి మా సమస్యను పరిష్కరించాలి. - సిద్ధయ్య, ఎంసీపల్లి, రామగిరి మండలం అప్పుడు ఎవరికీ తొలగించలేదు జగన్‌ సీఎంగా ఉన్నప్పుడు ఏ ఒక్కరికీ పెన్షన్‌ తొలగించలేదు. ఒకవేళ మా నాయకులు తప్పుచేస్తే నాకు చెప్పండి లేదా కోర్టుకు వెళ్లండని చెప్పిన గొప్ప నాయకుడు. అర్హులు ఎంతమంది ఉంటే అంతమందికి పింఛన్‌ ఇచ్చారు. ఇప్పుడు మాత్రం టీడీపీ వాళ్లు అందుకు భిన్నంగా చేస్తున్నారు. - నరసింహారెడ్డి, ఎంసీపల్లి, రామగిరి మండలం సుగాలీలకు ఇంత అన్యాయం చేస్తారా? నా కుమార్తె నందివర్ధినీబాయికి తలసేమియా పెన్షన్‌ వస్తోంది. పాపను ఎత్తుకుని నా భార్య మూడురోజుల పాటు సచివాలయం చుట్టూ తిరిగింది. టీడీపీ వాళ్లను కలిసి ఫోన్‌చేయిస్తే ఇస్తామని చెప్పారు. లోకల్‌ లీడర్ల ప్రెజర్‌ ఉందని, వాళ్లను కలవాలని సెక్రటరీ, ఎంపీడీవో చెప్పడం అన్యాయం. సుగాలీలకు ఇంత అన్యాయం చేస్తారా? గతంలో సుగాలీల గురించి మాట్లాడిన పవన్‌ ఇప్పుడు స్పందించి నందివర్ధినీబాయికి బాసటగా నిలవాలి. - ముత్యాలనాయక్, ఆర్‌.కొత్తపల్లి, రామగిరి మండలం

Prepare For BS7 Emission Norms Says Nitin Gadkari
ప్రకటన కోసం వేచి చూడకండి.. 2027 నాటికి బిఎస్7: నితిన్ గడ్కరీ

రోజురోజుకు ఆటోమొబైల్ మార్కెట్లో కీలక మార్పులు సంభవిస్తున్నాయి. ఇప్పటికే బిఎస్4 పోయి బిఎస్6 ప్రమాణాలు వచ్చాయి. రాబోయే రోజుల్లో ఆటోమొబైల్ పరిశ్రమ బిఎస్7 ఉద్గార నిబంధనలకు సిద్ధంగా ఉండాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. దీని గురించి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించే వరకు వేచి ఉండకూడదని అన్నారు.బీఎస్7 వాహనాల తయారీకి సంబంధించి సన్నాహాలు తప్పకుండా వేగవంతం చేయాలని గడ్కరీ అన్నారు. యూరోపియన్ మార్కెట్లో యూరో 7 ప్రమాణాలు 2025 నుంచి అమలులోకి రానున్నాయి. కాబట్టి భారతదేశంలో తయారయ్యే కార్లు కూడా వాటికి ధీటుగా ఉండాలని, దీనికోసం తప్పకుండా బిఎస్7 రూల్స్ పాటించాలని అన్నారు. 2027 నుంచి ఈ నిబంధనలు అమలులోకి రానున్నట్లు పేర్కొన్నారు.వాహన తయారీ సంస్థలు తమ వాహనాలలోని ఇంజిన్‌లను రీట్యూన్ చేయాల్సి ఉంటుంది. ఇవి యూరో7 ప్రమాణాలను దాదాపు సమానంగా ఉంటాయి. కాబట్టి గ్లోబల్ మార్కెట్లో దేశీయ ఆటోమొబైల్ మార్కెట్ హవా దూసుకెళ్తుంది. బిఎస్7 రూల్స్ అన్నీ కూడా బిఎస్6 కంటే మరింత కఠినంగా ఉంటాయని గడ్కరీ పేర్కొన్నారు.బిఎస్7 ప్రమాణాలతో వాహనాలు తయారైన తరువాత వెహికల్స్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇంజిన్‌లను రీచున్ చేసినప్పుడు సంస్థలు కూడా కొంతమొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. కాబట్టి రాబోయే రోజుల్లో పెట్రోల్ వాహనాల ధరలతో పోలిస్తే.. డీజిల్ వాహనాల ధరలు పెరిగే సూచలను ఉన్నాయి. మార్కెట్లో డీజిల్ వాహనాల డిమాండ్ తగ్గిదే.. భవిష్యత్తులో ఈ వాహనాలు కనుమరుగయ్యే అవకాశాలు ఉన్నాయి.

T20 World Champion India will reach home today
జగజ్జేతల ఆగమనం

ఇక్కడేమో అభిమానులు... అక్కడేమో ప్రపంచకప్‌ గెలిచిన క్రికెటర్లు... ఎన్నాళ్లీ నిరీక్షణ, ఎందుకీ పరీక్ష అని చూసే ఎదురుచూపులకు నేడు తెర పడనుంది. ప్రతికూల వాతావరణంతో బార్బడోస్‌లోనే ఇరుక్కుపోయిన టి20 వరల్డ్‌ చాంపియన్‌ భారత జట్టు గురువారం తెల్లవారగానే న్యూఢిల్లీకి చేరుకుంటుంది. వీరికి ఘనస్వాగతం పలికేందుకు బోర్డుతో పాటు వీరాభిమానులు తెగ ఆరాటం కనబరుస్తున్నారు. దీంతో దేశ రాజధాని ఢిల్లీ, వాణిజ్య రాజధాని ముంబై సంబరాల్లో మునిగితేలనున్నాయి. ముంబై: టి20 ప్రపంచకప్‌ను జయించిన భారత క్రికెట్‌ జట్టు సభ్యులు కాస్త ఆలస్యంగా నేడు స్వదేశానికి చేరుకుంటున్నారు. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ), ఎయిరిండియా సమన్వయంతో చార్టెర్డ్‌ ఫ్లయిట్‌లో చాంపియన్లు, జట్టు సహాయక సిబ్బంది, బోర్డు అధ్యక్ష కార్యదర్శులు రోజర్‌ బిన్నీ, జై షాలతో పాటు భారత్‌కు చెందిన మీడియా ప్రతినిధులు బార్బడోస్‌లోని గ్రాంట్లీ ఆడమ్స్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బుధవారం బయలుదేరారు.ఫ్లయిట్‌ షెడ్యూల్‌ టైమ్‌ ప్రకారం గురువారం ఉదయం గం. 6:20 గంటలకు న్యూఢిల్లీ చేరుకుంటుంది. కాసేపు ఆటగాళ్లు ప్రయాణ బడలిక నుంచి సేదతీరాక ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలుసుకుంటారు. ‘ఢిల్లీ విమానాశ్రయంలో 6 గంటలకు ఫ్లయిట్‌ ల్యాండ్‌ అవుతుంది. కొద్దిసేపు విశ్రాంతి అనంతరం ఆటగాళ్లు ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీ నివాసంలో భేటీ అవుతారు. ఇదివరకే విజేత సభ్యులను సోషల్‌ మీడియా ద్వారా, ఫోన్‌లో అభినందించిన ప్రధాని కాసేపు క్రికెటర్లతో గడుపుతారు’ అని బోర్డు సీనియర్‌ ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా తెలిపారు. ఈ భేటీ ముగిసిన వెంటనే మరో ప్రత్యేక విమానంలో టీమిండియా ముంబైకి పయనమవుతుంది. ముంబైలోనే బోర్డు అంబరాన్నంటే సంబరాలకు అన్ని ఏర్పాట్లు చేసింది. అక్కడికి చేరుకోగానే ముంబై, మహారాష్ట్ర క్రికెట్‌ సంఘాలు ఘనస్వాగతం పలుకుతాయి. ‘సాయంత్రం 5 గంటలకు నారీమన్‌ పాయింట్‌ వద్ద ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ఓపెన్‌ టాప్‌ బస్‌లో క్రికెటర్ల రోడ్‌షో మొదలవుతుంది. అక్కడి నుంచి విఖ్యాత వాంఖెడే స్టేడియం వరకు సుమారు రెండు గంటలపాటు సాగే ఈ షోలో అభిమానులు అడుగడుగునా నీరాజనాలు పలుకుతారు. రాత్రి 7 గంటల సమయంలో స్టేడియంలో ఆటగాళ్లు, సహాయ సిబ్బందిని ఒక్కోక్కరిగా ఘనంగా సన్మానిస్తారు. బోర్డు ప్రకటించిన రూ. 125 కోట్ల ప్రైజ్‌మనీని కూడా అందజేస్తారు’ అని శుక్లా పూర్తి బిజీ షెడ్యూల్‌ వివరాలను వెల్లడించారు. ఈ విక్టరీ పరేడ్‌లో అభిమానులంతా పాల్గొనాల్సిందిగా బోర్డు కార్యదర్శి జై షా ‘ఎక్స్‌’ (ట్విట్టర్‌)లో విజ్ఞప్తి చేశారు. ఇలాంటి రోడ్‌ షో 17 ఏళ్ల క్రితం తొలి టి20 ప్రపంచకప్‌ గెలిచిన ధోని బృందానికి నిర్వహించారు. కానీ 2011 వన్డే ప్రపంచకప్‌ గెలిచిన అదే ధోని సేనకు ఐపీఎల్‌ త్వరలోనే ప్రారంభం కావాల్సి ఉండటంతో రోడ్‌ షోను నిర్వహించలేదు. న్యూయార్క్‌ టు న్యూఢిల్లీ.. వయా బార్బడోస్‌ గత నెల 29న రోహిత్‌ శర్మ బృందం టి20 వరల్డ్‌కప్‌ గెలిచింది. ఆదివారం అర్ధరాత్రి లేదంటే సోమవారం ఉదయానికల్లా జగజ్జేతలు భారత్‌కు రావాలి. కానీ కరీబియన్‌లో భీకరమైన హరికేన్‌ తుఫాన్‌ వల్ల బార్బడోస్‌ ఎయిర్‌పోర్ట్‌ను మూసివేశారు. దీంతో టీమిండియా ఆటగాళ్లంతా అక్కడే ఇరుక్కుపోయారు. ఎట్టకేలకు కరీబియన్‌లో టి20 ప్రపంచకప్‌ గెలిచిన భారత జట్టు సభ్యులు కప్‌తో వచ్చేస్తున్నారు. ఎయిరిండియా చొరవ, న్యూయార్క్‌లోని ప్రయాణీకుల సహకారంతో దారి మళ్లించిన విమానంలో టీమిండియా క్రికెటర్లు, మీడియా సంస్థల ప్రతినిధులు గురువారం ఉదయం న్యూఢిల్లీకి చేరుకుంటారు. అయితే వాతావరణ పరిస్థితిలో మార్పురావడంతో న్యూయార్క్‌ (అమెరికా) నుంచి న్యూఢిల్లీకి ప్రయాణించాల్సిన ఎయిరిండియా విమానాన్ని వయా బార్బడోస్‌ మీదుగా దారి మళ్లించారు. ఈ విమానం కోసం టికెట్లు బుక్‌ చేసుకున్న సాధారణ ప్రయాణికులకు ముందస్తు సమాచారం ఇచ్చి అసౌకర్యం కలుగకుండా చూశారు. ఇంకొందరికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ఇక విజేతల కోసం ‘ఏఐసీ24డబ్ల్యూసీ’ (ఎయిరిండియా చాంపియన్స్‌ 24 ప్రపంచకప్‌) పేరిట ఈ విమానాన్ని ముస్తాబుచేసి బార్బడోస్‌లో క్రికెటర్లను ఎక్కించుకొని బుధవారం బయలుదేరింది. అయితే నిర్ణీత రూట్‌ కాకుండా మరో రూట్‌ మారడంపై డీజీసీఏ (విమానయాన నియంత్రణ సంస్థ) ఎయిరిండియాను నివేదిక కోరింది.

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all