
పెళ్లి చూపులు సినిమాతో సెన్సేషన్ సృష్టించిన యువ దర్శకుడు తరుణ్ భాస్కర్. తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించిన తరుణ్ తరువాత ఈ నగరానికి ఏమైంది? సినిమాతో ఆకట్టుకున్నాడు. గత ఏడాది జూన్‌లో రిలీజ్ అయిన ఈ సినిమా తరువాత తరుణ్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను మొదలు పెట్టలేదు. ఈ గ్యాప్‌లో విజయ్ దేవరకొండ నిర్మాణంలో హీరోగా నటించేందుకు రెడీ అయ్యాడు.
తాను హీరోగా నటిస్తున్న ప్రాజెక్ట్ పనులు జరుగుతుండగానే దర్శకుడిగా తన తదుపరి చిత్రాన్ని ప్రారంభించేందుకు రెడీ అవుతున్నాడు తరుణ్. త్వరలోనే తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎనౌన్స్‌మెంట్ అంటూ సోషల్ మీడియా ద్వారా హింట్ ఇచ్చాడు. ‘తదుపరి ప్రకటన త్వరలో.. నెర్వస్‌గా ఉంది అలాగే ఎగ్జైటింగ్‌గానూ ఉంది’ అంటూ ట్వీట్ చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment