nagachaithanya
-
వెంకీ మామ టైటిల్ సాంగ్
-
నటనకు బ్రేక్.. గర్భం విషయంపై స్పందిస్తారా..?
సినిమా: సంచలనాలకు చిరునామా సమంత. పాకెట్ మనీ కోసం చిన్నచిన్న వేడుకల్లో సహాయ కార్యక్రమాలు చేస్తూ నటిగా మారింది ఈ బ్యూటీ. బానాకాత్తాడి చిత్రంతో హీరోయిన్గా రంగప్రవేశం చేసినా, తెలుగులో నటించిన ఏ మాయచేసావే చిత్రంతో విజయాన్ని అందుకుంది. తరువాత తెలుగు, తమిళం భాషల్లో స్టార్ హీరోలతో నటిస్తూ హిట్ చిత్రాల నాయకిగా రాణిస్తున్నారు. తమిళంలో విజయ్, సూర్య, విశాల్, ధనుష్, విజయ్‌సేతుపతి, శివకార్తికేయన్లతోనూ నటించారు. ఇటీవల హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల నాయకిగా పేరు తెచ్చుకున్నారు. ఈ బ్యూటీ నటించిన ఓ బేబీ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. సినిమా విషయాలను పక్కన పెడితే సమంత తెలుగులో తొలి హీరో నాగచైతన్యనే ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కాగా సమంత గర్భం దాల్చినట్లు, దీంతో నటనకు సుమారు ఒకటిన్న ఏడాది బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. సినిమాలకు విరామం ఇవ్వాలని నిర్ణయించుకున్న సమంత కొత్త చిత్రాలను అంగీకరించడం లేదనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం నటిస్తున్న 96 చిత్రం తరువాత మరో చిత్రాన్ని అంగీకరించలేదన్నది వాస్తవమే. అయితే ఈ విషయమై నటి సమంత ఇంకా స్పందించలేదు. కానీ మంచి విజయాలతో సాగుతున్న పరిస్థితుల్లో నటజీవితానికి సమంత విరామం ఇస్తుందని భావంచలేం. అదీగాక ఇప్పుడే లేడీ ఓరియెంటెడ్ చిత్రాల నాయకిగా పేరు తెచ్చుకుంటున్నారు. ఇకపై ఆ తరహా వైవిధ్యభరిత కథా చిత్రాల్లో నటించాలనుకుంటున్నట్లు ఈ భామ ఇటీవలే తెలిపారు. అలాంటిది పిల్లలను కనాలనే ఆలోచనను సమంత ఇంత త్వరగా తీసుకుంటారని ఊహించలేం కూడా. మరో విషయం ఏమిటంటే తన నటించిన ఓ బేబీ చిత్ర విజయంతో తన పారితోషికాన్ని పేంచేసిందనే ప్రచారం ఒక పక్క జరుగుతోంది. ఇలా తన నట జీవితం ఉజ్వలంగా సాగుతున్న తరుణంలో బ్రేక్ తీసుకోవాలని ఏ నటి కోరుకోదు. అలాంటిది నటి సమంత గురించి ఇలాంటి ప్రచారం జరగడానికి కారణం ఏంటో తెలియాల్సి ఉంది. వదంతులను ఎంజాయ్ చేసే సమంత తన గర్భం దాల్చాననే ఈ విషయంపై వెంటనే స్పందిస్తారా అనేది వేచి చూడాలి. -
కంటిపై కునుకు పట్టనివ్వని సమంత
సాక్షి, సినిమా: సమంత కంటిపై కునుకు పట్టనివ్వడం లేదట. ఇటీవలే ‘సమంత రూథ్ ప్రభు’ పేరులో తండ్రి పేరును మార్చుకుని జీవిత భాగస్వామి ఇంటి పేరును చేర్చుకుని ‘సమంత అక్కినేని’ అయిన విషయం తెలిసిందే. అదే విధంగా ఈ చెన్నై చంద్రం హైదరాబాద్ బ్యూటీగా మారిపోయారు. ప్రస్తుతం క్రేజీ హీరోయిన్లలో ఒకరిగా రాణిస్తున్న సమంత, తెలుగు, తమిళ భాషల్లో చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇదే సహ నటీమణులకు కంటి మీద కునుకు రానీయకుండా చేస్తున్న అంశం. సమంత కథానాయకిగా మంచి ఫామ్‌లో ఉండగానే టాలీవుడ్ యువ నటుడు నాగచైతన్యతో ప్రేమలో పడిన విషయం తెలిసిందే. ఈ ప్రేమ సక్సెస్ అవుతుందా.? వీరు అసలు పెళ్లి పీటలు ఎక్కుతారా.? అన్న ఆసక్తి, అనుమానాలతో చాలా మంది ఎదురుచూశారు. నాగచైతన్య, సమంతల వివాహం విజయవంతంగా జరిగింది. అయితే వివాహానంతరం తాను నటనకు దూరం కాను అని సమంత ముందుగానే ప్రకటించినా, చాలా మంది పెళ్లి తరువాత హీరోయిన్ అవకాశాలు తగ్గుతాయి అని అనుకున్నారు. ఇక సహ నటీమణులయితే సమంత మనకు పోటీ అవ్వదు, ఆమె అవకాశాలన్నీ తమ తలుపులు తడతాయని సంబరపడ్డారు. అలాంటి వారికే ఇప్పుడు సమంత కంటికి కునుకు పట్టనీయడం లేదు. పెళ్లి అయిన వెంటనే నటించడానికి రెడీ అయిపోయిన సమంతకు అవకాశాలు ఏ మత్రం తగ్గలేదు. తెలుగు, తమిళం భాషల్లో చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. తెలుగులో రామ్‌చరణ్‌కు జంటగా రంగస్థలం, మహానటి సావిత్రి జీవిత చరిత్రతో తెరకెక్కుతున్న ద్విభాషా చిత్రం నడిగైయార్ తిలగం(తెలుగులో మహానటి), తమిళంలో విశాల్‌కు జంటగా ఇరుంబుతిరై, సూపర్ డీలక్స్ చిత్రాలలో నటిస్తున్నారు. పెళ్లి అయిన తరువాత కూడా సమంత క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. కాగా ఇకపై గ్లామరస్ పాత్రలు చేయబోనని, నటనకు అవకాశం ఉన్న పాత్రల్నే ఎంపిక చేసుకుని నటిస్తానని అని సమంత నిర్ణయం తీసుకున్నారు. -
చైతూ చెప్పింది నాగురించి కాదు : సమంత
హైదరాబాద్ : అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం అంట సమంత.. చైతుగారు ఎదో అంటున్నారని ఓ అభిమాని పెట్టిన కామెంట్‌కు నటి సమంత బదులిచ్చింది. హ హా.. అవి నా గురించికాదు, మిగతా అమ్మాయిల గురించి అంటూ సమంత సరదాగా ట్వీట్ చేసింది. నాగ చైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ కాంబినేషన్లో వస్తున్న ''రారండోయ్ వేడుక చూద్దాం'' సినిమా థియేట్రికల్ ట్రైలర్ శనివారం విడుదలైంది. చైతూ సరసన రకుల్ తొలిసారిగా నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఎక్కువే ఉన్నాయి. అయితే ఈ థియేట్రికల్ ట్రైలర్లో అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం.. అంటూ చైతూ ఓ డైలాగ్ చెబుతాడు. దీంతో చైతూకు కాబోయే భార్య, నటి సమంతకు ఓ అభిమాని అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం అంట.. చైతుగారు ఎదో అంటున్నారని ట్వీట్ చేశాడు. ఆ డైలాగ్ తన విషయంలో కాదులే అంటూ చైతూని సమర్థిస్తూ సమంత ట్వీట్ చేసింది. Ha ha ha migatha ammailu gurinchi 😉 https://t.co/2EHUafqwBu — Samantha Ruth Prabhu (@Samanthaprabhu2) 13 May 2017 -
చీరలో సమంత - నాగచైతన్య ప్రేమ కథ
-
హిట్ కొట్టినా చాన్స్ ఇవ్వడం లేదా..?
టాలీవుడ్లో స్టార్ హీరోయిన్స్ లిస్ట్‌లో ముందుగా వినిపించే పేరు శృతిహాసన్. ఎవడు, రేసుగుర్రం, శ్రీమంతుడు లాంటి వరుస బ్లాక్ బస్టర్స్‌లో నటించిన ఈ బ్యూటి, ప్రస్తుతం తెలుగులో ఒక్క సినిమాలో మాత్రమే నటిస్తుంది. సాదారణంగా టాలీవుడ్లో ఒక్క హిట్ ఇచ్చినా.. ఆ హీరోయిన్ వెంటే పరిగెడుతుంటారు. అలాంటిది శృతిని మాత్రం పట్టించుకోవట్లేదు. తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ల కొరత ఉందన్న టాక్ ఉన్నా, శృతికి మాత్రం అవకాశాలు రావటం లేదు. ప్రస్తుతం నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న ప్రేమమ్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది శృతి. స్టార్ హీరోల సరసన భారీ బడ్జెట్ సినిమాల్లో నటించిన ఈ బ్యూటి, ప్రేమమ్ లాంటి మీడియం బడ్జెట్ సినిమాను అంగీకరించడం కూడా విశేషమే. ప్రేమమ్‌తో పాటు హిందీలో, తమిళ్లో ఒక్కో సినిమా చేస్తున్న శృతి, కావాలనే సినిమాలను తగ్గించుకుంటుందా..? లేక ఆఫర్లే రావటం లేదా..? అన్న విషయం తెలియలేదు. -
'అది నేనే, కానీ ఆ సినిమాలో కాదు'
మలయాళ సూపర్ హిట్ సినిమా ప్రేమమ్‌తో ఒక్కసారిగా స్టార్ ఇమేజ్ అందుకున్న హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. ప్రస్తుతం మలయాళంతో పాటు ఇతర సౌత్ సినిమాలలో నటిస్తున్న ఈ బ్యూటీ ప్రేమమ్ తెలుగు రీమేక్‌గా రూపొందుతున్న మజ్ను సినిమాలో నాగ చైతన్యకు జోడిగా నటిస్తోంది. అయితే ఈ సినిమాను అనుపమ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో రివీల్ చేస్తూ కొన్ని ఫోటోలు నెట్లో హల్చల్ చేస్తున్నాయి. అయితే ఈ ఫోటోలపై స్పందించిన అనుపమ ఆ ఫోటోలలో ఉన్నది తానే కానీ, అది మజ్ను సినిమా షూటింగ్లో కాదంటూ క్లారిటీ ఇచ్చింది. తాను ఇంతవరకు మజ్ను షూటింగ్లో పాల్గొనలేదన్న అనుపమ, మార్చిలో తాను షూటింగ్లో పాల్గొంటున్నట్టుగా తెలిపింది. అనుపమతో పాటు శృతిహాసన్, మడోనా సెబాస్టియన్లు కూడా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు కార్తీకేయ ఫేం చందూ మొండేటి దర్శకుడు. -
రవితేజ ఒప్పేసుకున్నాడు
షార్ట్ ఫిలిం మేకర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సుధీర్ వర్మ తరువాత డైరెక్టర్‌గా కూడా మారి మంచి విజయాన్నే సాధించాడు. నిఖిల్, స్వాతి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన 'స్వామి రారా..' సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన వర్మ, తొలి సినిమాతోనే స్టార్ హీరోల దృష్టిని కూడా ఆకర్షించాడు. ఎంత సక్సెస్ ఫుల్‌గా లాంచ్ అయినా, ద్వితీయ విఘ్నాన్ని మాత్రం దాటలేకపోయాడు. తొలి సినిమా ఘనవిజయం సాధించటంతో యంగ్ హీరో నాగచైతన్య పిలిచి మరీ సుధీర్‌తో సినిమా చేశాడు. మరోసారి క్రైమ్ థ్రిల్లర్‌నే నమ్ముకున్న సుధీర్ వర్మ నాగచైతన్య హీరోగా 'దోచెయ్' సినిమాను రూపొందించాడు. అయితే ఈ సినిమా ఆశించిన స్ధాయిలో ఆకట్టుకోలేదు. దీంతో అప్పటి వరకు బిజీ డైరెక్టర్ అయిపోతాడనుకున్న సుధీర్ ఒక్కసారిగా డీలా పడిపోయాడు. అప్పటినుంచి మరోసారి తనను తాను ప్రూవ్ చేసుకోవటం కోసం ఒక్క ఛాన్స్ అంటూ ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం 'బెంగాల్ టైగర్' రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న రవితేజ, సుధీర్ వర్మతో సినిమాకు అంగీకరించాడన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే కథ కూడా విన్న మాస్ మహరాజ్ చిన్న చిన్న మార్పులు సూచించాడట. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న రవితేజ సుధీర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న యాక్షన్ డ్రామాను కూడా వీలైనంత త్వరగా సెట్స్ మీదకు తీసుకురావాలని భావిస్తున్నాడు. -
మూడోసారి మాయ చేస్తారట..!
ప్రస్తుతం గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో 'సాహసం శ్వాసగా సాగిపో' సినిమాలో నటిస్తున్న నాగచైతన్య అదే డైరెక్టర్‌తో మరో సినిమాకు రెడీ అవుతున్నాడు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'ఏం మాయచేసావే' సినిమాతో తొలి బ్లాక్ బస్టర్ అందుకున్న చైతూ ఆ కృతజ్ఞతతో గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో వరుస సినిమాలకు రెడీ అవుతున్నాడు. 'సాహసం శ్వాసగా సాగిపో' సినిమా తరువాత 'ప్రేమమ్' రీమేక్‌లో నటించనున్న చైతన్య ఆ సినిమా తరువాత మరోసారి గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో నటించనున్నాడు. ఈ సినిమాను తెలుగు, తమిళ్‌తో పాటు కన్నడ, మళయాల భాషల్లోనూ తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడు గౌతమ్ మీనన్. తెలుగు తమిళ భాషల్లో తన గత చిత్రాల్లో నటించిన చైతూ, శింబులనే ఎంపిక చేయగా, కన్నడలో పునీత్ రాజ్‌కుమార్‌ను ఫైనల్ చేశాడు. త్వరలోనే మళయాల నటుడిని ఎంపిక చేసి సినిమాకు సంబందించిన అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. -
చైతూ సినిమాలో నాగ్, వెంకీ
టాలీవుడ్ స్క్రీన్ మీద మల్టీ స్టారర్ సినిమాల హవా కొనసాగుతోంది. కథాపరంగా ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటించే స్థాయి కథలు రాకపోయినా గెస్ట్ అపియరెన్స్లతో అదరగొడుతున్నారు స్టార్స్. ముఖ్యంగా యంగ్ జనరేషన్ హీరోలతో కలిసి నటించడానికి సీనియర్ హీరోలు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఇటీవలే బ్రూస్ లీ సినిమాతో మెగాస్టార్ రీ ఎంట్రీ ఇచ్చేయటంతో మరో ఫ్యామిలీ నుంచి కూడా ఇలాంటి కాంబినేషన్ తెర మీద సందడి చేయనుంది. ప్రస్తుతం గౌతమ్ మీనన్ దర్శకత్వంలో 'సాహసం శ్వాసగా సాగిపో' సినిమాలో నటిస్తున్న నాగచైతన్య, ఆ సినిమా పూర్తవ్వగానే మళయాళ సూపర్ హిట్ సినిమా ప్రేమమ్ రీమేక్‌లో నటించనున్నాడు. తెలుగులో మజ్ను పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు కార్తీకేయ ఫేం చందూ మొండేటి దర్శకుడు. ఇటీవల ఈ సినిమా రైట్స్ కూడా సొంతం చేసుకున్న చిత్రయూనిట్ త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ను సెట్స్ మీదకు తీసుకెళ్లాలని భావిస్తుంది. చైతూ సరసన మళయాళ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఈ సినిమాకు మరింత గ్లామర్ యాడ్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. సినిమాలో కీలక సన్నివేశాల్లో కనిపించే ఓ ఇంపార్టెంట్ రోల్‌ను సీనియర్ హీరో వెంకటేష్‌తో చేయించాలని భావిస్తున్నారు. వెంకీతో పాటు మరో అతిథి పాత్రలో నాగ్ కూడా నటించే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. నాగచైతన్యకు ఈ రెండు కుటుంబాల నేపథ్యం ఉండటంతో మజ్ను సినిమాలో నాగ్, వెంకీలు నటించటం ఖాయంగా కనిపిస్తుంది. ప్రస్తుతానికి గాసిప్‌గా ఉన్న ఈ వార్త నిజమో కాదో తెలియాలంటే మాత్రం అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే. -
అల్లుడి కోసం ఒప్పుకున్న వెంకీ
'గోపాల గోపాల' సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న విక్టరీ వెంకటేష్.. త్వరలోనే ఓ సినిమాను స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే మారుతి, క్రాంతి మాధవ్ లాంటి దర్శకుల చెప్పిన కథలకు ఓకె చెప్పిన వెంకీ, ఎవరు ముందుగా కథ రెడీ చేస్తే వారితో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడట. అయితే ఈ గ్యాప్‌లో నాగచైతన్య చేస్తున్న సినిమాలో అతిథి పాత్రలో నటించనున్నాడు వెంకీ. ప్రస్తుతం గౌతమ్ మీనన్ దర్శకత్వంలో 'సాహసం శ్వాసగా సాగిపో' సినిమాలో నటిస్తున్న చైతూ ఆ సినిమా పూర్తవ్వగానే మళయాల సూపర్ హిట్ సినిమా 'ప్రేమమ్' రీమేక్ లో నటించనున్నాడు. అయితే ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించడానికి సీనియర్ స్టార్ వెంకటేష్ అంగీకరించాడు. తన మేనల్లుడు నాగచైతన్య స్వయంగా అడగటంతో ఈ క్యారెక్టర్ చేయడానికి వెంకీ వెంటనే ఒప్పేసుకున్నాడు. ఒరిజినల్ వర్షన్లో అనంత్ నాగ్ నటించిన పాత్రలో తెలుగులో వెంకీ దర్శనమివ్వనున్నాడు. 'కార్తీకేయ' ఫేం చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్, దిశాపటానీ, అనుపమా పరమేశ్వరన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రేమమ్ తెలుగు రీమేక్‌కు మజ్ను అనే టైటిల్‌ను ఫైనల్ చేశారు. -
ఆ జంటను మూడోసారి కలుపుతారట..
హైదరాబాద్: టాలీవుడ్ మిల్క్ బ్యూటీ తమన్నా మరోసారి నాగ చైతన్యతో జతకట్టే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే రెండు చిత్రాల్లో నటించి చూడ చక్కని జోడి అనిపించుకున్న వీరిద్దరు మరోసారి వెండితెరపై చిందేయనున్నారు. ఇద్దరు కూడా మిల్క్ బాయ్, మిల్క్ గర్ల్‌గా ఉంటారు. సినీ వర్గాల సమాచారం మేరకు చందు మొండేటి దర్శకత్వం వహించనున్న నాగ చైతన్య చిత్రంలో తమన్నాను కథానాయికగా ఎంపిక చేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో ప్రారంభంకానున్న షూటింగ్ ద్వారా వీరిద్దరు మరోసారి కెమెరా ముందుకు వచ్చే అవకాశం ఉందట. ఇప్పటికే100 % లవ్ స్టోరీ చిత్రంలో బావ మరదళ్లుగా వీరు చేసిన హంగామా.. అంతా ఇంతా కాదు. బావ మరదళ్లు అంటే ఇలా ఉండాలి అనిపించేలా అందరిమనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఇక తడాఖా సినిమాలో కూడా వీరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగా వర్కవుట్ అయింది. ఆ రెండు చిత్రాలు కూడా సూపర్ హిట్ కావడంతో మరోసారి ఈ హిట్ కాంబినేషన్‌కు ప్లాన్ చేశారట చిత్ర దర్శకుడు. ఇప్పటికే పలు చిత్రాల్లో బిజీగా ఉన్న ఈ అమ్మడుకు ఇంకా కథ వినిపించలేదని, తాము అనుకున్న ప్రకారం జరిగితే మరోసారి ఈ జంట ప్రేక్షకులను పలకరిస్తుందని టాలీవుడ్ వర్గాల సమాచారం.