మూడోసారి మాయ చేస్తారట..! | Nagachaithanya to do hatrick film with gautham menon | Sakshi
Sakshi News home page

మూడోసారి మాయ చేస్తారట..!

Published Sat, Nov 7 2015 1:47 PM | Last Updated on Sun, Sep 3 2017 12:11 PM

మూడోసారి మాయ చేస్తారట..!

మూడోసారి మాయ చేస్తారట..!

ప్రస్తుతం గౌతమ్మీనన్ దర్శకత్వంలో 'సాహసం శ్వాసగా సాగిపో' సినిమాలో నటిస్తున్న నాగచైతన్య అదే డైరెక్టర్తో మరో సినిమాకు రెడీ అవుతున్నాడు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'ఏం మాయచేసావే' సినిమాతో తొలి బ్లాక్ బస్టర్ అందుకున్న చైతూ ఆ కృతజ్ఞతతో గౌతమ్మీనన్ దర్శకత్వంలో వరుస సినిమాలకు రెడీ అవుతున్నాడు. 'సాహసం శ్వాసగా సాగిపో' సినిమా తరువాత 'ప్రేమమ్' రీమేక్లో నటించనున్న చైతన్య ఆ సినిమా తరువాత మరోసారి గౌతమ్మీనన్ దర్శకత్వంలో నటించనున్నాడు.

ఈ సినిమాను తెలుగు, తమిళ్తో పాటు కన్నడ, మళయాల భాషల్లోనూ తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడు గౌతమ్ మీనన్. తెలుగు తమిళ భాషల్లో తన గత చిత్రాల్లో నటించిన చైతూ, శింబులనే ఎంపిక చేయగా, కన్నడలో పునీత్ రాజ్కుమార్ను ఫైనల్ చేశాడు. త్వరలోనే మళయాల నటుడిని ఎంపిక చేసి సినిమాకు సంబందించిన అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement