పెళ్లి చూపులు టీమ్‌కు ఎంపీ కవిత అభినందనలు | trs MP kavitha wishes to pellichupulu movie unit | Sakshi
Sakshi News home page

పెళ్లి చూపులు టీమ్‌కు అభినందనలు

Published Thu, May 4 2017 8:07 PM | Last Updated on Thu, Aug 9 2018 4:51 PM

పెళ్లి చూపులు టీమ్‌కు ఎంపీ కవిత అభినందనలు - Sakshi

పెళ్లి చూపులు టీమ్‌కు ఎంపీ కవిత అభినందనలు

హైదరాబాద్‌: జాతీయ అవార్డుల‌ను అందుకున్న ‘పెళ్లిచూపులు’  సినిమా యూనిట్‌ను నిజామాబాద్ ఎంపీ క‌విత‌ అభినందించారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ కుటుంబ కథా చిత్రాలకు ఎప్పుడు ఆదరణ ఉంటుందన్నారు. మంచి సినిమాలు తీసేవారికి తెలంగాణ ప్రభుత్వం సహకారం ఎప్పుడూ ఉంటుందని ఆమె తెలిపారు.

కాగా ఎంపీని కలిసినవారిలో  చిత్ర నిర్మాత‌లు యాష్ రంగినేని, రాజ్ కందుకూరిల‌తో పాటు దర్శకుడు దాస్యం త‌రుణ్‌ భాస్కర్ , హీరో విజయ్‌ దేవ‌ర‌కొండ త‌ల్లిదండ్రులు మాధ‌వి, వ‌ర్ధన్ దేవ‌ర‌కొండ‌, మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగ‌ర్‌, అభ‌య్ బేచిగంటిలు తదితరులు ఉన్నారు. 64వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో పెళ్లిచూపులు సినిమాకు ఉత్తమ తెలుగు చిత్రంతో పాటు, ఉత్తమ సంభాషణల కేటిగిరి అవార్డు వరించింది. నిన్న ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి చేతుల మీదగా చిత్ర యూనిట్‌ ఆ అవార్డులను అందుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement