ఆటో డ్రైవర్ రేణుకస్వామి హత్య కేసులో నిందితులుగా బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో హీరో దర్శన్ (A2), నటి పవిత్ర (A1) ఉన్నారు. రేణుకస్వామి సోషల్ మీడియా ద్వారా తనను వేధిస్తున్నట్లు దర్శన్‌తో పవిత్ర చెప్పింది. దీంతో కోపగించిన దర్శన్ తన అనుచరులతో రేణుకాస్వామిని హతమార్చినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో 17 మంది జైలులో ఉన్నారు.
జైల్లో పవిత్ర గౌడ మహిళా సిబ్బందితో గొడవకు దిగింది. పవిత్రకు రాత్రి నిద్రించేందుకు ఒక దుప్పటిని జైలు సిబ్బంది ఇచ్చారు. ఈ దుప్పటి వద్దని, ఇంటి నుంచి తెప్పించి ఇవ్వాలంటూ ఆమె గొడవ చేసినట్లు తెలిసింది. జైలులో ఉండి కూడా అది కావాలి, ఇది కావాలంటూ అక్కడ ఉన్న మహిళా సిబ్బందిని ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు సమాచారం. జైలు భోజనం తినేందుకు కూడా ఆమె నిరాకరించారట. దీంతో పోలీసులు కూడా ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చారట. ఇది మీ ఇల్లు కాదు, మౌనంగా ఉండటం నేర్చుకోవాలని సిబ్బంది గట్టిగా హెచ్చరించారట.
దర్శన్‌కు ఇతర ఖైదీల నుంచి ఏమైనా ప్రమాదం రావచ్చిని ఆయన్ను ప్రత్యేకమైన బ్యారక్‌లో ఉంచారు. రాత్రి భోజనంగా రాగి ముద్ద, చపాతి, అన్నం, సాంబార్, మజ్జిగ ఇచ్చారు. కానీ, భోజనం చేయని దర్శన్ ఆలస్యంగా నిద్రపోయి ఉదయం 6.30 గంటలకు లేచి కొంతసేపు వాకింగ్ చేశారు. జైలు సిబ్బందిని వేడినీరు అడిగి తాగారు. ఉదయం టిఫిన్ పలావ్ ఆరగించారు. భద్రత కోసం దర్శన్‌ను తుమకూరు జిల్లా జైలుకు బదిలీ చేయాలని పోలీసులు కోర్టుకు విన్నవించారు.
Comments
Please login to add a commentAdd a comment