
పరప్పన నుంచి తుమకూరుకు!
హత్యకు గురైన రేణుకాస్వామిపై బుల్లితెర నటి చిత్రాల్ రంగస్వామి ఆరోపణలు చేశారు. తన ఆరోపణలకు సాక్ష్యంగా కొన్ని స్క్రీన్ షాట్లు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఆమె.. రేణుకాస్వామి వేరే పేర్లతో నాకు కూడా చాలాసార్లు అశ్లీల మెసేజ్‌లు పంపించాడని తెలిపింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు. రేణుకాస్వామి పలు అకౌంట్ల నుంచి అశ్లీల మెసేజ్‌లు పంపించేవాడని అలాంటి అక్కౌంట్లను తాను బ్లాక్ చేశానన్నారు. చిత్రాల్ గతంలో బిగ్‌బాస్ పోటీదారుగా ఉండింది. ఆమె బాడీ బిల్డర్‌గా కూడా పేరుపొందారు. మరోవైపు వందలాది మంది అభిమానులు దర్శన్‌ను చూడాలంటూ జైలు వద్ద హంగామా సృష్టించారు. కొందరైతే దర్శన్ ఖైదీ నంబరైన 6106 పోస్టర్లను ప్రదర్శించారు.
దొడ్డబళ్లాపురం: రేణుకాస్వామి హత్య కేసులో అరైస్టె పరప్పన అగ్రహార జైలులో ఉన్న ప్రముఖ నటుడు, చాలెంజింగ్ స్టార్ దర్శన్‌ను మరో జైలుకు మారుస్తారని తెలుస్తోంది. ఈ జైలులో అయితే దర్శన్ భద్రత కల్పించడం కష్టమని భావిస్తున్నారు. దర్శన్‌ను మరో జైలుకు తరలించడానికి అవకాశం కల్పించాలని ఎస్‌పీపీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు అనుమతిస్తే దర్శన్‌ను తుమకూరు జైలుకి తరలించే అవకాశం ఉంది. దర్శన్ అనుచరులు, ఇతర రౌడీల మధ్య జైలులో ఘర్షణలు జరిగే అవకాశం ఉన్నట్టు జైలు అధికారులు భావిస్తున్నారు.
దర్శన్‌తో నటుడు వినోద్ భేటీ
చట్టానికి ఎవరూ అతీతులు కాదు, అన్యాయం జరిగినవారికి న్యాయం జరగాలని నటుడు వినోద్ ప్రభాకర్ అన్నారు. సోమవారంనాడు పరప్పన అగ్రహార జైలులో దర్శన్‌ను కలిసిన తరువాత మీడియాతో మాట్లాడారు. చట్టం ముందు అందరూ సమానమే అన్నారు. ఇలా జరగకుండా ఉండాల్సింది అని, రేణుకాస్వామి ఆత్మకు శాంతి లభించాలని చెప్పారు. తాను దర్శన్‌ను కలిసి 4 నెలలు అయ్యిందన్నారు. అన్నపూర్ణేశ్వరి పోలీస్‌స్టేషన్‌లో కలవాలని ప్రయత్నించినప్పటికీ వీలుకాలేదని, అందుకే జైలులో భేటీ అయినట్లు తెలిపారు. దర్శన్‌తో ఏమీ మాట్లాడలేక పోయానని, నన్ను చూసి టైగర్ అన్నాడని, బాస్ ఎలా ఉన్నారు అని అడిగానని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment