గౌతమ్ మీనన్ ఆస్తి వేలం
గౌతమ్ మీనన్ ఆస్తి వేలం
Published Wed, Mar 12 2014 10:53 PM | Last Updated on Sat, Sep 2 2017 4:38 AM
ప్రముఖ సినీ దర్శకుడు గౌతమ్ మీనన్ ఆస్తి వేలానికి రానుంది. తీసుకున్న రుణం తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంకు ఆయన స్థిరాస్తిని వేలం వేయడానికి సిద్ధం అవుతోంది. మిన్నలే, కాక్కకాక్క, వేట్టైయాడు విలైయాడు, విన్నైతాండి వరువాయా, వంటి పలు చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు గౌతమ్ మీనన్. ఈయన నిర్మాతగా కూడా నడునిశి నాయ్‌గళ్, వెప్పం వంటి కొన్ని చిత్రాలను నిర్మించారు.
గౌతమ్ మీనన్‌కు నిర్మాత ఎల్.రెడ్.కుమార్‌కూ మధ్య ఆర్థిక పరమైన విభేదాలలతో కోర్టు వరకు వెళ్లింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఆస్తిని బ్యాంకు వేలం వేయనున్నట్లు ప్రకటించింది. గౌతమ్ మీనన్‌కు స్థానిక ఇందిరా నగర్‌లో12.26 కోట్ల విలువైన స్థలం ఉంది. ఈ స్థలం డాక్యుమెంట్‌లను బ్యాంకులో తాకట్టు పెట్టి రుణం తీసుకున్నారు. ఈ స్థలాన్ని ఆ బ్యాంకు వేలం వేయడానికి సిద్ధం అయ్యిందని సమాచారం.
Advertisement
Advertisement