మరోసారి తమిళ స్టార్ డైరెక్టర్తో నాని | Nani, Gautham Menon to join hands again | Sakshi
Sakshi News home page

మరోసారి తమిళ స్టార్ డైరెక్టర్తో నాని

Published Tue, Nov 1 2016 2:20 PM | Last Updated on Mon, Sep 4 2017 6:53 PM

మరోసారి తమిళ స్టార్ డైరెక్టర్తో నాని

మరోసారి తమిళ స్టార్ డైరెక్టర్తో నాని

ఘర్షణ, ఏం మాయ చేశావే, రాఘవన్ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్న తమిళ దర్శకుడు గౌతమ్ మీనన్. తన ప్రతీ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేసే గౌతమ్ మీనన్, నాగచైతన్య హీరోగా తెరకెక్కిన సాహసం శ్వాసగా సాగిపో సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తాజాగా మరో టాలీవుడ్ యంగ్ హీరోతో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు.

గతంలో నాని హీరోగా ఎటో వెళ్లిపోయింది మనసు సినిమాను తెరకెక్కించిన గౌతమ్ మీనన్ మరోసారి అదే హీరోతో సినిమాను ప్లాన్ చేస్తున్నాడట. సాహసం శ్వాసగా సాగిపో సినిమా తరువాత ధనుష్ హీరోగా ఓ సినిమాను రూపొందించిన గౌతమ్, ప్రస్తుతం నాని హీరోగా తెరకెక్కబోయే సినిమా స్క్రిప్ట్ ను ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు.

ఈ సినిమా తమిళ వర్షన్ లో హీరో ఎవరన్న విషయం తెలియాల్సి ఉంది. ఇప్పటికే నాని చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం నేను లోకల్ సినిమాలో నటిస్తున్న నాని ఆ సినిమా తరువాత వేణు శ్రీరామ్ దర్శకత్వంలో సినిమాకు కమిట్ అయ్యాడు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తరువాతే గౌతమ్ మీనన్ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement