బట్ ఫర్ ఏ ఛేంజ్! | Vishal act in Director srivas movie | Sakshi
Sakshi News home page

బట్ ఫర్ ఏ ఛేంజ్!

Published Mon, Sep 26 2016 11:46 PM | Last Updated on Mon, Sep 4 2017 3:05 PM

బట్ ఫర్ ఏ ఛేంజ్!

బట్ ఫర్ ఏ ఛేంజ్!

గౌతమ్ మీనన్, ఏఆర్ మురుగదాస్, ఎస్.జె.సూర్య.. వీళ్లంతా తమిళ దర్శకులే. అవకాశం వచ్చినప్పుడల్లా తెలుగులో అగ్ర హీరోల సినిమాలకు దర్శకత్వం వహిస్తుంటారు. తాజాగా అల్లు అర్జున్‌తో తీస్తున్న సినిమాతో ఈ జాబితాలోకి లింగుస్వామి చేరనున్నారు. ఇలా తమిళ దర్శకులు హైదరాబాద్ వచ్చి తెలుగు సినిమాలు తీయడమే తప్ప.. ఇటీవల మనోళ్లు చెన్నై వెళ్లి తమిళ సినిమాలు తీసింది తక్కువే. బట్ ఫర్ ఏ ఛేంజ్.. దర్శకుడు శ్రీవాస్ చెన్నై వెళ్తున్నారు. విశాల్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో సినిమా తీయడానికి ప్లాన్ చేస్తున్నారట.
 
 విశాల్ ప్రతి సినిమా తెలుగులో డబ్బింగ్ కావడమనేది కామన్. స్ట్రయిట్ తెలుగు సినిమాలో నటించాలనుందని చాలారోజుల నుంచి విశాల్ చెబుతున్నారు. ఆ కోరిక శ్రీవాస్ సినిమాతో తీరుతున్నట్టుంది. ఈ సంక్రాంతికి ‘డిక్టేటర్’తో హిట్ అందుకున్న శ్రీవాస్ స్క్రిప్ట్ వర్క్‌తో బిజీగా ఉన్నారట. ప్రీ-ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయట. జనవరిలో షూటింగ్ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారని టాక్. ప్రస్తుతం ‘టెంపర్’ తమిళ రీమేక్, ‘పందెం కోడి 2’, దర్శకుడు మిస్కిన్ సినిమాలతో విశాల్ బిజీగా ఉన్నారు. ఇక, విశాల్, తమన్నా జంటగా నటించిన ‘ఒక్కడొచ్చాడు’ ఈ అక్టోబర్‌లో విడుదల కానుంది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement