ధనుష్తో ఢీ అంటున్న రానా | Rana tamil movie with dhanush | Sakshi
Sakshi News home page

ధనుష్తో ఢీ అంటున్న రానా

Mar 16 2016 9:18 PM | Updated on Aug 11 2019 12:52 PM

ధనుష్తో ఢీ అంటున్న రానా - Sakshi

ధనుష్తో ఢీ అంటున్న రానా

స్టార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా.. హీరో పాత్రలకే పరిమితం కాకుండా అన్ని రకాల క్యారెక్టర్స్ చేస్తున్నయంగ్ హీరో రానా. ఇప్పటికే తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లో ప్రధాన పాత్రల్లో నటించిన రానా...

స్టార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా.. హీరో పాత్రలకే పరిమితం కాకుండా అన్ని రకాల క్యారెక్టర్స్ చేస్తున్నయంగ్ హీరో రానా. ఇప్పటికే తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లో ప్రధాన పాత్రల్లో నటించిన రానా, మరోసారి తమిళ యంగ్ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. ప్రస్తుతం మూడు భాషల్లో భారీగా తెరకెక్కుతున్న ఘాజీ సినిమాతో పాటు బాహుబలి సీక్వల్లోనూ నటిస్తున్నాడు రానా.

ఈ రెండు సినిమాలు పూర్తయిన తరువాత తమిళ స్టార్ హీరో ధనుష్ సినిమాలో కీ రోల్లో నటించడానికి అంగీకరించాడు. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్నఈ సినిమాలో కూడా రానా, ప్రతినాయక పాత్రలోనే కనిపించనున్నాడన్న టాక్ వినిపిస్తుంది. ఇటీవల షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమాలో ధనుష్ గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే సాహసం శ్వాసగా సాగిపో షూటింగ్ పూర్తిచేసిన దర్శకుడు గౌతమ్ మీనన్, ఆ సినిమా రిలీజ్ కాకముందే ధనుష్ సినిమాను ప్రారంభించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement