కంటిపై కునుకు పట్టనివ్వని సమంత | samantha have a many opportunities in industry after marriage | Sakshi
Sakshi News home page

కంటిపై కునుకు పట్టనివ్వని సమంత

Published Fri, Dec 22 2017 5:35 PM | Last Updated on Thu, Mar 28 2019 6:18 PM

samantha have a many opportunities in industry after marriage - Sakshi

సాక్షి, సినిమా: సమంత కంటిపై కునుకు పట్టనివ్వడం లేదట. ఇటీవలే ‘సమంత రూథ్‌ ప్రభు’ పేరులో తండ్రి పేరును మార్చుకుని జీవిత భాగస్వామి ఇంటి పేరును చేర్చుకుని ‘సమంత అక్కినేని’  అయిన విషయం తెలిసిందే. అదే విధంగా ఈ చెన్నై చంద్రం హైదరాబాద్‌ బ్యూటీగా మారిపోయారు. ప్రస్తుతం క్రేజీ హీరోయిన్లలో ఒకరిగా రాణిస్తున్న సమంత, తెలుగు, తమిళ భాషల్లో చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇదే సహ నటీమణులకు కంటి మీద కునుకు రానీయకుండా చేస్తున్న అంశం. 

సమంత కథానాయకిగా మంచి ఫామ్‌లో ఉండగానే టాలీవుడ్‌ యువ నటుడు నాగచైతన్యతో ప్రేమలో పడిన విషయం తెలిసిందే. ఈ ప్రేమ సక్సెస్‌ అవుతుందా.? వీరు అసలు పెళ్లి పీటలు ఎక్కుతారా.? అన్న ఆసక్తి, అనుమానాలతో చాలా మంది ఎదురుచూశారు. నాగచైతన్య, సమంతల వివాహం విజయవంతంగా జరిగింది. అయితే వివాహానంతరం తాను నటనకు దూరం కాను అని సమంత ముందుగానే ప్రకటించినా, చాలా మంది పెళ్లి తరువాత హీరోయిన్‌ అవకాశాలు తగ్గుతాయి అని అనుకున్నారు. ఇక సహ నటీమణులయితే సమంత మనకు పోటీ అవ్వదు, ఆమె అవకాశాలన్నీ తమ తలుపులు తడతాయని సంబరపడ్డారు. అలాంటి వారికే ఇప్పుడు సమంత కంటికి కునుకు పట్టనీయడం లేదు. 

పెళ్లి అయిన వెంటనే నటించడానికి రెడీ అయిపోయిన సమంతకు అవకాశాలు ఏ మత్రం తగ్గలేదు. తెలుగు, తమిళం భాషల్లో చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. తెలుగులో రామ్‌చరణ్‌కు జంటగా రంగస్థలం, మహానటి సావిత్రి జీవిత చరిత్రతో తెరకెక్కుతున్న ద్విభాషా చిత్రం నడిగైయార్‌ తిలగం(తెలుగులో మహానటి), తమిళంలో విశాల్‌కు జంటగా ఇరుంబుతిరై, సూపర్‌ డీలక్స్‌ చిత్రాలలో నటిస్తున్నారు. పెళ్లి అయిన తరువాత కూడా సమంత క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు. కాగా ఇకపై గ్లామరస్‌ పాత్రలు చేయబోనని, నటనకు అవకాశం ఉన్న పాత్రల్నే ఎంపిక చేసుకుని నటిస్తానని అని సమంత నిర్ణయం తీసుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement