సెల్ఫీ కాదు సెల్ఫిష్‌ | 'Selfie is selfish!' says Yesudas after deleting one shot by fan | Sakshi
Sakshi News home page

సెల్ఫీ కాదు సెల్ఫిష్‌

Published Sun, May 6 2018 12:58 AM | Last Updated on Sun, May 6 2018 12:58 AM

'Selfie is selfish!' says Yesudas after deleting one shot by fan - Sakshi

స్మార్ట్‌ ఫోన్‌ యుగంలో అందరికీ ఫాస్ట్‌గా కనెక్ట్‌ అయిన ట్రెండ్‌ సెల్ఫీ. ఇదివరకు సెలబ్రిటీలు కనిపిస్తే ఆటోగ్రాఫ్‌లు అడిగేవారు. ఇప్పుడంతా సెల్ఫీమయం. కానీ స్టార్‌ సింగర్‌ ఏసుదాస్‌కి ఈ సెల్ఫీ ట్రెండ్‌ నచ్చినట్టు లేదు. అందుకేనేమో ‘సెల్ఫీ కాదు సెల్ఫిష్‌’ అన్నారాయన. ఇటీవల నేషనల్‌ అవార్డ్‌ అందుకోవడానికి ఢిల్లీ వెళ్లారు ఏసుదాస్‌. ఆయన కనపడటంతో మీడియా, అభిమానులు చుట్టుముట్టారు.

ఆ సమయంలో ఓ అభిమాని తన ఫేవరెట్‌ సింగర్‌తో ఓ సెల్ఫీ తీసుకుందాం అనుకుని సెల్ఫీ తీసుకున్నాడు. వెంటనే ఏసుదాస్‌ ఆ సెల్ఫీ తీసుకున్న అభిమానిని ఫొటో డిలిట్‌ చేయమని అడిగారు. అతని చేతిలో ఉన్న ఫోన్‌ లాక్కుని ఆ ఫొటో డిలిట్‌ చేస్తూ ‘ఇది సెల్ఫీ కాదు సెల్ఫిష్‌’ అన్నారు. దీన్నిబట్టి ఏసుదాస్‌కి సెల్ఫీ అంటే ఏమాత్రం ఇష్టం లేదని అర్థం చేసుకోవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement