Alia Bhatt Praised SS Rajamouli for Time's 100 Most Influential People of 2023 - Sakshi
Sakshi News home page

Alia Bhatt: అలా నటించాలని రాజమౌళి చెప్పారు: అలియా భట్‌

Published Fri, Apr 14 2023 6:27 PM | Last Updated on Fri, Apr 14 2023 6:52 PM

Alia Bhatt Praised RRR Director SS Rajamouli Name In Times Magazine - Sakshi

దర్శకధీరుడు రాజమౌళిపై ప్రశంసల వర్షం కురిపించారు ఆర్ఆర్ఆర్ హీరోయిన్ ఆలియా భట్. ఇటీవలే ప్రపంచవ్యాప్తంగా టైమ్స్ మ్యాగజైన్‌ విడుదల చేసిన 100 మంది అత్యంత ప్రభావవంతుల జాబితాలో రాజమౌళికి చోటు దక్కింది. దీంతో అభిమానులు, సినీ ప్రముఖులు జక్కన్నకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఓ మీడియాతో మాట్లాడిన ఆలియా భట్ రాజమౌళిపై ప్రశంసల వర్షం కురిపించింది. ఈ జాబితాలో బాలీవుడ్‌ బాద్‌షా షారూక్‌ ఖాన్‌ సైతం చోటు సంపాదించారు. 

ఆలియా భట్ మాట్లాడుతూ.. 'తొలిసారి రాజమౌళిని బాహుబలి మూవీ ప్రీమియర్‌లో కలిశా. ఆ సినిమా చూస్తున్నంతసేపు ఆశ్చర్యపోయా. ఎలాగైనా రాజమౌళి దర్శకత్వంలో నటించాలని కోరుకున్నా. ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీతో నా కోరిక నెరవేరింది. ఆయన దగ్గర పనిచేయడమంటే స్కూల్‌కు వెళ్లినట్టే. ఎన్నో కొత్త అంశాలు నేర్చుకుంటారు. అందుకే ఆయనను మాస్టర్‌ స్టోరీ టెల్లర్‌ అని పిలుస్తా. నటనలో ఏదైనా సలహా ఇవ్వాలని కోరగా.. ఏ క్యారెక్టర్‌ అయినా సరే.. ప్రేమతో చేయాలని చెప్పారు. సినిమా హిట్ కాకపోయినా.. మన క్యారెక్టర్ ప్రజలకు గుర్తుండిపోయేలా చేయాలన్నారు.' అంటూ జక్కన్నను ప్రశంసించారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో రాజమౌళి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్నారు. ఆర్ఆర్ఆర్ సాంగ్ నాటునాటుకు ఆస్కార్‌ కూడా రావడంతో ఆయన కీర్తి ఖండాంతరాలు దాటింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement