హీరోకు తప్పని 'సినిమా' కష్టాలు | simbu selvarghavan kaan put on hold due to financial issue | Sakshi
Sakshi News home page

హీరోకు తప్పని 'సినిమా' కష్టాలు

Published Wed, Oct 14 2015 8:40 AM | Last Updated on Sun, Sep 3 2017 10:57 AM

హీరోకు తప్పని 'సినిమా' కష్టాలు

హీరోకు తప్పని 'సినిమా' కష్టాలు

కోలీవుడ్ యంగ్ హీరో శింబుకి బ్యాడ్ టైం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇటీవల తన సినిమా రిలీజ్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్న శింబుకు తాజాగా మరో షాక్ తగిలింది. శింబు హీరోగా తెరకెక్కుతున్న 'కాన్' సినిమా షూటింగ్ దశలో ఆగిపోయింది. ఆర్థిక కారణాలతో సినిమా ఆగిపోయినట్టుగా చెపుతున్నారు చిత్రయూనిట్.

'7/జి బృందావన్ కాలనీ', 'ఆడవారిమాటలకు అర్థాలే వేరులే' సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా దగ్గరైన సెల్వరాఘవన్ డైరెక్షన్లో 'కాన్' సినిమాను ప్రారంభించాడు శింబు. చాలా కాలం కిందటే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేసిన చిత్రయూనిట్ ఒక షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తి చేశారు. తరువాత ఆర్థిక సమస్యలు ఎదురవ్వటంతో అనుకున్న సమయానికి రెండో షెడ్యూల్ ను ప్రారంభించలేదు.

ప్రస్తుతం గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో నటిస్తున్న శింబు 'కాన్' విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నాడు. సెల్వ భార్య గీతాంజలి నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పట్లో తిరిగి ప్రారంభమయ్యే అవకాశం కనిపించకపోవటంతో, వేరే సినిమాలు సైన్ చేయాలా లేక వెయిట్ చేయాల అర్థం కాక ఇబ్బంది పడుతున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement