
సూర్య, గౌతమ్ మీనన్
హీరో సూర్య, దర్శకుడు గౌతమ్ మీనన్ కాంబినేషన్ మంచి హిట్. గతంలో వీరి కాంబినేషన్‌లో ‘కాక్క కాక్క’ (తెలు గులో వెంకటేశ్ చేసిన ‘ఘ ర్షణ), ‘వారనమ్ ఆయిరమ్’ (‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’) సినిమాలు వచ్చాయి. సూర్యను స్టార్ లీగ్‌లో నిలబెట్టిన చిత్రాల్లో ఈ రెంటికి కూడా ప్రధాన స్థానం ఉంది. ఇప్పుడు మూడో సినిమా కోసం ఈ కాంబినేషన్ కలవబోతోందని చెన్నై టాక్. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్ నిర్మించనుందట. ఈ నెల 20న విడుదల కానున్న సూర్య చేసిన ‘కాప్పాన్’ (‘బందోబస్త్’)ను లైకా సంస్థే నిర్మించింది. తాజా చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.
Comments
Please login to add a commentAdd a comment