RRR Movie Team Gives Strong Counter To Rajasthan Royals - Sakshi
Sakshi News home page

RRR Movie: తొక్క తీస్తా.. రాజస్థాన్‌ రాయల్స్‌కు ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌ వార్నింగ్‌

May 8 2023 12:30 PM | Updated on May 8 2023 1:10 PM

RRR Movie Team Counter to Rajasthan Royals - Sakshi

దేశానికి ఆస్కార్‌ను తీసుకొచ్చిన ఆర్‌ఆర్‌ఆర్‌ను అవమానిస్తున్నారా? అని రాజస్థాన్‌ రాయల్స్‌ను ఓ రేంజ్‌లో బ్యాటింగ్‌ చేశారు. తమను తక్కువ చేసి మాట్లా

రాజస్థాన్‌ రాయల్స్‌ వర్సెస్‌ సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌... ఈసారి కూడా మ్యాచ్‌ గోవిందా అనుకుంటున్న సమయంలో సన్‌ రైజర్స్‌ విజృంభించింది. మ్యాచ్‌ చివర్లో వరుసగా సిక్సులు, ఫోర్లు కొట్టి విజయాన్ని ముద్దాడింది. అయితే ఈ విజయాన్ని రాజస్థాన్‌ రాయల్స్‌ జీర్ణించుకోలేకపోయింది. అతిగా రెచ్చిపోయి ఓ ట్వీట్‌ చేసింది. ఫలితంగా సోషల్‌ మీడియాలో విమర్శలు ఎదుర్కొంటోంది. తమ కెప్టెన్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా కంటే గ్రేట్‌(SSS > RRR) అన్నట్లుగా ఓ పోస్ట్‌ పెట్టింది.

ఎవరి కెప్టెన్‌పై వారు పొగడ్తల వర్షం కురిపించుకోవడం ఓకే, కానీ మధ్యలో ఆర్‌ఆర్‌​ఆర్‌ సినిమా ఏం చేసిందని? ఇదే ఎవరికీ అర్థం కాలేదు. బహుశా తెలుగు సినిమా కావడంతో సన్‌రైజర్స్‌కు బదులుగా ఆర్‌ఆర్‌ఆర్‌ను వాడి ఉండవచ్చు. ఏదేమైనా మధ్యలోకి ఆర్‌ఆర్‌ఆర్‌ తీసుకురావడంతో నెటిజన్లు ఆగ్రహంతో ఊగిపోయారు. దేశానికి ఆస్కార్‌ను తీసుకొచ్చిన ఆర్‌ఆర్‌ఆర్‌ను అవమానిస్తున్నారా? అని రాజస్థాన్‌ రాయల్స్‌ను ఓ రేంజ్‌లో బ్యాటింగ్‌ చేశారు. తమను తక్కువ చేసి మాట్లాడితే ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌ ఊరుకుంటుందా? ఆ ట్వీట్‌కు రిప్లైగా వెంకీ సినిమాలో రవితేజను బ్రహ్మానందం కొట్టే వీడియోను పోస్ట్‌ చేసింది.

అటు ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మించిన డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ కూడా దీనికి ఘాటుగానే రిప్లై ఇచ్చింది. ఇడియట్‌ సినిమాలోని 'తొక్క తీస్తా, పెట్టురా సంతకం.. ఫ్యాన్స్‌.. బిల్డప్‌.. పెట్టు త్వరగా' అంటూ థర్టీ ఇయర్స్‌ పృథ్వీ.. శ్రీనివాసరెడ్డిని లాగి ఒక్కటిచ్చే వీడియోను షేర్‌ చేసింది. ఈ విపరీతమైన ట్రోలింగ్‌తో తప్పు తెలుసుకున్న రాజస్థాన్‌ రాయల్స్‌ తర్వాత క్షమాపణలు చెప్తూ ట్వీట్‌ చేసింది. 'ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రపంచవ్యాప్తంగా ఎలా హిట్‌ అయ్యిందో మా క్షమాపణలు వరల్డ్‌ వైడ్‌ రీచ్‌ అయ్యేలా చెబుతున్నాం.. సంజూ సామ్‌సన్‌, ఆర్‌ఆర్‌ఆర్‌.. రెండూ మాకిష్టమైనవే' అంటూ ట్వీట్‌ చేసింది. దీంతో ఈ వివాదానికి తెరపడినట్లైంది.

చదవండి: చైతో డేటింగ్‌ అంటూ రూమర్స్‌.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన హీరోయిన్‌
ప్రెగ్నెన్సీ రూమర్స్‌పై స్పందించిన రానా సతీమణి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement