నక్షత్రం హీరోతో గౌతమ్ మీనన్..! | sundeep kishan might team up with gautham menon again | Sakshi
Sakshi News home page

నక్షత్రం హీరోతో గౌతమ్ మీనన్..!

Published Tue, Aug 8 2017 12:39 PM | Last Updated on Sun, Sep 15 2019 12:38 PM

నక్షత్రం హీరోతో గౌతమ్ మీనన్..! - Sakshi

నక్షత్రం హీరోతో గౌతమ్ మీనన్..!

సౌత్ స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ నిర్మాతగానూ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ కార్తీక్ నరేన్ (డి 16 ఫేం) దర్శకుడిగా నరగసూరన్ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా తెలుగులో నరకాసురుడు పేరుతో రిలీజ్ కానుంది. ఈ సినిమాలో టాలీవుడ్ యువ నటుడు సందీప్ కిషన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. మానగరం సినిమాతో కోలీవుడ్ సినీ జనాల దృష్టిని ఆకర్షించిన సందీప్ కిషన్ తమిళ నాట బిజీ అవుతున్నాడు.

నరకాసురుడు తరువాత సందీప్ కిషన్ హీరోగా మరో సినిమాను నిర్మించే ఆలోచనలో ఉన్నాడు గౌతమ్ మీనన్. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమా తెలుగు, తమిళ తెరకెక్కనుంది. నటుడిగా మంచి మార్కులు సాధిస్తున్నా.. సక్సెస్ మాత్రం అందుకోలేకపోతున్న సందీప్.. గౌతమ్ మీనన్ సినిమాల మీదే ఆశలు పెట్టుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement