Property auction
-
రైతుల ఆస్తులు వేలం
కర్నూలు (అగ్రికల్చర్): ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (కేడీసీసీబీ) బకాయిలను రాబట్టుకునేందుకు రైతుల ఆస్తులను వేలం వేసేందుకు రంగం సిద్ధంచేస్తున్నారు. రైతులకు అవసరమైన రుణాలను పంపిణీచేసి ఆదుకోవాల్సి ఉండగా.. గతంలో ఎప్పుడూలేని విధంగా ఆ విషయంలో పూర్తిగా వెనుకబడింది. పైగా ఇప్పుడు వారి ఆస్తులను విక్రయించి బకాయిలకు జమచేసుకునేందుకు న్యాయ ప్రక్రియ కూడా మొదలుపెట్టింది. ఇందులో భాగంగా తాకట్టు పెట్టిన ఆస్తులను వేలంపాట ద్వారా విక్రయించే ప్రక్రియను జిల్లా సహకార కేంద్ర బ్యాంకు, పీఏసీఎస్‌లు ముమ్మరం చేశాయి. ఈ ఏడాది జూన్ నుంచి ఒకవైపు సెక్షన్–71 కింద నోటీసులివ్వడం, మరోవైపు ఎగ్జిక్యూషన్ పిటిషన్ (ఈపీ) పైల్చేయడం వంటివి జరుగుతున్నాయి. అలాగే, 2024 జూన్ నుంచి డిసెంబరు వరకు రూ.122.82 కోట్ల బకాయిలను రాబట్టుకునేందుకు 1,457 మంది రైతులకు సహకార చట్టం సెక్షన్–71 కింద నోటీసులు ఇచ్చారు. ఇదే సమయంలో 522 మంది రైతుల నుంచి రూ.41.92 కోట్లను రాబట్టేందుకు ఈపీలు కూడా దాఖలు చేశారు. ఆస్తుల అమ్మకానికి డిక్రీ కూడా చేయడం గమనార్హం. నిజానికి.. ఈ ఏడాది అన్ని రకాలుగా వ్యవసాయం కలిసిరాక నష్టాల బారిన పడినా రైతుల ఆస్తుల విక్రయాలకు డీసీసీబీ రంగం సిద్ధంచేయడంపట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నాటి రోజులు మళ్లీ పునరావృతం.. 2014–15 నుంచి 2018–19 వరకు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు, పీఏసీఎస్‌లు పాత బకాయిలను రాబట్టుకునేందుకు రైతుల జీవితాలతో చెలగాటమాడాయి. మళ్లీ అదే పరిస్థితి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోను పునరావృతమవుతోంది. బకాయిలు పేరుకుపోవడానికి బ్యాంకు, పీఏసీఎస్ సిబ్బంది అవినీతి అక్రమాలే కారణమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్వల్పకాలిక రుణమైన, దీర్ఘకాలిక రుణమైన రైతులు కమీషన్లు ఇచ్చుకోకపోతే రుణాలిచ్చే పరిస్థితిలేదు. వెరిఫికేషన్ కోసం వెళ్లే అధికారులకూ ముడుపులు సమర్పించాల్సిందే. రూ.లక్ష రుణం తీసుకుంటే చేతికి వచ్చేది రూ.80 వేలే. రికవరీ మాత్రం రూ.లక్ష చేయాల్సిందే. ఈ కారణాలతోనే అనేకమంది రైతులు రుణాలు తిరిగి చెల్లించలేకపోతున్నారు. దీంతో వీరి ఆస్తుల వేలంపాట ద్వారా విక్రయించి బకాయిలు జమచేసుకుంటున్నారు. రూ.5 కోట్లు రుణాలు ఇస్తే ఒట్టు.. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రుణాల పంపిణీ కోసం ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు బ్రాంచీలకు, పీఏసీఎస్‌లకు రూ.330 కోట్ల బడ్జెట్ ఇచ్చిoది. ఈ బడ్జెట్ పూర్తయితే అదనంగా ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉంది. దీర్ఘకాలిక, స్వల్పకాలిక రుణాల పంపిణీకి ఈ బడ్జెట్‌ని వినియోగించాలి. బడ్జెట్ దండిగా ఉన్నప్పటికీ రుణాల పంపిణీ మాత్రం పెద్దగాలేదు. వాణిజ్య బ్యాంకులకు రైతులు పోటెత్తుతుంటే జిల్లా సహకార కేంద్ర బ్యాంకు బ్రాంచీల్లో మాత్రం