నాలుగు భాషల నటులతో.. | Gautham Menon plans multilingual film with four languages stars | Sakshi
Sakshi News home page

నాలుగు భాషల నటులతో..

Published Tue, Oct 13 2015 12:32 PM | Last Updated on Sun, Sep 3 2017 10:54 AM

నాలుగు భాషల నటులతో..

నాలుగు భాషల నటులతో..

సౌత్ ఇండియా స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ మరో భారీ ప్రాజెక్ట్ ను ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం నాగచైతన్య హీరోగా 'సాహసం శ్వాసగా సాగిపో' అనే సినిమా చేస్తున్న గౌతమ్.. అదే సినిమాను శింబు హీరోగా తమిళంలో తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా తరువాత మరో భారీ బహుభాషా సినిమాకు ప్లాన్ చేస్తున్నాడు గౌతమ్ మీనన్.

తెలుగు, తమిళం, మళయాళ, కన్నడ భాషల హీరోలతో ఓ భారీ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాలో తెలుగు నుంచి అల్లు అర్జున్, తమిళం నుంచి శింబు, కన్నడ నుంచి పునీత్ రాజ్ కుమార్, మళయాళం నుంచి ఫహాద్ ఫాజిల్ నటిస్తున్నారు. అయితే ఈసినిమాను ఏయే భాషల్లో తెరకెక్కిస్తున్న విషయం మాత్రం ఇంకా ప్రకటించలేదు. అయితే నాలుగు భాషలకు సంబంధించిన హీరోలు నటిస్తున్నారు కాబట్టి సినిమా కూడా నాలుగు భాషల్లో తెరకెక్కే ఛాన్స్ కనిపిస్తోంది.

తమిళ, మళయాళ భాషల్లో ఈ సినిమాను గౌతమ్ మీనన్ స్వయంగా నిర్మిస్తుండగా కన్నడ లో పునీత్ రాజ్ కుమార్ ప్రొడ్యూస్ చేయనున్నాడు. తెలుగు వర్షన్ ఎవరు నిర్మిస్తారన్న విషయంలో ఇంక క్లారిటీ రాలేదు. నాలుగు భాషలకు సంబందించిన నటులు కలిసి నటిస్తుండటంతో డేట్స్ అడ్జస్ట్ అయి సినిమా సెట్స్ మీదకు వెళ్లడానికి మరింత సమయం పట్టనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement