
బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఆనారోగ్య కారణంగా ‘జాతీయ అవార్డు’ల కార్యాక్రమానికి హాజరు కావడం లేదని తెలిపారు. కాగా కేంద్ర ప్రభుత్వం 2018గానూ అమితాబ్ బచ్చన్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించిన విషయం తెలసిందే. ఈ అవార్డును ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అందించనున్నారు. అయితే జ్వరం కారణంగా ఈ అవార్డును అందుకోలేకపోతున్నట్లు అమితాబ్ ట్విటర్‌లో పేర్కొన్నారు. ‘ప్రస్తుతం నేను జ్వరంతో బాధపడుతున్నాను. అస్వస్థతగా కారణంగా వైద్యులు ప్రయాణం చేయకూడదని సలహా ఇచ్చారు. అందువల్ల నేను సోమవారం ఢిల్లీలో జరిగే అవార్డుల కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నాను. దీనికి నేను చింతిస్తున్నాను’ అంటూ బిగ్ బీ ట్విట్ చేశారు.
కాగా గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుత్ను అమితాబ్ చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఇక అక్టోబర్‌లో ఆసుపత్రి నుంచి వచ్చిన ఆయన దాదాపు 5 కిలోల బరువు తగ్గినట్లు తన ట్విటర్ రాసుకొచ్చారు. ‘గత కొన్ని రోజుల నుంచి నేను క్రమంగా బరువును కోల్పోతున్నాను. డాక్టర్లు నాకు ముందే చెప్పారు నేను బరువు తగ్గడం జరుగుతుందని. ఇలా బరువు తగ్గడం నాకు అద్బుతంగా ఉంది’ అంటూ అభిమానులతో ట్విటర్ వేదికగా ఆయన పంచుకున్నారు.‘చెహ్రే’లో నటించిన బిగ్ బీ నవంబర్‌లో గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 50వ ఎడిషన్ ప్రారంభోత్సవానికి హజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment