‘పెళ్లిచూపులు’ టీమ్‌కు కేసీఆర్‌ అభినందన | telangana cm kcr wishes to pellichupulu movie unit | Sakshi
Sakshi News home page

‘పెళ్లిచూపులు’ టీమ్‌కు కేసీఆర్‌ అభినందన

Published Sat, Apr 8 2017 5:53 PM | Last Updated on Wed, Aug 15 2018 9:37 PM

‘పెళ్లిచూపులు’  టీమ్‌కు కేసీఆర్‌ అభినందన - Sakshi

‘పెళ్లిచూపులు’ టీమ్‌కు కేసీఆర్‌ అభినందన

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ’పెళ్లిచూపులు’  టీమ్‌ను అభినందించారు.  పెళ్లి చూపులు సినిమా జాతీయ ఉత్తమ భాషాచిత్రంగా ఎంపిక కావడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. చిత్ర దర్శక, నిర్మాతలను, నటీనటులను, సాంకేతిక సిబ్బందికి కేసీఆర్‌ అభినందనలు తెలిపారు.

అలాగే ఉత్తమ మాటల రచయితగా ఎంపికైన తరుణ్‌ భాస్కర్‌కు కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. చిత్ర పరిశ్రమకు చెందిన తెలంగాణ పౌరులు అత్యంత ప్రతిభ ప్రదర్శిస్తూ జాతీయ స్థాయి గుర్తింపు పొందడం రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణమన్నారు.
అలాగే సమగ్ర వినోదాత్మక చిత్రంగా ‘శతమానం భవతి’ ఎంపికతో పాటు, ‘జనతా గ్యారేజ్‌’ సినిమాలో నృత్యాలకు గాను ఉత్తమ నృత్య దర్శకుడుగా రాజు సుందరం ఎంపిక కావడం పట్ల సీఎం హర్షం తెలిపారు. ఇదే స్పూర్తితో తెలుగు చిత్ర పరిశ్రమ మరిన్ని విజయాలు అందుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

కాగా శుక్రవారం ప్రకటించిన 64వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ‘పెళ్లిచూపులు’ ఉత్తమ తెలుగు చిత్రం కేటగిరి కింద ఎంపిక అయింది. ఉత్తమ సంభాషణల కేటిగిరి అవార్డు తరుణ్ భాస్కర్‌ (పెళ్లిచూపులు)ను వరించింది. దాస్యం తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రాజ్ కందుకూరి, యాశ్ రంగినేని నిర్మించిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, రీతూ వర్మ నటించారు.ఇక ఉత్తమ నృత్య దర్శకుడిగా రాజుసుందరం (జనతా గ్యారేజ్)ను, ఉత్తమ ప్రజాదరణ చిత్రంగా శతమానం భవతి ఎంపిక అయిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement