Kaan
-
హీరోకు తప్పని 'సినిమా' కష్టాలు
కోలీవుడ్ యంగ్ హీరో శింబుకి బ్యాడ్ టైం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇటీవల తన సినిమా రిలీజ్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్న శింబుకు తాజాగా మరో షాక్ తగిలింది. శింబు హీరోగా తెరకెక్కుతున్న 'కాన్' సినిమా షూటింగ్ దశలో ఆగిపోయింది. ఆర్థిక కారణాలతో సినిమా ఆగిపోయినట్టుగా చెపుతున్నారు చిత్రయూనిట్. '7/జి బృందావన్ కాలనీ', 'ఆడవారిమాటలకు అర్థాలే వేరులే' సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా దగ్గరైన సెల్వరాఘవన్ డైరెక్షన్లో 'కాన్' సినిమాను ప్రారంభించాడు శింబు. చాలా కాలం కిందటే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేసిన చిత్రయూనిట్ ఒక షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తి చేశారు. తరువాత ఆర్థిక సమస్యలు ఎదురవ్వటంతో అనుకున్న సమయానికి రెండో షెడ్యూల్ ను ప్రారంభించలేదు. ప్రస్తుతం గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో నటిస్తున్న శింబు 'కాన్' విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నాడు. సెల్వ భార్య గీతాంజలి నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పట్లో తిరిగి ప్రారంభమయ్యే అవకాశం కనిపించకపోవటంతో, వేరే సినిమాలు సైన్ చేయాలా లేక వెయిట్ చేయాల అర్థం కాక ఇబ్బంది పడుతున్నాడు. -
విదేశాల్లో కూడా ఆ సినిమా విడుదల
చెన్నై: ప్రముఖ తమిళ దర్శకుడు సెల్వ రాఘవన్ దర్శకత్వం వహిస్తున్న తమిళ థ్రిల్లర్ సినిమా 'ఖాన్'ను అంతర్జాతీయ స్థాయిలో విడుదల చేయనున్నారు. శింబు హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని జాతీయ భాషల్లోనే కాకుండా అంతర్జాతీయ స్థాయి భాషలైన స్పానిష్, ఫ్రెంచ్, పోర్చుగీస్ వంటి భాషల్లో కూడా తర్జుమా చేయనున్నారు. తమ చిత్రాన్ని జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా గొప్పగా ఆధరిస్తారన్న నమ్మకం తనకు ఉందంటూ ఆయన బుధవారం ట్వీట్ చేశారు. మొత్తం పది అంతర్జాతీయ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని తెలిపారు. ఈ చిత్రంలో తాప్సీ, కేథరిన్లు హీరోయిన్లుగా నటించారు. అయితే, ఈ అంతర్జాతీయంగా విడుదల చేసే చిత్రంలో పాటలు ఉండవని, సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాతే దర్శకుడు స్పష్టమైన నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.