Best Telugu film Award
-
ఏం మాట్లాడాలో తెలియటం లేదు.. ఫస్ట్ రియాక్షన్ విత్ సాక్షి
-
తెలుగు సినిమాలకు అవార్డుల పంట
-
‘కలర్ ఫోటో’కు జాతీయ అవార్డు.. స్పందించిన హీరో సుహాస్
కేంద్ర ప్రభుత్వం 68వ జాతీయ చలన చిత్ర అవార్డులను శుక్రవారం ప్రకటించింది. జాతీయ అవార్డుల్లో తెలుగు చిత్రాలు సత్తా చాటాయి. మూడు సినిమాలకు నాలుగు జాతీయ అవార్డులు దక్కాయి. నాట్యం సినిమాకు రెండు, కలర్ ఫోటో, అల వైకుంఠపురం సినిమాకు ఒక్కో అవార్డు లభించింది. ఉత్తమ తెలుగు చిత్రంగా ‘కలర్ ఫోటో’ అవార్డు గెలుచుకుంది. ఒక చిన్న సినిమా జాతీయ అవార్డును అందుకోవడం హాట్‌టాపిక్‌గా మారింది. కాగా 2020లో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. కలర్ ఫోటోకు జాతీయ అవార్డు దక్కిన సందర్భంగా సినిమా హీరో సుహాస్ తన ఆనందాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. కలర్ ఫోటోకు జాతీయ స్థాయిలో అవార్డు లంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. సినిమాకు అవార్డు వస్తుందని ఊహించలేదని, హీరోగా చేసిన మొదటి సినిమాకే అవార్డు దక్కడం మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉందన్నారు. ఈ అవార్డు సినిమాకే దక్కుతుందని, ఎప్పుడైనా సినిమానే గెలుస్తుందన్నారు. అవార్డు వచ్చిన విషయం తనకు తెలియదని, ముందుగా డైరెక్టర్ సందీప్‌యే కాల్ చేసి కంగ్రాట్స్ చెప్పారని అన్నారు. ప్రస్తుతం మిగతావారు కూడా కాల్ చేస్తున్నారని సుహాస్ తెలిపారు. సినిమా విడుదలైన సమయంలో దక్కిన ఆనందం.. ఇప్పుడు నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత అంతే ఆనందంగా ఫీల్ అవుతున్నట్లు పేర్కొన్నారు. క్రెడిట్ అంతా డైరెక్టర్‌కే చెందుతున్నారన్నారు. సినిమాకు పనిచేసిన వాళ్లందరికి ఈ అవార్డు అంకితమని అన్నారు. చదవండి: కలర్ ఫోటో సినిమాకు జాతీయ అవార్డు -
పెళ్లి చూపులు టీమ్‌కు ఎంపీ కవిత అభినందనలు
హైదరాబాద్: జాతీయ అవార్డులను అందుకున్న ‘పెళ్లిచూపులు’ సినిమా యూనిట్‌ను నిజామాబాద్ ఎంపీ కవిత అభినందించారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ కుటుంబ కథా చిత్రాలకు ఎప్పుడు ఆదరణ ఉంటుందన్నారు. మంచి సినిమాలు తీసేవారికి తెలంగాణ ప్రభుత్వం సహకారం ఎప్పుడూ ఉంటుందని ఆమె తెలిపారు. కాగా ఎంపీని కలిసినవారిలో చిత్ర నిర్మాతలు యాష్ రంగినేని, రాజ్ కందుకూరిలతో పాటు దర్శకుడు దాస్యం తరుణ్ భాస్కర్ , హీరో విజయ్ దేవరకొండ తల్లిదండ్రులు మాధవి, వర్ధన్ దేవరకొండ, మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్, అభయ్ బేచిగంటిలు తదితరులు ఉన్నారు. 64వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో పెళ్లిచూపులు సినిమాకు ఉత్తమ తెలుగు చిత్రంతో పాటు, ఉత్తమ సంభాషణల కేటిగిరి అవార్డు వరించింది. నిన్న ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి చేతుల మీదగా చిత్ర యూనిట్ ఆ అవార్డులను అందుకున్నారు. -
‘పెళ్లిచూపులు’ టీమ్‌కు కేసీఆర్ అభినందన
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ’పెళ్లిచూపులు’ టీమ్‌ను అభినందించారు. పెళ్లి చూపులు సినిమా జాతీయ ఉత్తమ భాషాచిత్రంగా ఎంపిక కావడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. చిత్ర దర్శక, నిర్మాతలను, నటీనటులను, సాంకేతిక సిబ్బందికి కేసీఆర్ అభినందనలు తెలిపారు. అలాగే ఉత్తమ మాటల రచయితగా ఎంపికైన తరుణ్ భాస్కర్‌కు కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. చిత్ర పరిశ్రమకు చెందిన తెలంగాణ పౌరులు అత్యంత ప్రతిభ ప్రదర్శిస్తూ జాతీయ స్థాయి గుర్తింపు పొందడం రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణమన్నారు. అలాగే సమగ్ర వినోదాత్మక చిత్రంగా ‘శతమానం భవతి’ ఎంపికతో పాటు, ‘జనతా గ్యారేజ్’ సినిమాలో నృత్యాలకు గాను ఉత్తమ నృత్య దర్శకుడుగా రాజు సుందరం ఎంపిక కావడం పట్ల సీఎం హర్షం తెలిపారు. ఇదే స్పూర్తితో తెలుగు చిత్ర పరిశ్రమ మరిన్ని విజయాలు అందుకోవాలని ఆయన ఆకాంక్షించారు. కాగా శుక్రవారం ప్రకటించిన 64వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ‘పెళ్లిచూపులు’ ఉత్తమ తెలుగు చిత్రం కేటగిరి కింద ఎంపిక అయింది. ఉత్తమ సంభాషణల కేటిగిరి అవార్డు తరుణ్ భాస్కర్ (పెళ్లిచూపులు)ను వరించింది. దాస్యం తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రాజ్ కందుకూరి, యాశ్ రంగినేని నిర్మించిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, రీతూ వర్మ నటించారు.ఇక ఉత్తమ నృత్య దర్శకుడిగా రాజుసుందరం (జనతా గ్యారేజ్)ను, ఉత్తమ ప్రజాదరణ చిత్రంగా శతమానం భవతి ఎంపిక అయిన విషయం తెలిసిందే. -
'పెళ్లిచూపులు'కు జాతీయ అవార్డులు