మళ్లీ మోడ్రన్‌గా...
మళ్లీ మోడ్రన్‌గా...
Published Tue, Feb 25 2014 11:40 PM | Last Updated on Sat, Sep 2 2017 4:05 AM
అనుష్క ప్రస్తుతం చేస్తున్న సినిమాలు బాహుబలి, రుద్రమదేవి. ఒకటి జానపదం, ఇంకొకటి చరిత్రాత్మకం. రెండింటిలోనూ రాణీగానే నటిస్తున్నారామె. ఈ పాత్రల కోసం గుర్రపుస్వారీ, యుద్ధవిద్యలను అభ్యసించి, పూర్తి ఏకాగ్రతతో ఈ చిత్రాలను పూర్తి చేస్త్తున్నారు అనుష్క. నేటి కథానాయికల్లో ఇలాంటి పాత్రలు చేసే అదృష్టం అనుష్కకు మాత్రమే దక్కిందని చెప్పాలి. అయితే... ఇలాంటి పాత్రల ప్రభావం కెరీర్‌పై కూడా బలంగా ఉంటుంది. దానికి ఉదాహరణ కూడా అనుష్క కెరీరే. తాను ‘అరుంధతి’ చేసుండకపోతే... ఈ సినిమాలు ఆమెకు దక్కేవి కావు. ఇప్పుడు వరుసగా రెండు సంచలనాత్మక చిత్రాల్లో నటిస్తున్నారామె. ఈ పాత్రల ప్రభావం అనుష్క కెరీర్‌పై బలంగానే ఉంటుందనడంలో సందేహం లేదు.
అప్పుడప్పుడు ఇలాంటి పాత్రలు చేస్తే ఫర్లేదు కానీ... ప్రతిసారీ ఇలాంటి పాత్రల్లోనే కనిపించడం నేటి ట్రెండ్‌కి కరెక్ట్ కాదు. ఆ విషయం అనుష్కకు కూడా బాగా తెలుసు. అందుకే... ఈ సినిమాల తర్వాత తన అసలైన మోడ్రన్ అవతారంలోకి వచ్చేయడానికి సరంజామా సిద్ధం చేసుకుంటున్నారు అనుష్క. అందులో భాగంగానే... గౌతమ్ మీనన్ సినిమాకు పచ్చజెండా ఊపేశారు. అజిత్ కథానాయకునిగా రూపొందనున్న ఈ తమిళ చిత్రం తెలుగులో కూడా విడుదలవుతుందని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాలో అల్ట్రా మోడ్రన్ అమ్మాయిలా స్పైసీ స్పైసీగా కనిపించబోతున్నారట అనుష్క. వేసవిలో ఈ చిత్రం సెట్స్‌కి వెళుతుంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Advertisement