
ఆఫర్ల మీద ఆఫర్లు
'పెళ్లిచూపులు' సినిమాతో టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయిన యువ హీరో విజయ్ దేవరకొండకి వరుస ఆఫర్లు తలుపు తడుతున్నాయి. సహజమైన నటనతో మెప్పించిన ఈ కుర్రాడికి మంచి భవిష్యత్ ఉందని అంటున్నారు. ఇప్పటికే 'అర్జున్ రెడ్డి' అనే టైటిల్తో వస్తున్న సినిమాలో హీరోగా నటిస్తుండగా ఆ తర్వాత లైన్లో 'ద్వారక' పేరుతో మరో సినిమా ఉంది.
తాజాగా ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన 'వైజయంతీ మూవీస్' బ్యానర్లో మరో సినిమాకు విజయ్ సైన్ చేసినట్లు తెలుస్తుంది. ఈ సినిమా అక్టోబర్లో సెట్స్ పైకి వెళ్లనుంది. నాని హీరోగా గత ఏడాది రిలీజైన 'ఎవడే సుబ్రమణ్యం' సినిమాలో కీలక పాత్ర ద్వారా టాలీవుడ్కి పరిచయమయ్యాడు విజయ్. ఆ సినిమా కూడా వైజయంతీ మూవీస్ బ్యానర్లోనే నిర్మించడం విశేషం.