'పెళ్లిచూపులు'పై మనసుపడ్డ సల్మాన్? | Pelli Choopulu For Salman Khan? | Sakshi
Sakshi News home page

'పెళ్లిచూపులు'పై మనసుపడ్డ సల్మాన్?

Published Sat, Aug 6 2016 6:52 PM | Last Updated on Mon, Sep 4 2017 8:09 AM

'పెళ్లిచూపులు'పై మనసుపడ్డ  సల్మాన్?

'పెళ్లిచూపులు'పై మనసుపడ్డ సల్మాన్?

ఇటీవల చిన్న సినిమాగా రిలీజై పెద్ద విజయాన్ని అందుకున్న చిత్రం 'పెళ్లిచూపులు'. లో బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం భారీగానే కలెక్ట్ చేస్తుంది. రొటీన్ రొడ్డకొట్టుడుకి బ్రేక్ వేస్తూ క్లీన్ ఎంటర్టెయినర్గా ఉందనే మౌత్ టాక్తో రోజు రోజుకీ ప్రేక్షకాదరణ పొందుతోంది. పెళ్లిచూపులు సినిమాపై బాలీవుడ్ సుల్తాన్ సల్మాన్ ఆసక్తి చూపుతున్నారట. స్టోరీ లైన్, రివ్యూలు విన్న తరువాత సల్మాన్ సినిమా చూడాలని నిశ్చయించుకున్నారట. నచ్చితే రీమేక్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని టాక్.

పెళ్లిచూపులు నిర్మాత సురేష్ బాబు త్వరలోనే సల్మాన్కు సినిమా చూపించేందుకు ప్లాన్ చేస్తున్నారట.  సల్మాన్కు దగ్గుపాటి ఫ్యామిలీతో ఇప్పటికే మంచి అనుబంధం ఉంది. హిందీ రీమేక్ కు కూడా సురేష్ బాబే నిర్మాతగా వ్యవహరిస్తారని సమాచారం. సల్మాన్ బాడీ లాంగ్వేజ్కు తగ్గట్టు కథకు కాస్త మార్పులు చేర్పులు చేసి చిత్రీకరిస్తే బాలీవుడ్లో బంపర్ హిట్ అయ్యే అవకాశాలు లేకపోలేదు. ఇవేం జరగాలన్నా ముందుగా సల్మాన్కు 'పెళ్లిచూపులు' చూసే సమయం దొరకాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement