
ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. మహాబలిపురం నుంచి చెన్నైకి కారులో ప్రయాణిస్తుండగా శోలింగనల్లూరు సిగ్నల్ వద్ద ఆయన కారు, టిప్పర్ లారీని ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో కారులోని ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో గౌతమ్ మీనన్‌కు పెను ప్రమాదం తప్పింది. స్వల్ప గాయాలతో ఆయన బయటపడ్డారు.
ఈ ప్రమాదంలో ఆయన ప్రయాణిస్తున్న కారు మాత్రం పూర్తిగా ధ్వంసమైంది. స్వల్పంగా గాయపడిన ఆయన ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ప్రేమకథా చిత్రాలను తీయడంలో సిద్ధహస్తుడైన గౌతమ్ మీనన్ తమిళంతో పాటు తెలుగులో పలు సూపర్‌హిట్ చిత్రాలను తెరకెక్కించారు.