అందుకు విరుద్ధమైన పరిస్థితి కనిపిస్తోంది. ప్రతిఏటా జూలై నుంచి నవంబరు లేదా డిసెంబరు మూడవ వారం వరకే రుణాలు పంపిణీ చేస్తారు. ఆ తర్వాత రికవరీపై దృష్టిసారిస్తారు. ఈ నేపథ్యంలో.. రుణాల పంపిణీకి ఇంత పెద్ద మొత్తం కేటాయించినప్పటికీ ఇప్పటివరకు రుణాల పంపిణీ రూ.5 కోట్లలోపే ఉండటం గమనార్హం. లాభాల బాట పట్టించిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం.. నష్టాల ఊబిలో చిక్కుకున్న కర్నూలు డీసీసీబీకి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఊపిరిపోసింది. వివిధ ప్రభుత్వ కార్యక్రమాలకు కేడీసీసీబీ రుణాలు పంపిణీచేసే ఏర్పాటుచేసింది. కస్టమ్స్ హయ్యరింగ్ సెంటర్లు, మల్టీపర్పస్ గోదాముల నిర్మాణాలకు డీసీసీబీ రుణాలు అందజేసింది. గత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల ఫలితంగా బ్యాంకు లోనింగ్ భారీగా పెరిగింది. వైఎస్సార్సీపీ హయాంలో దశాబ్దాల నాటి నష్టాలను అధిగమించి నికర లాభాల్లోకి వచి్చంది. 2022–23, 2023–24 సంవత్సరాల్లో గణనీయమైన నికర ఆదాయం పొందింది. రికార్డు స్థాయిలో ఏకంగా రూ.10 కోట్లు లాభం ఆర్జించగా.. సభ్యులైన పీఏసీఎస్‌లకు రూ.4 కోట్లు డివిడెండ్ ఇచ్చిoది. రాయలసీమ జిల్లాల్లోనే అత్యధిక టర్నోవర్ కలిగిన బ్యాంకుగా వరుసగా రెండేళ్లు అవార్డు కూడా అందుకుంది. నికర లాభాల్లోకి వచ్చిన కేడీసీసీబీ మళ్లీ నష్టాల్లోకి వచ్చి బలహీనమైన బ్యాంకుగా రికార్డు నమోదుచేసుకోవడం ఆందోళన కలిగించే విషయం. రైతుల ఆస్తుల స్వాధీనానికి రంగం సిద్ధం.. ఇక కల్లూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో బకాయిపడిన రైతులు 70 మందికి జూన్ నుంచి సెక్షన్–71 కింద నోటీసులిచ్చారు. తర్వాత 30 మంది రైతులకు ఈపీ దాఖలు చేశారు. కొంతమంది బకాయిలు చెల్లించారు. 20 మంది రైతులు స్పందించకపోవడంతో వారి ఆస్తుల వేలానికి చర్యలు తీసుకున్నారు. దీంతో 13 మంది రైతులు బకాయిలు చెల్లించారు. ఇక ఏడుగురు స్పందించకపోవడంతో వారి ఆస్తులను పీఏసీఎస్ పరం చేసుకోవడానికి చర్యలు చేపట్టారు. -
ఐదు కంపెనీల ప్రాపర్టీలు వేలం
మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఐదు కంపెనీలకు సంబంధించి 15 ప్రాపర్టీలకు (భూములు/ భవనాలు) నవంబర్ 19న వేలం నిర్వహించనుంది. మంగళం ఆగ్రో ప్రొడక్ట్స్, సుమంగళ్ ఇండస్ట్రీస్, ఫాల్కన్ ఇండస్ట్రీస్ ఇండియా, రవికిరణ్ రియల్టీ ఇండియా, పురుషోత్తమ్ ఇన్ఫోటెక్ ఇండస్ట్రీస్ కంపెనీలకు సంబంధించిన ఆస్తులు ఇందులో ఉన్నాయి.నిబంధనలకు విరుద్ధంగా ఇన్వెస్టర్ల నుంచి ఈ కంపెనీలు వసూలు చేసిన డబ్బులను వేలం ద్వారా రాబట్టబోతున్నట్లు సెబీ తెలిపింది. పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్రాల పరిధిలోని ఈ కంపెనీలకు సంబంధించి ప్రాపర్టీలు, ఫ్లాట్లు, భూములు, ప్లాంట్ మెషినరీ వేలం వేయనున్నారు. ఆ ప్రాపర్టీలకు సంబంధించి బిడ్లను సెబీ ఆహ్వానించింది. 15 ప్రాపర్టీల్లో ఏడు మంగళం ఆగ్రో ప్రొడక్ట్స్‌కు సంబంధించినవి ఉన్నాయి. సుమంగళ్ ఇండస్ట్రీస్, ఫాల్కన్ ఇండస్ట్రీస్‌కు సంబంధించి చెరో మూడు ప్రాపర్టీలు ఉన్నాయి.ఇదీ చదవండి: మొబైల్ తయారీ రంగంలో వేగంగా విస్తరణమంగళం ఆగ్రో ప్రొడక్ట్స్ నిబంధనలకు విరుద్ధంగా సెక్యూర్డ్ ఎన్సీడీ(నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్-కంపెనీ అప్పు చెల్లించడంలో డిఫాల్ట్ అయితే దాని ఆస్తులు అమ్ముకోవచ్చు)లను జారీ చేసి రూ.11 కోట్లు సమీకరించినట్టు సెబీ తేల్చింది. అలాగే సుమంగళ్ ఇండస్ట్రీస్ కలెక్టివ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్‌ల(వ్యక్తుల నుంచి డబ్బు తీసుకుని విభిన్న మార్గాల్లో పెట్టుబడులు పెట్టడం) ద్వారా రూ.85 కోట్లు, ఫాల్కన్ ఇండస్ట్రీస్ రెడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్ల(రెడీమ్ చేసేకునేందుకు వీలుగా ఉన్న షేర్లు) జారీ ద్వారా రూ.48.58 కోట్ల చొప్పున సమీకరించడం గమనార్హం. -
బ్యాంకులు నిష్పాక్షికంగా వ్యవహరించాలి
సాక్షి, అమరావతి: ఓ ఆస్తి వేలం వ్యవహారంలో కెనరా బ్యాంకు తీరును హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. బాకీదారుతో వన్‌టైం సెటిల్మెంట్కు అంగీకరించి, అతని రుణ ఖాతాను మూసివేసిన కెనరా బ్యాంకు.., మరో వైపు అదే ఆస్తిని బ్యాంకు వేలంలో కొన్న వ్యక్తి నుంచి ముందస్తుగా కొంత వసూలు చేసి, గడువు తేదీకి ముందే దానిని జప్తు/సర్దుబాటు చేయడాన్ని తప్పుపట్టింది. చెల్లింపు చివరి తేదీ వరకు మొత్తం డబ్బు చెల్లించేందుకు వేలంలో విజేతకు అవకాశం ఉంటుందని తెలిపింది. చివరి తేదీన మొత్తం డబ్బు చెల్లించని పక్షంలో మాత్రమే అతని ముందస్తు చెల్లింపులను జప్తు చేసే అధికారం బ్యాంకుకు ఉంటుందని తేల్చి చెప్పింది. ఈ కేసులో కెనరా బ్యాంకు హద్దుమీరడమే కాక, చట్ట విరుద్ధంగా కూడా వ్యవహరించిందని స్పష్టం చేసింది. వేలం వేసిన స్థలం విషయంలో బ్యాంకు నిష్పాక్షికంగా వ్యవహరించలేదంది. ఆ స్థలానికి రెండు భారీ భవంతుల మధ్య సన్నని తోవ గుండా వెళ్లాలన్న విషయాన్ని వేలం ప్రకటనలో తెలియజేయకపోవడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. జాతీయ బ్యాంకుగా దాని చర్యలు నిష్పాక్షికంగా, పారదర్శకంగా ఉండాలని తేల్చి చెప్పింది. పిటిషనర్ ముందుగా చెల్లించిన రూ.22.50 లక్షలు, గడువు తేదీ రోజు చెల్లించిన రూ.15 లక్షలను కూడా వాపసు చేయాలని బ్యాంకును ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు, జస్టిస్ ఊటుకూరు శ్రీనివాస్ ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. జరిగిందిదీ.. పెరుమాళ్లు ఆగ్రో ఇండస్ట్రీస్ గుంటూరు విద్యానగర్‌లోని 302.50 చదరపు గజాల స్థలాన్ని తనఖా పెట్టి కెనరా బ్యాంకు నుంచి రుణం తీసుకుంది. ఆ రుణం తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంకు ఆ స్థలాన్ని వేలం వేసింది. వేలంలో చిలకలూరిపేటకు చెందిన సయ్యద్ హిదయతుల్లా బిడ్‌ను 2019 ఆగస్టు 26న ఆమోదించారు. నిబంధనల ప్రకారం బిడ్ మొత్తంలో 25 శాతం కింద రూ.22.50 లక్షలు ఆయన చెల్లించారు. మిగిలిన మొత్తం చెల్లించేందుకు 2019 అక్టోబరు 25 చివరి తేదీగా నిర్ణయించారు. ఆ తేదీన హిదయతుల్లా రూ.15 లక్షలు మాత్రమే చెల్లించారు. కెనరా బ్యాంకు 2019 సెప్టెంబరు 9న రూ.22.50 లక్షలను పెరుమాళ్లు ఆగ్రో ఇండస్ట్రీస్ రుణ ఖాతా కింద సర్దుబాటు చేసింది. హిదయతుల్లా స్థలం లింకు డాక్యుమెంట్లు, ఇతర వివరాలను కోరినా బ్యాంకు ఇవ్వలేదు. స్థలం ఎల్ ఆకారంలో ఉండటం, రెండు భారీ భవంతుల మధ్య నుంచి సన్నని తోవ గుండా వెళ్లాల్సి రావడంపై ఆయన అభ్యంతరం తెలిపారు. తాను చెల్లించిన మొత్తాన్ని వాపసు ఇవ్వాలని బ్యాంకు అధికారులను కోరారు. వారు స్పందించకపోవడంతో 2019లో హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ సోమయాజులు ధర్మాసనం ఇటీవల తుది విచారణ జరిపి, తీర్పు ఇచ్చింది. -
మోసపూరిత సంస్థల ఆస్తుల వేలం
న్యూఢిల్లీ: రాయల్ ట్వింకిల్ స్టార్ క్లబ్ లిమిటెడ్, సిట్రస్ చెక్ ఇన్స్ లిమిటెడ్ సంస్థల ఆస్తులను ఈ నెల 23న సెబీ వేలం వేయనుంది. మోసపూరిత ప్రకటనలతో ఇన్వెస్టర్ల నిధులను ఈ సంస్థలు కొల్లగొట్టడంతో, వాటి వసూలుకు సెబీ ఈ చర్య చేపడుతోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆస్తులను వేలం వేస్తున్నట్టు సెబీ శుక్రవారం ప్రకటించింది. వేలానికి ఉంచే ఈ రెండు సంస్థల ఆస్తులు ముంబై, బెంగళూరు, కేరళలో ఉన్నాయి. ముంబైలోని లోయర్‌పారెల్‌లో ఉన్న ప్రాపర్టీ రిజర్వ్ ధర రూ.25.6 కోట్లు కాగా, లోనవాలాలో ఉన్న ప్రాపర్టీ రిజర్వ్ ధర రూ.35.25 కోట్లు, బెంగళూరులో ప్రాపర్టీ రిజర్వ్ ధర రూ.32 కోట్లు, కేరళలోని అలప్పుజలో ప్రాపర్టీ రిజర్వ్ ధర 15.3 కోట్లుగా ఉంది. టైమ్ షేర్ హాలిడే ప్లాన్ల పేరుతో అక్రమంగా రూ.2,656 కోట్లను సమీకరించడంతో రాయల్ ట్వింకిల్‌పై, ఆ సంస్థ నలుగురు డైరెక్టర్లపై నాలుగేళ్లపాటు సెబీ నిషేధం విధిస్తూ 2015 ఆగస్ట్‌లోనే ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. నిబంధనలు ఉల్లంఘించడంతో సిట్రస్ చెక్ ఇన్స్పై రూ.50 లక్షల జరిమానా విధించడంతోపాటు.. ప్రజల నుంచి నిధులు సమీకరించకూడదని లోగడ ఆదేశించింది. -
గౌతమ్ మీనన్ ఆస్తి వేలం
ప్రముఖ సినీ దర్శకుడు గౌతమ్ మీనన్ ఆస్తి వేలానికి రానుంది. తీసుకున్న రుణం తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంకు ఆయన స్థిరాస్తిని వేలం వేయడానికి సిద్ధం అవుతోంది. మిన్నలే, కాక్కకాక్క, వేట్టైయాడు విలైయాడు, విన్నైతాండి వరువాయా, వంటి పలు చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు గౌతమ్ మీనన్. ఈయన నిర్మాతగా కూడా నడునిశి నాయ్‌గళ్, వెప్పం వంటి కొన్ని చిత్రాలను నిర్మించారు. గౌతమ్ మీనన్‌కు నిర్మాత ఎల్.రెడ్.కుమార్‌కూ మధ్య ఆర్థిక పరమైన విభేదాలలతో కోర్టు వరకు వెళ్లింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఆస్తిని బ్యాంకు వేలం వేయనున్నట్లు ప్రకటించింది. గౌతమ్ మీనన్‌కు స్థానిక ఇందిరా నగర్లో12.26 కోట్ల విలువైన స్థలం ఉంది. ఈ స్థలం డాక్యుమెంట్లను బ్యాంకులో తాకట్టు పెట్టి రుణం తీసుకున్నారు. ఈ స్థలాన్ని ఆ బ్యాంకు వేలం వేయడానికి సిద్ధం అయ్యిందని సమాచారం.