జాతీయ అవార్డును ముద్దాడాలన్నది ఎందరో కల.. కానీ కొందరే దాన్ని నెరవేర్చుకోగలరు. 68 ఏళ్లుగా జాతీయ సినీ అవార్డుల పురస్కారం జరుగుతోంది. కానీ ఇంతవరకు ఉత్తమ నటుడి కేటగిరీలో ఒక్కటంటే ఒక్కటి కూడా తెలుగు హీరోకు దక్కలేదు. అది అందని ద్రాక్షగానే మిగిలిపోతుందా? అన్న భయాలను అల్లు అర్జున్ పటాపంచలు చేశాడు. ఎవ్వరైనా రానీ.. ఎవ్వరైనా ఉండనీ.. నీయవ్వ.. తగ్గేదేలే అంటూ బన్నీ.. ఎందరో స్టార్స్‌ను వెనక్కు నెట్టి ఉత్తమ నటుడి అవార్డు కైవసం చేసుకున్నాడు.
దీంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అటు బన్నీ కూడా అవార్డు తనకు ప్రకటించగానే షాక్‌లో ఉండిపోయాడట! ఎవరైనా ప్రశంసించేందుకు ప్రయత్నిస్తున్నా.. నేనింకా షాక్‌లో ఉన్నా.. నమ్మలేకపోతున్నాను అని ఆశ్చర్యం వ్యక్తం చేశాడట! మా ఐకాన్ స్టార్ తలుచుకుంటే అసాధ్యం కూడా సుసాధ్యమవుతుందంటున్నారు అభిమానులు. ఇకపోతే ఉత్తమ నటిగా అలియా భట్ (గంగూబాయి కతియావాడి), కృతి సనన్(మిమీ), ఉత్తమ సహాయ నటుడిగా పంకజ్ త్రిపాఠి(మిమీ), ఉత్తమ సహాయ నటిగా పల్లవి జోషి(ది కశ్మీర్ ఫైల్స్), ఉత్తమ దర్శకుడిగా నిఖిల్ మహాజన్ (గోదావరి) అవార్డులు అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment