
ఢిల్లీలో జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానం
ఢిల్లీ: 2014 సంవత్సరానికి గాను 62వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అవార్డు గ్రహీతలను అభినందించారు. భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వ ప్రణాళికలను ఆయన ఈ సందర్భంగా వివరించారు.
భారత చలనచిత్ర సృజనాత్మకత మరింతగా వ్యాపించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి రాజ్య వర్ధన్ సింగ్ రాధోడ్, బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీలు పాల్గొన్నారు. దాదా సాహెబ్ అవార్డుతో పాటు ఉత్తమ చిత్రం,ఉత్తమ జాతీయ నటుడు,ఉత్తమ జాతీయ నటి తదితర అవార్డులను రాష్ట్రపతి తన చేతుల మీదుగా ప్రదానం చేశారు. ఉత్తమ నటుడు కేటగిరీలో కన్నడ నటుడు విజయ్ కుమార్ బి అవార్డు అందుకోగా, ఉత్తమ నటి కేటగిరీలో కంగనా రనౌత్ అవార్డును స్వీకరించింది.
ఉత్తమ నటి అవార్డును అందుకుంటున్న కంగనా రనౌత్
ఉత్తమ నటుడు అవార్డు అందుకుంటున్న కన్నడ నటుడు విజయ్ కుమార్ బి
ఉత్తమ నేపథ్య గాయకుడు అవార్డు అందుకుంటున్న సుఖ్ విందర్ సింగ్
ఉత్తమ బాల నటుడు అవార్డు అందుకుంటున్న విఘ్నేష్