
యంగ్ హీరో కోసం మరో స్టార్ డైరెక్టర్
స్టార్ వారసుడిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. నిర్మాత బెల్లంకొండ సురేష్ వారసుడిగా అల్లుడు శీను సినిమాతో భారీగా తెరంగేట్రం చేశాడు శ్రీనివాస్. వివి వినాయక్ లాంటి స్టార్ డైరెక్టర్ తొలి సినిమాకు దర్శకత్వం వహించినా.. ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. తరువాత స్పీడున్నోడు సినిమాతో మరో ప్రయత్నం చేసినా అది కూడా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు.
తాజాగా మరో స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్లో నటిస్తున్నాడు సాయి. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో భారీ ప్రాజెక్ట్కు ప్లాన్ చేస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ ఇమేజ్ ఉన్న దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని భావిస్తున్నాడు. ఇప్పటికే బెల్లంకొండ సురేష్, గౌతమ్ మీనన్లు కథా చర్చలు కూడా చేసారన్న టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పై అఫీఫియల్ ఎనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది.